Jump to content

శక్తి ఆరాధన

వికీపీడియా నుండి
(శక్తిఆరాధన నుండి దారిమార్పు చెందింది)

హిందూ ధర్మంలో శివుని సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించే వారు శైవులు గానూ విశ్ణువును సర్వశక్తిమంతునిగా ఎంచి ఆరాధించేవారిని వైష్ణవులు గానూ ఆదిశక్తిని త్రిమూర్తులకంటే శక్తిమంతురాలని ఎంచి ఆరాధించే వారు శాక్తేయులు గానూ పిలువబడుతారు. త్రిమూర్తులకు కూడా ఆది పరాశక్తి అని దేవీ భాగవతం వర్ణన. ఇలా ఆరాధించే మూర్తులు అనేకరూపాలలో ఉంటాయి.

ఈ శక్తిని శివుని భార్య పార్వతిదేవిలో ఉన్నాయని భావన. ఆ భావనల్తో అనేక రూపాలలో ఉన్న శక్తిని పార్వతీదేవిగా భావిస్తారు. ఆమె విష్ణువులా రాక్షస సంహారిణి. లోకకంటకులగు అనేక రాక్షసులను ఆమె వధించి లోకాలను రక్షించి ప్రజలకు ఆనందం కలిగించింది. ఊరి పొలిమేరలో కాపలా ఉండి ఊరి ప్రజలను దుష్ట శక్తుల నుండి కాపాడే దేవి పోలేరమ్మ, మసూచి లాంటి రోగాల బారిన పడకుండా కాపాడ టానికి రోగం వచ్చిన తరువాత రోగనివారణకు అమ్మను పూజిస్తారు. కొన్ని రోగాలకు అమ్మవారి పేరు పెట్టి ఇప్పటి వరకూ పురాతన పద్ధతుల ద్వారా రోగ నివారాణ చేసే ఆచారం దేశమంతా అనేకరూపాలలో కనిపిస్తుంది. ప్రతి ఊరికీ గ్రామానికి గ్రామదేవతలు ఉంటారు. ఇలా హిందూధర్మంలో శక్తి ఆరాధన అనేక రూపాలలో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలలో ఆశాపురా మాత అని కూడా పిలుస్తారు.

ఆరాధనా పద్ధతులు దేవీ నామాలు

[మార్చు]
శ్రీవిద్య సంప్రదాయం ప్రకారం నవావరణ పూజ చేస్తున్న శాక్తేయ గురువు శ్రీ అమృతానందనాథ సరస్వతి - సహస్రాక్షిమేరు మందిరం, దేవీపురం

సింధూ నాగరికతలో శివుని పశుపతిగానూ లింగమూర్తిగానూ ఆదిశక్తిని లోకమాతగానూ జన్మకారిణిగానూ భావించి ఆరాధించినట్లు పురాతన అవశేషాలు చెప్తున్నాయి. ఊరి పొలిమేర్లను కాచే దేవిగానూ పెద్ద అమ్మవారుగా పిలువబడే అంటు వ్యాధి మసూచి నివారిణిగా భావించే అమ్మగా రేణుకాదేవి తెలుగునాట పోలేరమ్మగానూ తమిళనాడులో ఎల్లమ్మ, ఎట్టమ్మగానూ ఉరూరా వెలసి పూజింపబడుతుంది. ఉడుపుచలమ అని చెప్పబడే ప్రత్యేక వాయిద్య సహాయంతో చెప్పబడే కథలో రేణుకాదేవి వృత్తాంతం చెప్పడం జమదగ్ని భార్య రేణుకాదేవి రోగాలబాధ నుండి విముక్తి కలిగించే మారెమ్మ అని నిర్ధారణ చేస్తుంది. ఈమె మూర్తి తలవరకు మాత్రమే ఉంటుంది. తలకు మాత్రమే పూజలు చేస్తారు.

