Jump to content

కొల్హాపూర్

వికీపీడియా నుండి
కొల్హాపూర్
కర్వీర్
—  నగరం  —
కొల్హాపూర్ is located in Maharashtra
కొల్హాపూర్
కొల్హాపూర్
మహారాష్ట్ర పటంలో నగర స్థానం
దేశం  India
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లా కొల్హాపూర్
Founder శిలహారా
జనాభా (2011)[1]
 - మొత్తం 5,61,837
Population rank India : 80th
Maharashtra : 11th
Demonym కొల్హాపురి
క్వధికారిక
 - భాషలు మరాఠీ
Time zone IST (UTC+5:30)
PIN 416001-15
Telephone code 0231
Vehicle registration MH-09

కొల్హాపూర్ మహారాష్ట్ర దక్షిణ భాగంలో పంచగంగా నది ఒడ్డున ఉన్న నగరం. ఇది కొల్హాపూర్ జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం. కొల్హాపూర్‌ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. దాని ఆధ్యాత్మిక చరిత్ర, దాని పుణ్యక్షేత్రం మహాలక్ష్మి పురాతనమైంది. ఈ దేవతను అంబాబాయి అని పిలుస్తారు. కొల్హాపురి చప్పల్ అని ప్రసిద్ధ తోలు చెప్పుల ఉత్పత్తికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. 2019లో ఈ చెప్పులకు భౌగోళిక సూచిక హోదా వచ్చింది.[2] హిందూ పురాణాలలో కొల్హాపూర్‌ను "కర్వీర్" అని పిలుస్తారు. 1947లో భారతదేశం స్వతంత్రం కావడానికి ముందు, కొల్హాపూర్ మరాఠా సామ్రాజ్యంలోని భోసలే ఛత్రపతి ఆధ్వర్యంలో ఒక సంస్థానంగా ఉండేది. మరాఠీ చిత్ర పరిశ్రమకు ఇది ఒక ముఖ్యమైన కేంద్రం.[3]

చరిత్ర

[మార్చు]

శిలాహర కుటుంబం రాష్ట్రకూట సామ్రాజ్యం పతనమైన సమయంలో కొల్హాపూర్‌లో ఒక రాజవంశాన్ని స్థాపించింది. వారు తమ కుటుంబ దేవత అంబాబాయి ఆశీర్వాదం పొందినట్లు వారు తమ రాగి ఫలకం (మహాలక్ష్మి-లబ్ధ-వర-ప్రసాదం)లో పేర్కొన్నారు. కొంకణ్ ఉత్తర శాఖకు చెందిన వారి బంధువుల మాదిరిగానే, కొల్హాపూర్‌లోని శిలాహారులు కూడా జైన పండితుడైన విద్యాధర జీమూతవాహనుడి వంశానికి చెందిన వారని పేర్కొన్నారు. తమ బ్యానరుపై బంగారు గరుడను ప్రదర్శించారు. శిలాహారులు ఉపయోగించే అనేక బిరుదులలో ఒకటి తగరపురావరాధీశ్వరుడు.

సా.శ. 940 నుండి 1212 వరకు కొల్హాపూర్, శిలహార రాజవంశపు అధికార కేంద్రంగా ఉంది.[4] టెర్డాల్ వద్ద ఉన్న ఒక శాసనం, రాజు గొంక (1020 - 1050)ని పాము కాటువేయడంతో జైన సన్యాసి నయం చేశాడు. గోంక ఇరవై రెండవ జైన తీర్థంకరుడు నేమినాథ్‌కు ఆలయాన్ని నిర్మించాడు. ఆ కాలం నుండి, కొల్హాపూర్ చుట్టుపక్కల ఉన్న జైన దేవాలయాలను గొంక-జినాలయ అని పిలుస్తారు.

1055 లో, భోజ I (శిలహర రాజవంశం) పాలనలో, మాఘనంది (కోలాపురియా) అనే ఆధ్యాత్మిక మార్గదర్శి రూపనారాయణ జైన దేవాలయం (బసాది) వద్ద ఒక మతపరమైన సంస్థను స్థాపించాడు. మాఘనందిని సిద్ధాంత-చక్రవర్తి అని కూడా పిలుస్తారు. భోజ I తర్వాత వచ్చిన గండారాదిత్య I వంటి శిలాహర రాజవంశానికి చెందిన రాజులు మాఘనంది శిష్యులు.

