కోజగారి పూర్ణిమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి.

కోజగారి పూర్ణిమ శరదృతువులో ఆశ్వీయుజ మాసము పౌర్ణమి నాడు పండుగగా జరుపుకుంటారు. ఈ పండగని శరత్-పూర్ణిమ, కొజాగరాత్రిపూర్ణిమ, కాముడిపున్నమి అని కూడా అంటారు. ఈరోజు రాత్రి లక్షీ దేవి ఆకాశమార్గములో తిరిగుతూ ఎవరైతే ఉపవాసముండి తనని పూజిస్తారో వారికి అష్టఐశ్వర్యములు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. హిందువులు ముఖ్యముగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలవారు ఈపండుగ జరుపుకుంటారు.

వ్రతము చేయువిధానము[మార్చు]

ఉదయాన్నే లేచి శుచి శుభ్రముగా స్నానము చేసి ఇంట్లో తూర్పుదిక్కున లక్ష్మీదేవి పూజా మంటపము ఏర్పాటు చేయాలి.లక్ష్మి ప్రతిమను కాని, ఫొటోనికాని ఉంచి విఘ్నేశ్వర పూజచేసి లక్ష్మీదేవిని ఆస్వాదించాలి.ధూప, దీప నైవేద్యాలు పెట్టి భక్తిశ్రద్దలతో లక్ష్మి అష్ట్రోత్రాలు, శ్లోకాలు చదివి పూజచేయాలి.రోజంతా ఉపవాసముండాలి.