థానే

వికీపీడియా నుండి
(ఠాణే నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఠాణే
ఠాణా
—  నగరం  —
[[File:
|250px|none|alt=|పైనుండి, ఎడమ నుండి కుడికి: హీరానందాని ఎస్టేట్, దాదోజీ ఖండదేవ్ స్టేడియమ్, ఉపవన్ సరస్సు, ఈస్టర్న్ ఎక్‌స్ప్రెస్ వే, తలావ్ పాలి]]పైనుండి, ఎడమ నుండి కుడికి: హీరానందాని ఎస్టేట్, దాదోజీ ఖండదేవ్ స్టేడియమ్, ఉపవన్ సరస్సు, ఈస్టర్న్ ఎక్‌స్ప్రెస్ వే, తలావ్ పాలి
ఠాణే is located in Maharashtra
ఠాణే
ఠాణే
మహారాష్ట్ర పటంలో నగర స్థానం
Coordinates: 19°12′49″N 72°58′54″E / 19.213554°N 72.981544°E / 19.213554; 72.981544
దేశం  India
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లా ఠాణే
Area rank 15
జనాభా (2011)
 - మొత్తం 18,86,941
Population rank 15
భాషలు
 - అధికారిక మరాఠీ
Time zone భా.ప్రా.కా (UTC+5:30)
పిన్ కోడ్ 400601—15
Telephone code 022
Vehicle registration MH-04 (Thane City) MH-05 (Kalyan)
Lok Sabha constituencies Thane
Kalyan
Vidhan Sabha constituencies Thane
Kopri-Pachpakhadi
Ovala-Majiwada
Mumbra-Kalwa
Literacy (2017-18) 91.36%

ఠాణే, మహారాష్ట్రలోని మెట్రోపాలిటన్ నగరం. ఇది సాల్సెట్ ద్వీపానికి ఈశాన్య భాగంలో ఉంది. ఠాణే నగరం పూర్తిగా ఠాణే తాలూకా పరిధిలో ఉంది, ఠాణే జిల్లాలోని ఏడు తాలూకాలలో ఇది ఒకటి; అలాగే, ఇది ఠాణే జిల్లాకు ప్రధాన కార్యాలయం. 18,41,488 జనాభాతో సుమారు 147 square kilometres (57 sq mi) ) భూభాగంలో ఇది విస్తరించి ఉంది. ఠాణే, భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన 15వ నగరం.[1] మహారాష్ట్ర వాయవ్య భాగంలో ఉన్న ఈ నగరం, ముంబై నగరానికి పొరుగున ఉంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇది ఒక భాగం.

చరిత్ర[మార్చు]

1787లో ఠాణే కోట పునాదుల దగ్గర AD 1078 నాటి ఒక రాగి ఫలకం కనుగొనబడింది. తగరా ప్రభువు అరికేసర దేవరాజు నుండి భూమి మంజూరు చేసిన శాసనం అది. దీనిలో అతను "శ్రీ స్థానక" అనే నగర నివాసులను ఉద్దేశించి మాట్లాడాడు.[2] ఠాణే చాలా కాలం పాటు మరాఠా సామ్రాజ్యపు సైనిక శిక్షణ, నియామక కేంద్రంగా ఉంది

మొదటి ఆంగ్లో-మరాఠా యుద్ధం ప్రారంభంలో బ్రిటిష్ వారు సల్సెట్ ద్వీపం, థానా ఫోర్ట్, ఫోర్ట్ వెర్సోవా, కరంజా ద్వీప కోటలను ఆక్రమించారు. అయితే కొద్దికాలం తర్వాత హరిపంత్ ఫడ్కే, టుకోజీ హోల్కర్ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. ఇది రెండవ ఆంగ్లో-మరాఠా యుద్ధం వరకు మరాఠా సామ్రాజ్యం నియంత్రణలో ఉంది.[3]

రవాణా[మార్చు]

రైల్వేలు[మార్చు]

ఆసియాలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలుకు థానా టెర్మినస్. 1853 ఏప్రిల్ 16న బోరి బందర్ (బాంబే), ఠాణే మధ్య ప్యాసింజర్ రైలు సర్వీసును ప్రారంభించారు.[4] 34 కి.మీ. దూరం ఉన్న ఈ మార్గంలో రైలును మూడు లోకోమోటివ్‌లు లాగాయి. వీటి పేర్లు సాహిబ్, సింధ్, సుల్తాన్ .