కొల్హాపూర్ పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి, చోళ సామ్రాజ్యానికి చెందిన రాజాధిరాజ చోళుడు, అతని తమ్ముడు రాజేంద్ర చోళుడు II ల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగిన ప్రదేశం. సా.శ. 1052 లో, కొప్పం యుద్ధం తరువాత, విజేత అయిన రాజేంద్ర చోళ II, కొల్హాపూర్‌కు వెళ్లి జయస్తంభాన్ని ప్రతిష్టించాడు.[5] సా.శ. 1109 - 1178 మధ్య, కొల్హాపూర్‌లోని ఖిద్రాపూర్‌లో శివుని కోపేశ్వరాలయాన్ని శిలాహర రాజులు, గండారాదిత్య I, విజయాదిత్య, భోజ II లు నిర్మించారు.[6]

కొల్హాపూర్ రాజ్యం

[మార్చు]
ఛత్రపతి రాజర్షి షాహూ మహారాజ్ , కొల్హాపూర్ మహారాజు

మరాఠా పీఠంపై వారసత్వ వివాదం మధ్య 1707లో తారాబాయి కొల్హాపూర్ రాజ్యాన్ని స్థాపించింది. తారాబాయి వారసులు మరాఠా సింహాసనాన్ని ఆక్రమించారు. ప్రముఖ రాజులలో ఒకరు రాజర్షి షాహూ మహారాజ్ (కొల్హాపూర్ షాహు). అతను తన హయాంలో అన్ని కులాల వారికి ఉచిత విద్యను అందించి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. 19వ శతాబ్దంలో ఈ రాష్ట్రాన్ని బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, కొల్హాపూర్ భారత డొమినియన్‌లోకి ప్రవేశించింది. 1949 మార్చి 1 న బొంబాయి రాష్ట్రంలో విలీనమైంది. కొల్హాపూర్ ను కోలాపూర్ అని కూడా పిలుస్తారు.[7] కొల్హాపూర్‌ను దాని గొప్ప మత చరిత్ర కారణంగా దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.

భౌగోళికం

[మార్చు]
కొల్హాపూర్ వద్ద పంచగంగా నది

కొల్హాపూర్ నైరుతి మహారాష్ట్రలో ముంబైకి దక్షిణంగా 373 కి.మీ. దూరంలో ఉన్న ఒక లోతట్టు నగరం. ఇది పూణేకి దక్షిణంగా 228 కి.మీ., బెంగళూరుకు వాయవ్యంగా 615 కి.మీ., హైదరాబాద్‌కు పశ్చిమాన 530 కి.మీ. దూరం లోను ఉంది. ఇది సముద్రమట్టం నుండి 569 మీ. ఎత్తున పశ్చిమ కనుమలలో సహ్యాద్రి పర్వతాలలో ఉంది.[8] పట్టణానికి సమీపంలో ఉమ్‌గావ్ గ్రామం వద్ద తామ్రపర్ణి నదిపై ఆనకట్ట ఉంది. రాధానగరి, కలంబావాడి ఆనకట్టలు కూడా సమీపంలో ఉన్నాయి. పన్హాలా 21.5 కి.మీ. (13.4 మై.), జ్యోతిబా ఆలయం 21.7 కి.మీ. (13.5 మై.) కూడా కొల్హాపూర్ పరిసరాల్లో ఉన్నాయి.

శీతోష్ణస్థితి

[మార్చు]
ఉదయం రంకాలా సరస్సు

కొల్హాపూర్ శీతోష్ణస్థితి మహారాష్ట్రకు సాధారణమైన తీర, లోతట్టు శీతోష్ణస్థితుల మిశ్రమం. ఉష్ణోగ్రత 10 నుండి 35 °C (50 నుండి 95 °F) మధ్య ఉంటుంది పొరుగున ఉన్న లోతట్టు నగరాల కంటే కొల్హాపూర్‌లో వేసవి చల్లగా ఉంటుంది, కానీ చాలా తేమగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు అరుదుగా 35 °C (95 °F) కంటే ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా 33 -- 35 °C (91 -- 95 °F) మధ్య ఉంటుంది. కనిష్ట స్థాయిలు 24 నుండి 26 °C (75 నుండి 79 °F) ఉంటాయి

నగరం పశ్చిమ కనుమలకు సమీపంలో ఉన్న కారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఈ నెలల్లో కురిసే భారీ వర్షాల వలన తరచుగా తీవ్రమైన వరదలు వస్తాయి. 2005, 2006, 2019, 2021 లు వరదలు సంభవించిన సంవత్సరాలు. వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా 19 -- 30 °C (66 -- 86 °F) మధ్య ఉంటాయి.

