Jump to content

శారదా పీఠం

వికీపీడియా నుండి
Sharada Peeth
Ruins of Sharada Peeth
మతం
అనుబంధంHinduism
జిల్లాNeelum Valley
RegionKashmir
దైవంSharada
RiteShaktism, Shaivism, Vedism
ప్రదేశం
ప్రదేశంSharda
దేశంPakistan
Map showing the location of the temple relative to the Kashmir region and Pakistan
Map showing the location of the temple relative to the Kashmir region and Pakistan
Location within Kashmir
Map showing the location of the temple relative to the Kashmir region and Pakistan
Map showing the location of the temple relative to the Kashmir region and Pakistan
Location within Pakistan
భూభాగంAzad Kashmir
భౌగోళిక అంశాలు34°47′31″N 74°11′24″E / 34.79194°N 74.19000°E / 34.79194; 74.19000
వాస్తుశాస్త్రం.
శైలిKashmiri[1][2]
లక్షణాలు
వెడల్పు22 అ. (6.7 మీ.)
గరిష్ట ఎత్తు16 అ. (4.9 మీ.)
విస్తీర్ణం4 kanals (0.5 acre)[3]

శారదా పీఠం లేదా సరస్వతీ దేవి శక్తి పీఠం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున ఉండేది. శారదా పీఠం పురాతన హిందువుల మందిరం. ప్రస్తుతం ఇది శిథిలమైన హిందూ దేవాలయం, పురాతన విద్యా కేంద్రం. సా.శ. 6వ, 12వ శతాబ్దాల మధ్య ఇది భారత ఉపఖండంలోని అత్యంత ప్రముఖ దేవాలయ విశ్వవిద్యాలయాలలో ఒకటి అని చెపుతారు. ప్రత్యేకించి దాని గ్రంధాలయానికి అత్యంత ప్రసిద్ధి చెందింది.

ఉత్తర భారతదేశంలో శారద లిపి అభివృద్ధి, ప్రజాదరణ పొందడంలో ఇది కీలక పాత్ర పోషించింది. దీని వలన లిపికి దాని పేరు వచ్చింది. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు. కాశ్మీరీ పండితులు తీర్థయాత్రలలో భాగంగా మూడు పవిత్ర ప్రదేశాలగా మార్తాండ్ సూర్య దేవాలయం, అమర్‌నాథ్ ఆలయాలతోపాటు శారదా పీఠం కూడా సందర్శిస్తారు.

శక్తి పీఠంగా గుర్తింపు

[మార్చు]

హిందూ పురాణాల ప్రకారం ఇది అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటిగా భావిస్తారు.ఇది సతీ దేవత పడిపోయిన కుడి చేతి ప్రదేశంగా ఆధ్యాత్మిక స్థానాన్ని సూచిస్తుందని నమ్ముతారు. శారదా పీఠం కాశ్మీరీ పండిట్‌ల పవిత్ర యాత్రాస్థలాలలో మార్తాండ్ సూర్య దేవాలయం, అమర్‌నాథ్ ఆలయంతో పాటుగా శారదా పీఠం ఒకటి. [4][5] ముజఫరాబాద్ నుండి శారదా పీఠం దాదాపు 150 కిలోమీటర్లు (93 మై.)[6] ఆజాద్ కాశ్మీర్ రాజధాని నుండి 130 కిలోమీటర్లు (81 మై.) కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి [7] నియంత్రణ రేఖ నుండి 10 కిలోమీటర్లు (6.2 మై.), బారాముల్లా నగరానికి 50 కి.మీ దూరంలో ఉంది.ఇది మాజీ రాచరిక రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ , పాకిస్తాన్, భారతదేశ నియంత్రణ ప్రాంతాలను విభజిస్తుంది. ఇది సముద్ర మట్టానికి 1,981 మీటర్లు (6,499 అ.) ఎత్తులో [8] నీలం నది వెంబడి శారదా గ్రామంలో మౌంట్ హర్ముఖ్ లోయలో ఉంది. [9] దీనిని కాశ్మీరీ పండితులు శివుని నివాసంగా నమ్ముతారు. [10]

చరిత్ర

[మార్చు]