ఠాణే సెంట్రల్, ట్రాన్స్-హార్బర్ లైన్ సబర్బన్ రైల్వే నెట్‌వర్క్ ద్వారా ఠాణేకు పొరుగున ఉన్న శివారు ప్రాంతాలకు అనుసంధానం ఉంది. ఠాణే- వాషి & పన్వెల్ హార్బర్ లైన్ అండ్‌ సెంట్రల్ లైన్ లో ఠాణే రైల్వే జంక్షన్. ఇది భారతదేశంలోని అత్యంత రద్దీ స్టేషన్లలో ఒకటి. ప్రతిరోజూ 654,000 మంది ప్రయాణికులు ఈ స్టేషను గుండా ప్రయాణిస్తారు.[5][6]

మెట్రో[మార్చు]

2019 నాటికి, వడాలా, ఠాణేలు మెట్రో రైల్వే లైన్ ద్వారా అనుసంధానించబడుతున్నాయి.[7] 2015 ఆగస్టు 26న MMRDA, 118 కి.మీ. ల ముంబై మెట్రో నెట్‌వర్క్ కోసం ₹35400 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 40-కిమీ వడాలా - ఘట్‌కోపర్ - ఠాణే-కసర్వదావలి మెట్రో-4 కారిడార్ కూడా ఉంది.[8]

ఠాణే మున్సిపల్ రవాణా[మార్చు]

1989 ఫిబ్రవరి 9న ఠాణే మునిసిపల్ కార్పోరేషను, రవాణా సేవను ప్రారంభించింది. దీనిని ఠాణే మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ (TMT) అని పిలుస్తారు. TMT నగర అంతర్గత రవాణాతో పాటు, ములుండ్, అంధేరి, మీరా రోడ్, నాలా సోపారా, భివాండి, వసాయి, విరార్, బోరివాలి, వాషి, ఐరోలి, ఘాట్‌కోపర్, దాదర్, బాంద్రా, BKC, భయాందర్, కళ్యాణ్, పన్వెల్ వంటి ముంబై శివారు ప్రాంతాలకు రవాణా సేవలను అందిస్తోంది.[9]

భౌగోళికం[మార్చు]

వాతావరణం[మార్చు]

ఠాణేలో ఉష్ణమండల రుతుపవన వాతావరణం ఉంటుంది.మొత్తం వాతావరణం అధిక వర్షపాతం ఉన్న రోజులు, చాలా తక్కువ రోజుల తీవ్ర ఉష్ణోగ్రతలు ఉంటాయి.

శీతోష్ణస్థితి డేటా - Thane
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.5
(85.1)
31.3
(88.3)
32.7
(90.9)
33.1
(91.6)
33.3
(91.9)
31.9
(89.4)
29.8
(85.6)
29.3
(84.7)
30.1
(86.2)
32.9
(91.2)
33.4
(92.1)
31.0
(87.8)
31.7
(89.1)
సగటు అల్ప °C (°F) 15.4
(59.7)
17.3
(63.1)
20.6
(69.1)
23.7
(74.7)
26.1
(79.0)
25.8
(78.4)
24.8
(76.6)
24.5
(76.1)
24.0
(75.2)
23.1
(73.6)
20.5
(68.9)
18.2
(64.8)
22.1
(71.8)
సగటు అవపాతం mm (inches) 3.1
(0.12)
1.0
(0.04)
1.5
(0.06)
2.3
(0.09)
25.1
(0.99)
541.3
(21.31)
922.0
(36.30)
539.7
(21.25)
326.9
(12.87)
93.2
(3.67)
19.1
(0.75)
2.3
(0.09)
2,477.5
(97.54)
Source: Government of Maharashtra