కొల్హాపూర్‌లో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది. శీతాకాలపు ఉష్ణోగ్రతలు పూణే, నాసిక్ వంటి మహారాష్ట్రలోని ఇతర నగరాల కంటే వెచ్చగా ఉంటాయి. ఎత్తైన ప్రదేశం కావడం, పశ్చిమ కనుమలకు ఆనుకొని ఉండటం వలన కనిష్ట స్థాయిలు 9 నుండి 16 °C (48 నుండి 61 °F) ఉంటాయి గరిష్టాలు 24 నుండి 32 °C (75 నుండి 90 °F) పరిధిలో ఉంటాయి . ఈ సీజన్‌లో తేమ తక్కువగా ఉండటం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

రంకాల సరస్సు నుండి రాత్రి కొల్హాపూర్ సిటీ
శీతోష్ణస్థితి డేటా - Kolhapur (1981–2010, extremes 1946–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 35.4
(95.7)
37.8
(100.0)
40.4
(104.7)
41.7
(107.1)
42.3
(108.1)
40.0
(104.0)
33.3
(91.9)
32.2
(90.0)
35.7
(96.3)
36.5
(97.7)
34.6
(94.3)
35.0
(95.0)
42.3
(108.1)
సగటు అధిక °C (°F) 30.5
(86.9)
32.9
(91.2)
35.6
(96.1)
39.9
(103.8)
35.5
(95.9)
30.0
(86.0)
26.9
(80.4)
26.6
(79.9)
28.8
(83.8)
30.9
(87.6)
30.6
(87.1)
29.8
(85.6)
31.2
(88.2)
సగటు అల్ప °C (°F) 15.2
(59.4)
16.6
(61.9)
19.6
(67.3)
21.7
(71.1)
22.5
(72.5)
22.1
(71.8)
21.4
(70.5)
21.0
(69.8)
20.8
(69.4)
20.3
(68.5)
17.9
(64.2)
15.5
(59.9)
19.5
(67.1)
అత్యల్ప రికార్డు °C (°F) 8.7
(47.7)
8.8
(47.8)
12.4
(54.3)
13.8
(56.8)
16.2
(61.2)
17.6
(63.7)
18.1
(64.6)
18.0
(64.4)
16.4
(61.5)
13.9
(57.0)
9.6
(49.3)
8.6
(47.5)
8.6
(47.5)
సగటు వర్షపాతం mm (inches) 1.1
(0.04)
0.4
(0.02)
5.8
(0.23)
18.5
(0.73)
38.8
(1.53)
213.5
(8.41)
280.0
(11.02)
208.6
(8.21)
124.3
(4.89)
113.4
(4.46)
24.6
(0.97)
5.4
(0.21)
1,034.4
(40.72)
సగటు వర్షపాతపు రోజులు 0.2 0.1 0.3 1.4 2.8 11.6 17.1 16.8 8.5 6.0 1.6 0.4 66.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 38 31 31 40 51 74 83 84 76 61 48 43 55
Source 1: India Meteorological Department[9][10]
Source 2: Government of Maharashtra[11]

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కొల్హాపూర్ నగర జనాభా 5,49,236, 'కొల్హాపూర్ మునిసిపల్, రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ'లో జనాభా 5,61,837.[12] 2011లో కొల్హాపూర్‌లో భారతదేశ జిల్లాలలో అత్యధిక మానవ అభివృద్ధి సూచిక (0.770) ఉంది.[13][14]

  • హిందూ – 4,60,774 (83.89%)
  • ముస్లింలు – 59,760 (10.88%)
  • జైన్ – 18,420 (3.35%)
  • క్రిస్టియన్ – 5,251 (0.96%)
  • బౌద్ధులు – 2,929 (0.53%)
  • పేర్కొనబడలేదు - 1,289 (0.23%)
  • సిక్కు - 581 (0.11%)
  • ఇతరులు – 232 (0.04%

