సాంగ్లీ
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి వ్యాసాన్ని వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గంలో చేర్చండి. |
?సాంగ్లీ Maharashtra • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 16°52′01″N 74°34′01″E / 16.867°N 74.567°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
జిల్లా(లు) | సాంగ్లీ |
గ్రామాలు |
}} --> |
జనాభా • అక్షరాస్యత శాతం |
601 (2008 నాటికి) • 77 |
లోక్‌సభ నియోజకవర్గం | సాంగ్లీ & హట్కళ్నగడే |
కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 416416 • +0233 • MH-10 |
సాంగ్లీ, మహారాష్ట్రలోని ఒక జిల్లా, పట్టణము, మరియు జిల్లా పరిపాలనా కేంద్రము. ఇది దక్కన్ పీఠభూమిలో ఉంది. జిల్లాలో 24.51% భాగం పట్టణ ప్రాంతం. [1]. జిల్లా ముఖ్యపట్టణమైన సాంగ్లీ ముంబయ్ నగరానికి ఆగ్నేయంగా 372 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సాంగ్లీ జిల్లా మహారాష్ట్ర పశ్చిమభాగంలో ఉంది. జిల్లాకు ఉత్తరాన సతారా, షోలాపూర్ జిల్లాలున్నాయి. తూర్పున బీజాపూర్ జిల్లా, దక్షిణాన కొల్హాపూర్, బెల్గాం జిల్లాలు, పశ్చిమాన రత్నగిరి జిల్లా ఉన్నాయి. వర్నా, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతంలో సాంగ్లీ జిల్లా ఉంది. కృష్ణా నది ఉపనదులు ఈ జిల్లా సారవంతమైన వ్యవసాయ ప్రాంతంగా అభివృద్ధి కావడానికి దోహదపడుతున్నాయి.
సాంగ్లీ జిల్లా భౌగోళిక స్వరూపంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. చందోలి ప్రాంతంలో సగటు సంవత్సర వర్షపాతం చాలా ఎక్కువగా 4000 మి.మీ. వరకు ఉంటుంది. అత్పది, జాత్ తాలుకాలలో చాలా తక్కువగా 500 మి.మీ. లోపే ఉంటుంది. పశ్చిమ భాగాన దట్టమైన అడవులు ఉన్నాయి. తూర్పు ప్రాంతంలో బీడు భూములు ఉన్నాయి.
పారిశ్రామిక వేత్త లక్ష్మణరావు కిర్లోస్కర్ ఈ జిల్లాలోని కిర్లోస్కర్ వాడిలో తన కర్మాగారాన్ని మొదలుపెట్టాడు. భారతదేశంలో పారిశ్రామిక పట్టణాలలో చాలా చక్కనైనదిగా కిర్లోస్కర్ వాడికి పేరుంది.
విషయ సూచిక
సాంగ్లీ పట్టణం[మార్చు]
సాంగీ పసుపు నగరం గా పేరొందింది. కృష్ణానది ఒడ్డున ఉన్న సాంగ్లీ, ఆసియాలోనే పసుపుకు అతి పెద్ద మార్కెట్.[1] సాంగ్లీ పరిసర ప్రాంతం భారతీదేశంలో చక్కెర అధికంగా పండే ప్రాంతంగా (సుగర్ బెల్ట్) పేరొందింది.[ఆధారం కోరబడింది] ఈ నగరంలో ౩౦ చక్కెర కర్మాగారాలు ఉన్నాయి.[ఆధారం కోరబడింది] సాంగ్లీలోని గణేష్ ఆలయం చారిత్రాత్మకమైనది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.[ఆధారం కోరబడింది] సాంగ్లీ నగరం తనదైన వంటలకు కూడా పేరుపొందింది. భేల్పురి మరియు బాండంగ్ (అటుకులతో తయారు చేసిన ఆహారం) వంటివి ఇక్కడి వంటల్లో కొన్ని.
మరాఠి, కన్నడ ఇక్కడ విస్తృతంగా మాట్లాడే భాషలు.