నామాలు

[మార్చు]

పల్లెలూ, గ్రామాలూ, ఊర్లూ, పట్టణాలూ ఒక్కో ప్రదేశానికీ ఒక్కో రూపంలో పూజింపబడే అమ్మవార్ల నామాలు కోకొల్లలు. వాటిలో కొన్ని విజయవాడ కనకదుర్గ, కంచి కామాక్షీ, మధుర మీనాక్షి, ముంబాయిలోని మాంబాదేవి, కలకత్తా కాళీ, మైసూరు చాముండి, మూగాంబికా, వైష్ణవీమాత, కాశీ విశాలాక్షీ, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారి ప్రముఖ నామాలలో కొన్ని. గ్రామదేవతలైన పోలేరమ్మ, ఎల్లమ్మ, పైడితల్లి, బతుకమ్మ, రేణుకా, కాకతమ్మా, మాహురమ్మా, శ్రీనాధుని రచనలలో వర్ణింపబడిన మూలగూరమ్మ, పిఠాపురం పీటలమ్మ, సామర్లకోట చామలమ్మ, దాక్షారామం మాణిక్యాలమ్మ లాటి రూపాలు మరికొన్ని

దేశదిమ్మరులూ లైన కొండ దొరలు భవిష్యత్తు చెప్పడం చెప్పించుకోవడం ఒక అలవాటు. వారు చెప్పే ముందు "అంబ పలుకు, జగదంబ పలుకు బెజవాడ కనక దుర్గ పలుకు కాశీవిశాలాక్షి పలుకు" అని ముందుగా దేవి ఆనతి తీసుకుని దేవి పలుకులుగా భవిష్యత్తు చెప్పడం అలవాటు. ఈ అలవాటు ఎరుకలసానులు అనబడే సోది చెప్పే ఆడవారిలో కూడా ఉంది. గంగిరెద్దును తీసుకు వచ్చి బిక్షాటన సాగించే బుడబుక్కల వాళ్ళు అమ్మపేరుతో ఆశీర్వచనాలు గృహస్తులకు ఇస్తుంటారు.

వామాచారం తాంత్రిక పూజలు ప్రజలను భీతావహకులను చేసే క్షుద్రపూజలు, మాంత్రిక శక్తులను సాధించడానికి దేవీ రూపాలలో పూజించడం అలవాటు. దీనిని ఉపాసన అనడం ఆనవాయితీ. వీరు కాళీమాత, రాజరాజేశ్వరీ, లలిత, బాలా త్రిపురసుందరీ మొదలైన నామాలతో ఆరాధిస్తారు.

వాగ్గేయకారులూ దేవిని అంబ, వారాహి, వైష్ణవీ, శారదా, అఖిలాండేశ్వరి, వామినీ ఇత్యాది నామాలతో కీర్తనల రూపంలో దేవీ ఆరాధనచేసారు. దేవి ఆరాధకుడైన కవి కాళిదాసుచే ఆరాధించ బడిన కాళి, కవులచే ఆరాధించబడిన శారదాంబ, వీరిలో కొందరు. ముత్తు స్వామి దీక్షితులచే ఆరాధించబబడిన అంబ జలంధర పీఠవాసిని, శ్యామశాస్త్రిచే ఆరాధించబడిన కామాక్షీ చెప్పుకో తగినవి.

శక్తి ప్రాధానిక నగరాలు

[మార్చు]
మధుర మీనాక్షి ఆలయ గోపురం
కొల్లేటికోట పెద్దింటమ్మ
  • ముంబాయి;-మాంబాదేవి ఆదేవిపేరుతో ఆనగరానికి ముంబాయి అన్న పేరు వచ్చింది.
  • బాసర;-సరస్వతీదేవి ఈ దేవికి ప్రత్యేక ఆలయం అనేకంగా బాసర మాత్రమే.
  • మధుర;-మీనాక్షీ బహుసుందర ఆలయం.
  • కంచి;- శంకరాచార్య పీఠం ఉన్న క్షేత్రం. ఇక్కడ దేవి కామాక్షీ పేరుతో ఆరాధించబడుతుంది.
  • కన్యాకుమారి;-ఇక్కడ దేవి కన్యాకుమారి. ఆమె ముక్కు పుడక ప్రసిద్ధి. నావికులు ఆ ముక్కు పుడక కాంతిని చూసి భరతఖండం వచ్చినట్లు గుర్తిస్తారని ప్రతీతి. ప్రస్తుతం ముక్కు పుడక కనపడకుండా చుట్టూ ఆలయ నిర్మాణం జరిగింది.

నందవరం:- నంద్యాల జిల్లా బనగానపల్లెకు 15కిమీ దూరంలో ఉన్న అత్యంత శక్తివంతమైన క్షేత్రము. సాక్ష్యాత్తు శ్రీ కాశీ విశాలాక్షీ నందన చక్రవర్తి వద్దకు బ్రాహ్మణుల తరుపున సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఇక్కడే స్థిరముగా కొలువైనదని భక్తుల నమ్మకం. సంతానం కోరుకొనే దంపతులకు నందవరం శ్రీ చౌడేశ్వరి దేవీ కొంగు బంగారం.