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
DYP సిటీ మాల్, కొల్హాపూర్

తయారీ పరిశ్రమ

[మార్చు]

కొల్హాపూర్ తలసరి దేశీయ ఉత్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువ..పూణే, బెంగుళూరులో ఉన్న పరిశ్రమలకు సహాయక యూనిట్లుగా పనిచేసే ఆటో-అనుబంధ, ఫౌండ్రీ, కాస్టింగ్ పారిశ్రామిక సంస్థలకు నగరం కేంద్రం.[15] ఈ నగరం కొల్హాపురి చప్పల్‌కు నిలయం. ఇది స్థానికంగా కూరగాయల రంగులను ఉపయోగించి, గేదె చర్మంతో చేతితో తయారు చేసిన స్లిప్పర్. మహద్వార్ రోడ్డులో కొల్హాపురి చెప్పులు అమ్ముతారు.[16][17][18] ఇతర హస్తకళలలో వస్త్రాల హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, వెండి, పూసలు, పేస్ట్ జ్యువెలరీ క్రాఫ్టింగ్, కుండలు, చెక్క కళ, లక్క సామాగ్రి, ఇత్తడి షీట్ వర్క్, ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఆర్ట్‌వర్క్, లేసులు, ఎంబ్రాయిడరీ తయారీ ఉన్నాయి.[19]

కొల్హాపూర్ ఒక పారిశ్రామిక నగరం. దాదాపు 300 ఫౌండరీలు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేస్తున్నాయి.[20] కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ల తయారీ కర్మాగారం (KOEL) కొల్హాపూర్ సమీపంలోని కాగల్ వద్ద ఉంది. ఎంఐడిసి లో రేమండ్ బట్టల కర్మాగారం కూడా ఏర్పాటు చేసారు. కొల్హాపూర్‌లో గోకుల్-షిర్గావ్ MIDC, షిరోలి MIDC అనే మరో రెండు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. శివాజీ ఉద్యామ్‌నగర్‌లో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి, ఆయిల్ ఇంజన్‌లలో ప్రత్యేకత కలిగిన పారిశ్రామిక ప్రాంతం.

పర్యాటకం

[మార్చు]

బొంబాయి గెజిటీర్ ఈ ప్రాంతంలో దాదాపు 250 దేవాలయాలున్నట్లు నమోదు చేసింది. వాటిలో 6 - అంబాబాయి, టెంబ్లై, విఠోబా, మహాకాళి, ఫిరంగ, యల్లమ్మ దేవాలయాలు - అత్యంత ప్రముఖమైనవి.[21] దాదాపు 30 లక్షల మంది వార్షిక సందర్శకులతో పర్యాటకం ఒక ముఖ్యమైన ఆదాయ వనరు.[22] కొల్హాపూర్ లోని పర్యాటక ఆకర్షణలు:

సినిమా పరిశ్రమ

[మార్చు]
కొల్హాపూర్‌లో బాబూరావు పెయింటర్ స్మారక చిహ్నం

1917 డిసెంబరు 1న కొల్హాపూర్‌లో బాబూరావు పెయింటర్‌ మహారాష్ట్ర ఫిల్మ్ కంపెనీని స్థాపించాడు. మరాఠీ చిత్ర పరిశ్రమకు ఈ నగరం ప్రాథమిక కేంద్రంగా మారింది. కొల్హాపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు కొల్హాపూర్ ఆతిథ్యం ఇస్తుంది. కొల్హాపూర్ ఫిల్మ్ సిటీని 2017లో పునరుద్ధరించారు.[23]

రవాణా

[మార్చు]

రైల్వే

[మార్చు]

నగరం లోని ఛత్రపతి షాహూ మహారాజ్ టెర్మినస్ నుండి పూణే, ముంబై, బెంగళూరు, న్యూ ఢిల్లీకి ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో కొల్హాపూర్‌ను కలుపుతుంది. రోజువారీ షటిల్ సర్వీస్ కొల్హాపూర్‌ని సెంట్రల్ రైల్వే మెయిన్ లైన్‌లోని మిరాజ్ ప్రధాన రైలు హబ్‌తో కలుపుతుంది. మిరాజ్ నుండి కొల్హాపూర్ మీదుగా వైభవ్వాడి వరకు కొత్త రైల్వే మార్గం నిర్ధారించబడింది. ఇది కొల్హాపూర్‌ను పశ్చిమ తీర ప్రాంతానికి కలుపుతుంది.[24]