మహారాష్ట్రలో ద్రాక్షను అత్యధికంగా పండించే ప్రాంతాల్లో సాంగ్లీ కూడా ఒకటి. ద్రాక్ష సారాయిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సాంగ్లీకి ౩౦ కిలోమీటర్ల దూరంలో కృష్ణా వ్యాలీ వైన్ పార్క్‌ను ఏర్పర్చింది. సాంగ్లీ ఇటీవలే, భారతదేశంలో పవన విద్యుత్‌ని సృష్టించే ప్రముఖ ప్రాంతాలలో ఒకటయింది.[ఆధారం కోరబడింది] దాదాపు 900 మెగావాట్ల విద్యుత్‌ని సృష్టించడానికి సాంగ్లీ చుట్టూ సజ్‌లోన్ సంస్థ భారీ పవన విద్యుత్ సంస్థలను ఏర్పర్చింది.
వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు మిరాజ్ మెడికల్ కాలేజ్ వంటి ప్రముఖ విద్యాసంస్థలెన్నో సాంగ్లీలో ఉన్నాయి. వీటితో పాటు, సాంగ్లీకి 50 కిలోమీటర్ల పరిధిలో 15 ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీలు, 13 డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.
సాధారణమైన చిన్న పట్టణంగా ఉన్న సాంగ్లీ వేగంగా పురోగతిని సాధించినట్లు కనబడుతుంది, ఇప్పుడు ఈ నగరంలో అనేక నక్షత్ర హోటళ్లు[ఆధారం కోరబడింది], మాల్స్, మల్టిపెక్స్ థియేటర్లు ఉంటున్నాయి. రింగు రోడ్డుతో కూడిన అనేక 100 feet (30 m) విస్తృతమైన రహదారులు సాంగ్లీలో ఉన్నాయి.
సాంగ్లీ చరిత్ర[మార్చు]
సాంగ్లీ రాజ్యం[మార్చు]
మధ్యయుగపు భారతదేశంలో కుండాల్ (ప్రస్తుతం సాంగ్లీ సమీపంలోని చిన్న గ్రామం) అని వ్యవహరించబడిన ప్రాంతం క్రీ.శ 12వ శతాబ్దిలో చాళుక్య సామ్రాజ్యం రాజధానిగా ఉండేది.[ఆధారం కోరబడింది] ససాంగ్లీ బాంబే ప్రెసిడెన్సీలోని, కొల్హాపూర్-దక్కన్ రెసిడెన్సీలో, బ్రిటిష్ ఇండియాకి చెందిన 11 తుపాకీల వందనం చేసే రాజరిక ప్రభుత్వాలలో ఒకటిగా ఉండేది తర్వాత ఇది దక్కన్ స్టేట్స్ ఏజెన్సీ అయింది. ఇది దక్షిణ మరాఠా జాగిర్లలో ఒకటిగా ఉండేది. ఇతర స్థానిక రాజ్యాలు మరియు బ్రిటిష్ జిల్లాలలో దీని భూభాగం కలిసిపోయి ఉండేది
సాంగ్లీ మరాఠా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అయితే 1801కి ముందు సాంగ్లీని ప్రత్యక్షంగా పేర్కొన్న ప్రస్తావనలేవీ లేవు. శివాజీ హయాంలో, సాంగ్లీ మిరాజ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను మొఘల్ సామ్రాజ్యం నుంచి వశపర్చుకున్నారు. 1801 వరకు, సాంగ్లీ, మిరాజ్ జహగీర్లో కలుపబడి ఉండేది. మొదటి చింతామణ్రావు అప్పాసాహెబ్ పట్వర్ధన్ సాంగ్లీ రాజధానీ నగరంలో ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పర్చాడు.
సాంగ్లీ రాజ్యం 1112 చదరపు మైళ్ల (2942 చదరపు కిలోమీటర్లు) ప్రాంతాన్ని కలిగి ఉండేది. 1901[ఆధారం కోరబడింది]లో దీని జనాభా 226,128గా ఉండేది, ఆ సంవత్సరంలో ఒక్క నగర జనాభాయే 16,829 మంది ఉండేవారు.[ఆధారం కోరబడింది] 1911లో, రాజ్యం £10,౦౦౦ ఆదాయాన్ని ఆర్జించింది.[ఆధారం కోరబడింది]
సాంగ్లీ చిట్టచివరి పాలకుడు కెప్టెన్ హెచ్య.హెచ్ శ్రీమంత్ రాజా సాహేబ్ సరి చింతామనరావు II డుండిరాజ్ రావు అప్పాసాహెబ్ పట్వర్ధన్. సాంగ్లీ 1948 మార్చి 8న భారత్‌లో భాగంగా చేరిపోయింది, ప్రస్తుతం ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో భాగమై ఉంది.