దీని నిర్మాణ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.కొందరి చరిత్రకారులు అభిప్రాయం ప్రకారం సా.శ.పూ.237 లో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించాడని అంటారు. కానీ కొంత మంది కుషాన్ సామ్రజ్యంలో నిర్మించబడిందని, మరికొందరు మార్తాండ్ సూర్య దేవాలయంతో పాటు కాశ్మీరీ రాజు లలితాదిత్య ముక్తాపీడుడు సా.శ. 724 - 760 మధ్య కాలంలో నిర్మించాడని అని చెపుతారు.పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి కుడిచేయి పడిన ప్రదేశంఅని తెలుస్తుంది. ఇది 18 మహాశక్తి పీఠాలలో ఒకటి. అయితే ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. రామానుజచార్య బ్రాహ్మణ సూత్రాలపై తన సమీక్షను ఇక్కడ రాశారు.ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు, హిందూ, బౌద్ధ ధర్మాలకూ ఇది నిలయంగా ఉండేది.

ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు.హిందూ విశ్వాసాల ప్రకారం, సతీ దేవి కుడి చేయి ఇక్కడ పడింది.1947 లో భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తరువాత, హిందూ భక్తులు ఆలయాన్ని సందర్శించడంలో ఇబ్బంది పడ్డారు. 2007 లో ఈ ఆలయాన్ని కాశ్మీరీ పండితుడు ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్ ప్రాంతీయ డైరెక్టర్ ప్రొఫెసర్ అయాజ్ రసూల్ నజ్కి సందర్శించారు. అప్పటి నుండి భారతీయ భక్తులను సందర్శించడానికి అనుమతి కోసం వత్తిడి మొదలైంది. కాశ్మీరీ పండిట్లను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించడానికి ఏర్పాటు చేసిన శారదా బచావో కమిటీ భారత ప్రభుత్వంతో పాటు పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఒక లేఖ రాసింది. ముజఫరాబాద్ ద్వారా భక్తులను ఆలయాన్ని సందర్శించడానికి అనుమతించాలని వత్తిడి తెచ్చింది. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం దిగువన వివరింపబడింది.

జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ

అభ్యాస కేంద్రంగా

[మార్చు]

శారదా పీఠంను వివిధ చరిత్రకారులు, ప్రాచీన భారతదేశంలో దాని పౌరాణిక స్థితి, ప్రాముఖ్యతను సూచిస్తారు. దాని చారిత్రక అభివృద్ధి వివిధ చారిత్రక మూలాల ద్వారా చేసిన సూచనల ద్వారా గుర్తించబడింది. శారద లిపి కాశ్మీర్‌లో ఉద్భవించనప్పటికీ, ఇది శారదా పీఠంలో విస్తృతంగా ఉపయోగించబడింది. సంస్థ నుండి లిపికి దాని పేరును పొందింది. లిపి కాశ్మీర్‌లో అభివృద్ధి చేయబడిందనే ప్రజాదరణ పొందిన నమ్మకాన్ని అందించింది. [11]

కొంతమంది చరిత్రకారులు శారదా పీఠం ఎప్పుడూ విద్యా కేంద్రంగా లేదని సూచిస్తారు, ప్రస్తుత రోజుల్లో విద్యా స్థలం నుండి గణనీయమైన శిధిలాలు లేవు. ప్రతిస్పందనగా శారదా పీఠం భూకంపాలకు గురైందని, కూలిపోయిన, పాడుబడిన విశ్వవిద్యాలయం నుండి శిధిలాలను పట్టణ ప్రజలు ఇతర నిర్మాణాలకు ఉపయోగించి ఉండవచ్చుననే అభిప్రాయం వెలిబుచ్చినవారు లేకపోలేదు. [12]

దేవాలయంగా

[మార్చు]

సా.శ. 8వ శతాబ్దం నాటికి ఈ ఆలయం తీర్థయాత్రగా ఉండేది.ఇది నేటి బెంగాల్ నుండి విశేషంగా భక్తులను ఆకర్షిసించేది. [13] 11వ శతాబ్దం నాటికి ఇది భారత ఉపఖండంలో అత్యంత గౌరవనీయమైన ప్రార్థనా స్థలాలలో ఒకటిగా వెలుగొందిందని, అల్-బిరుని భారతదేశ చరిత్రలో వివరించాడు. విశేషమేమిటంటే ఇది అతని కాశ్మీర్ వర్ణనలో కాదు, ముల్తాన్ సూర్య దేవాలయం, స్థానేశ్వర్ మహాదేవ్ ఆలయం, సోమనాథ్ ఆలయంతో పాటు భారత ఉపఖండంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాల జాబితాలో వివరించాడు. [14] [15]