రోడ్లు

[మార్చు]

కొల్హాపూర్ జాతీయ రహదారి 4, జాతీయ రహదారి 204 లపై ఉంది. నగరంలో మూడు రాష్ట్ర రవాణా బస్ స్టాండ్‌లు ఉన్నాయి: సెంట్రల్ బస్ స్టాండ్, రంకాలా బస్ స్టాండ్, శంభాజీనగర్ బస్ స్టాండ్. కొల్హాపూర్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ (KMT) స్థానిక బస్సు సేవలను అందిస్తుంది. సిబిఎస్ పశ్చిమ మహారాష్ట్రలో అత్యంత రద్దీగా ఉండే బస్టాండు. ఇక్కడి నుండీ రోజుకు 50,000 కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తారు.

NH 4, (ప్రస్తుతం NH 48) నగరానికి సమీపంలో ఉంది

విమానాశ్రయం

[మార్చు]

కొల్హాపూర్ దేశీయ విమానాశ్రయం, దీనిని ఛత్రపతి రాజారామ్ మహారాజ్ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు, ఇది 9 కి.మీ. దూరంలో ఉజలైవాడి వద్ద ఉంది. కొల్హాపూర్ నుండి హైదరాబాద్, బెంగళూరులకు అలయన్స్ ఎయిర్ ద్వారా రోజువారీ విమానాలు ఉన్నాయి. ఇండిగో హైదరాబాద్ విమానాశ్రయం, తిరుపతి విమానాశ్రయం నుండి రోజువారీ విమానాలను అలాగే అహ్మదాబాద్ విమానాశ్రయానికి వారానికి మూడు సార్లు విమానాలను నడుపుతోంది. ట్రూజెట్, ముంబై విమానాశ్రయం, జల్గావ్ విమానాశ్రయానికి విమానాలను నడుపుతోంది.  

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.demographia.com/db-worldua.pdf [bare URL PDF]
  2. "Kolhapuris: The famous leather chappal get Geographical Indication tag - Geographical Indication tag". The Economic Times.
  3. Kulkarni, Sripad Rao Laxman (2021-03-01). Bharata Darshana (in ఇంగ్లీష్). Leela Prakashana.
  4. Bhavan B. V. "Temples and legends of Maharashtra." 1962 volume 97.
  5. Sastri K. A. N. "The CōĻas." 1935 p. 256–257 (University of Madras, 2000).
  6. The Temples of Maharashtra.
  7. Hertslet's Commercial Treaties. Great Britain: Foreign Office, Great Britain. 1900. p. 1167. Retrieved 7 September 2015.
  8. "Kolhapur" Google Maps.
  9. "Station: Kolhapur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 423–424. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 April 2020.
  10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M144. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 April 2020.
  11. "Climate". Government of Maharashtra. Retrieved 6 April 2020.
  12. "Kolhapur Regional Development Authority". 17 August 2017. Archived from the original on 22 ఆగస్టు 2019. Retrieved 27 జూన్ 2022.
  13. "Research Gate". 20 August 2017.
  14. "RMaharashtra Human Development Report 2012" (PDF). 20 August 2012.
  15. "Kolhapur posts higher per capita domestic product than state's average". 19 March 2015. Retrieved 1 April 2022.
  16. "Kolhapuri chappal to set foot in new markets". Indian Express. 13 June 2000. Retrieved 12 September 2017.
  17. "Kolhapuri chappals come easy on the pocket now."
  18. "Government unveils new trade policy". Indian Express. 5 June 2012. Retrieved 12 September 2017.
  19. "Maharashtra development report."
  20. "MIDC to acquire 1,000 acres for Kagal park."
  21. "PrabhupadaBooks.com Srila Prabhupada's Original Books". prabhupadabooks.com. Retrieved 2022-04-21.
  22. ""Kolhapur Municipal Corporation draft."" (PDF). Archived from the original (PDF) on 2013-10-04. Retrieved 2022-06-27.
  23. Piyush Bhusari (7 February 2017). "Phase 1 work of Kolhapur Chitranagari to be completed by April end". The Times of India. Retrieved 12 September 2017.
  24. "Centre sanctions Rs 250 crore for Kolhapur-Vaibhavwadi rail route". The Times of India. TNN. 12 February 2017. Retrieved 12 September 2017.