నగరం "సహా గల్లి" ఫదం నుంచి పుట్టింది. (దీనికి మరాఠీలో "ఆరు వరుసలు" అని అర్థం). సాంగ్లీ నగరం నాట్యపంధిరి అని కూడా పేరుపడింది, ఇది మరాఠీ నాటకరంగం పుట్టినల్లు.[ఆధారం కోరబడింది] ఈ నగరం మరాటీ సంగీతం & నాటకరంగంపై గొప్ప సాంస్కృతిక ప్రభావాన్ని కలిగించింది. సాంగ్లీ రాజవంశానికి చెందిన పట్వర్ధన్ హయాంలో 18వ శతాబ్దిలో చారిత్రాత్మకమైన గణపతి ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయం ప్రతి సంవత్సరమూ వేలాది భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది.
సాంగ్లీని పూర్వం దక్షిణ సతారా అని పిలిచేవారు. అనేకమంది సామాజిక, రాజకీయ సంస్కరణ దిగ్గజాలకు సాంగ్లీ పుట్టినిల్లుగా ఉంది. గోపాల్ గణేష్ అగాకర్ తెంబులో జన్మించారు (ఖానాపూర్-ఆట్పాది నియోజకవర్గంలోని చిన్న పట్టణం). బాలగంధర్వ కూడా ఈ జిల్లాలోనే పుట్టారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంతరావు దాదా పాటిల్ కూడా పద్మలెలో పుట్టాడు (సాంగ్లీ సమీపంలో ఉంది).
మతాలు[మార్చు]
90% ప్రజలు హిందువులు.9% ముస్లింలు.1% మంది ఇతర మతాలకు చెందినవారు[ఆధారం కోరబడింది]
శీతోష్ణస్థితి[మార్చు]
సాంగ్లీ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
సాంగ్లీ మూడు ఋతువులతో అర్ధ శుష్క వాతావరణాన్ని కలిగి ఉంటుంది, ఫిబ్రవరి మధ్యనుంచి జూన్ మధ్య వరకు అధిక ఉష్ణోగ్రతతో కూడిన వేసవిని, జూన్ మధ్య నుంచి అక్టోబరు చివరకు వర్షరుతువును, నవంబరు మొదటినుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో మొత్తం వర్షపాతం 25.5 అంగుళాలు (647.7 mm).
సాంగ్లీని చేరుకోవడం ఎలా[మార్చు]
రోడ్డు ద్వారా[మార్చు]
సాంగ్లీ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి NH4పై ఉంది సిటీ సెంటర్ నుంచి ప్రతి 40 కిలోమీటర్ల దూరంలో రెండు నిష్క్రమణ మార్గాలు ఉంటాయి.
- NH4 ఎగ్జిట్ 1-పెథ్ నక: ముంబయ్, పుణె మరియు నార్త్ ఇండియా నుండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ నిష్క్రమణను తీసుకోండి.
- NH4 ఎగ్జిట్ 2-షిరోలి నక: చెన్నయ్, బెంగళూరు, హుబ్లి మరియు దక్షిణ భారతదేశం వైపు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ నిష్క్రమణను తీసుకోండి.
రత్నగిరి నాగపూర్ జాతీయ రహదారి NH 204 కూడా సాంగ్లీ గుండా వెళుతుంది తూర్పు భారతదేశం, కొల్కత్తా, రాయ్‌పూర్, నాగపూర్, ఔరంగాబాద్ మరియు రత్నగిరి నుంచి మీరు సాంగ్లీకి వస్తున్నట్లయితే మీరు ఈ హైవేగుండానే వెళతారు.
MSRTC నుంచి పుణె, ముంబై, కొల్హాపూర్, సోలాపుర్, నాసిక్, ఔరంగాబాద్ మరియు పట్టణాలకు సాంగ్లీ నుంచి ఇంటర్సిటీ బస్ సర్వీసులను నడుపుతోంది. కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా కార్పొరేషన్లు కూడా సాంగ్లీ నుంచి బెల్గాం, హుబ్లి, గోవా, మంగళూర్ మరియు హైదరాబాద్ నుంచి కొన్ని సేవలను నడుపుతున్నాయి.