చిత్రమాలిక

[మార్చు]

ప్రస్తుత స్థితి

[మార్చు]

ప్రస్తుతం ఈ పీఠం ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉంది. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ, అటు పాకిస్తాన్ ప్రభుత్వానికి, ఆజాద్ కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.

మూలాలు

[మార్చు]
  1. Singh, Rajesh (3 July 2017). "The Unexplored Medieval Stone Temples of Kashmir". Heritage India Magazine. Archived from the original on 25 September 2018. Retrieved 25 September 2018. However, a few still stand in different states of preservation at places like Martand, Avantipur, Pattan, Buniar, Pandrethan and Payar, reflecting not only the remarkable temple construction activity that once existed in Kashmir but also showcasing a distinct architectural style. This style, while being inspired by foreign elements (as Kashmir is strategically located on one of the arteries of the ancient Silk-Route), also assimilated the essential features of indigenous temple architectural styles.
  2. Bangroo, Virender (July–September 2008). "Temple Architecture of Kashmir". Dialogue. 10. Archived from the original on 2019-09-05. Retrieved 2023-05-16 – via Astha Bharati.
  3. Kumar, Ramesh (16 December 1998 – 15 January 1999). "Sarada Pilgrimage - its Socio-Historicity - I" (PDF). Kashmir Sentinel. 5: 16. Archived from the original (PDF) on 25 September 2018.
  4. Kumar, Ramesh (16 December 1998 – 15 January 1999). "Sarada Pilgrimage - its Socio-Historicity - I".
  5. Error on call to Template:cite paper: Parameter title must be specified
  6. Error on call to Template:cite paper: Parameter title must be specified
  7. Godbole, Sanjay. "The Sharda Temple of Kashmir". Kashmiri Pandit Network / Kashmir Sentinel. Archived from the original on 21 December 2018. Retrieved 21 December 2018.
  8. YUSUF JAMEEL (16 July 2017). "Kashmiri Pandits want reopening of Sharda Peeth in PoK, plan to approach PM". Deccan Chronicle.
  9. Raina, Mohini Qasba (2013). Kashur: The Kashmiri Speaking People. Trafford Publishing. p. 191. ISBN 978-1490701653. The main centre of excellence was at Sharda Peeth - an ancient seat of learning on the banks of the river Kishenganga in the valley of Mount Harmukh.
  10. Ashraf, Mohammad (9 May 2007). "Haramukh and Gangabal, a historical perspective". Kashmir First. Archived from the original on 24 September 2018. Retrieved 25 September 2018. There used to be seventeen temples of various ages and dimensions here which had been built by different Kings of ancient Kashmir from time to time in honour of S'iva who according to legend, had taken residence here as Bhutesa.
  11. (January 2015). "Śarda Temple and the Stone Temples of Kashmir in Perspective: A Review Note". Hazara University Mansehra-Pakistan.
  12. Rashid, Salman (1 April 2018). "Heritage: Goddess of the Mountains". Dawn. Retrieved 30 July 2019.
  13. Kalhana (1900). Kalhaṇa's Rājataraṅginī: A Chronicle of the Kings of Kaśmīr. Translated by Stein, Marc Aurel. Westminster: Archibald Constable and Company, Ltd. pp. 151–152. ISBN 9788120803718.
  14. Rashid, Salman (1 April 2018). "Heritage: Goddess of the Mountains". Dawn. Retrieved 30 July 2019.
  15. Kalhaṇa's Rājataraṅgiṇī. Vol. 3 : a chronicle of the kings of Kaśmīr. Kalhana, Stein, M. A. (Reprint ed.). 2003. ISBN 81-208-0371-X. OCLC 872559688.{{cite book}}: CS1 maint: others (link)

బయటి లంకెలు

[మార్చు]