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ఠాణే జనాభా 18,86,941.[10] ఠాణే నగరం యొక్క సగటు అక్షరాస్యత రేటు 91.36 శాతం, ఇక్కడ పురుషుల, స్త్రీల అక్షరాస్యతలు 94.19, 88.14 శాతం. ఠాణే నగరంలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 882 మంది స్త్రీలు. బాలల లింగ నిష్పత్తి 1000 మంది అబ్బాయిలకు 900 మంది బాలికలు. 2011 సెన్సస్ ఇండియా నివేదిక ప్రకారం ఠాణే నగరంలో మొత్తం పిల్లలు (0–6) 1,86,259. 98,017 మంది బాలురు ఉండగా, 88,242 మంది బాలికలు ఉన్నారు. ఠాణే నగరం మొత్తం జనాభాలో 10.24% మంది పిల్లలు ఉన్నారు.[11]

ఠాణే ప్రజల ప్రధాన భాష మరాఠీ. జనాభాలో 70% మంది మరాఠీ మాట్లాడతారు. ఠాణేలోని ఖత్రి వార్డులోని కొన్ని ఈస్ట్ ఇండియన్ కుటుంబాల్లో ఇప్పటికీ పోర్చుగీస్ మాట్లాడతారు.[12] భారతదేశంలో ఉన్న దాదాపు 5,000 మంది యూదులలో 1,800 మంది ఠాణే లోనే నివసిస్తున్నారు.[13]

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

 

మూలాలు[మార్చు]

  1. "District Profile | Thane District, Govt. of Maharashtra | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-22.
  2. Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland, p. 112.
  3. Naravane, M.S. (2014). Battles of the Honourable East India Company. A.P.H. Publishing Corporation. pp. 53–54. ISBN 9788131300343.
  4. Colonialism: An International, Social, Cultural and Political encyclopedia By Melvin Eugene Page, Penny M. Sonnenburg, page 135 Archived 7 జూలై 2014 at the Wayback Machine
  5. Thane is busiest railway station in Mumbai – Times Of India Archived 11 జూన్ 2013 at the Wayback Machine. Articles.timesofindia.indiatimes.com (19 May 2013). Retrieved 16 July 2013.
  6. "Kalyan, Kurla and Thane among the 10 dirtiest stations in the country". Archived from the original on 30 December 2018.
  7. Soon, take a metro from south Mumbai to Thane Archived 30 ఏప్రిల్ 2013 at the Wayback Machine. Hindustan Times (23 April 2013). Retrieved 16 July 2013.
  8. Reporter, B. S. "MMRDA sanctions Rs 35,400 cr for 118 km Mumbai metro network". Archived from the original on 28 August 2015. Retrieved 27 August 2015.
  9. [1] Archived 13 నవంబరు 2008 at the Wayback Machine
  10. Census of India: Sub-District Details Archived 21 జూలై 2011 at the Wayback Machine. Censusindia.gov.in. Retrieved 16 July 2013.
  11. Thane City Population Census 2011 | Maharashtra Archived 18 ఫిబ్రవరి 2013 at the Wayback Machine. Census2011.co.in. Retrieved 16 July 2013.
  12. Thane Gazetteer: Population: Christians – Speech Archived 10 నవంబరు 2010 at the Wayback Machine. Maharashtra.gov.in. Retrieved 21 January 2012.
  13. "Jew in Thane". The Times of India. Archived from the original on 23 December 2017. Retrieved 25 October 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=థానే&oldid=4069642" నుండి వెలికితీశారు