జమ్మలమడుగు:- భావసార్ క్షత్రియుల ఇలవేల్పు శ్రీ అంబాభవానీ. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం అని భావసార్ క్షత్రియులు ఆరాధిస్తారు.

  • పొద్దుటూరు;-ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం కన్యకాపరమేశ్వరి. ఈ దేవి వైశ్యుల చేత మాత్రమే పూజింపబడుతుంది.
  • కొల్లేటికోట;-కోల్లేటి సరసు మధ్య భాగంలో ఉన్న కొల్లేటి కోటలో దేవి పెద్దింటమ్మగా ఆరాధించబడుతుంది.
  • శృంగేరి;- శంకరాచార్యుల పీఠం ఉన్న క్షేత్రం. శంకరాచార్యులు ఇక్కడ శారదాంబికను చందనమూర్తిగా ప్రతిష్ఠించారు. తదనంతరం విద్యారణ్యులచే ఆలయం నిర్మించబడి శారదాదేవి స్వర్ణమూర్తిగా ప్రతిష్ఠించబడింది. ఈ ఆలయ గోపురం కోణాకృతితో ఎర్రని రాళ్ళతో నిర్మించబడి ఉంటుంది. తుంభద్రా నదీ తీరంలో ఉండటం మరింత సుందరం.
  • సమయపురం;-
  • మేల్మరువత్తూర్;-తమిళనాడులో చెంగల్పట్టు జిల్లాలో ఉన్న మేల్‌మరువత్తూరులో దేవి ఆదిపరాశక్తిగా ఆరాధించబడుతుంది. ఇక్కడ విద్యా, వైద్య సేవలు దేవీ పేరుతో అందిస్తారు.ఇక్కడకు స్త్రీలు తమిళ ఆషాఢమాసంలో దీక్షతీసుకుని ఎర్రటి వస్త్ర ధారణ చేసి దేవిదర్శనానికి వస్తారు.
  • ఉజ్జయిని -ఇది శక్తి పీఠాలలో ఒకటి. ఈ నగర పూర్వనామం అవంతి అని జైన మతరాజైన సుధన్యుడు ఈ నగరాన్ని ఉజ్జయినిగా మార్చాడనితను హిందూమతానికి మారాడనీ అయినా పేరు మాత్రం అలా మిగిలి ఉందనీ ప్రతీతి. ఇక్కడ దేవి కాళిమాతగా ఆరాధించ బడుతుంది. మహాకవి కాళీదాసు కాళిమాతను ఇక్కడే ఆరాధించాడని స్థల పురాణం చెప్తుంది.ఇక్కడ తాత్రిక పూజలు జరుగుతుంటాయి.
  • యాగంటి;-కర్నూలులో లోని యాగంటిలో పార్వతీ దేవి ఉమా నామంతో శంకరునితో వెలసి ఆరాధించ బడుతుంది. ఈ ఆలయం 14వ శతాబ్ధానికి చెందినదని ప్రతీతి. పార్వతీ దేవి భూలోకంలో నివసించాలని శంకరుని వేడగా శంకరునిచే పంపబడిన నందికేశ్వరునిచే ఈ ప్రదేశం కనుగొన బడినదని ఈ ప్రదేశసౌందర్యానికి ముగ్ధుడైన నంది ఆనందాతిశయంతో అక్కడి రాజుని యుద్ధంలో రెండు కొమ్ములమీద ఎత్తి ఆకాశంలో విసరగా ఆయన శంకరుని ప్రార్థించగా శంకరుడు అక్కడ దేవితో వెసిసాడని స్థల పురాణ వివరణ.
  • శ్రీవిల్లిపుత్తూరు;-వైష్ణవ భక్తుడు శ్రీరంగనాధుని సేవాతత్పరుడైన విష్ణుదత్తూని పెంపుడు కూతురైన గోదాదేవి దేవిని ఆండాళ్‌తాయారు అని కూడా పిలుస్తారు. ఈ దేవి శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుదత్తుని ఇంట పెరిగి విష్ణుమూర్తిగా భర్తగా పొందాలని మార్గశిర వ్రతమాచరించి శ్రీరంగనాధునిలో ఐక్యమైందని పురాణ కథనం. ఈ దేవికి శ్రీవిల్లిపుత్తూరులో ఆలయం ఉంది అక్కడ కోవెలలో తులసికోటలోని తులసికోటకు కూడా ప్రత్యేక ఆరాధన చేస్తారు. దేవి గోదాదేవిగా ఆరాధనలందుకుంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]