ప్రైవేట్ AC మరియు నాన్-AC వాల్వో బస్సులు కూడా సాంగ్లీ నుంచి పుణె, ముంబై, సోలాపూర్, హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్, అహమ్మదాబాద్, వడోదర, సూరత్, నాసిక్ మరియు ఇతర నగరాలనుంచి ప్రయాణం చేస్తుంటాయి.
రైలు ద్వారా[మార్చు]
సాంగ్లీ, నగరం నలుదిక్కుల నుంచి రైల్వే నెట్వర్క్ని కలిగి ఉంది సాంగ్లీ నగరంలో రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి మరియు సాంగ్లీ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో 29 సబర్బన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి.
- మిరాజ్ జంక్షన్: ఈ స్టేషను సిటీ సెంటర్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది
మిరాజ్ జంక్షన్ నుంచి 50కి పైగా రైళ్లు ఢిల్లీ, ఆగ్రా, భోపాల్, ముంబై, పుణె, బెంగళూరు, మైసూరు, నాగపూర్, హైదరాబాద్, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, సూరత్, వడోదర, తిరుపతి మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలన్నింటికి ప్రయాణం చేస్తుంటాయి.
- సాంగ్లీ స్టేషను: ఈ స్టేషను సిటీ సెంటర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ స్టేషన్ నుంచి దాదాపు ౩౦ పైగా స్టేషన్లు ఢిల్లీ, ఆగ్రా, భోపాల్, పుణె, బెంగళూరు, మైసూరు, నాగపూర్, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన, సూరత్, వడోదర మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానమవుతూ ప్రయాణిస్తుంటాయి.
మిరాజ్ జంక్షన్‌కి అనుసంధానమై ఉన్న నాలుగు రైల్వే సెక్షన్లు:
- పుణె - సతారా - మిరాజ్ సెక్షన్ (మధ్య రైల్వే పుణె డివిజన్)
- హుబ్లి - బెల్గామ్ - మిరాజ్ సెక్షన్ (వాయవ్య రైల్వే హుబ్లి డివిజన్)
- లాతూర్ - కుర్దువాడి - మిరాజ్ సెక్షన్ (మధ్య రైల్వే సోలాపూర్ డివిజన్)
- కొల్హాపూర్ - మిరాజ్ సెక్షన్ (మధ్య రైల్వే పుణె డివిజన్)
మిరాజ్ జంక్షన్‌కి అనుసంధానమవుతున్న 29 సబర్బన్ రైల్వే స్టేషన్లు విశ్రామ్బాగ్, మాధవనగర్, నండ్రె, భిలవాడి, అమ్నాపుర్, కిర్లోస్కరవాడి, టకారి, భవానినగర్, బోల్యాడ్, బెలాంకి, ఆర్గ్, బెడాగ్, సల్గారె, ధల్గావన్, కవత్మెహంకాల్, లంగర్పేట్, జత్ రోడ్, విజయనగర్, షెడ్బాల్, ఉగర్, కుడాచి, రాయబాగ్, ఘటప్రభ, గోకక్ రోడ్, జైసింగ్ పూర్, నిమ్షిర్గావన్, హట్కనంగలె, రుకాడి, వలివేడ్. మిరాజ్ మరియు సాంగ్లీ స్టేషన్ల నుండి ఈ స్టేషన్లకు షటిల్ ప్యాసింజర్ ట్రెయిన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
గమనిక: పుణె-మిరాజ్-హుబ్లి మార్గంలో ప్రయాణించే అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు మిరాజ్ మరియు సాంగ్లీ స్టేషన్లలో ఆగుతాయి, ఢిల్లీ-బెంగళూరు కర్నాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, మిరాజ్ జంక్షన్ వద్ద మాత్రమే ఆగుతుంది.
గాలి ద్వారా[మార్చు]
సాంగ్లీ కింది అంతర్జాతీయ విమానాశ్రయాలకు రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధించబడింది:
- పుణె విమానాశ్రయం - 227 కిలోమీటర్లు
- ముంబై విమానాశ్రయం - 372 కిలోమీటర్లు
- బెంగళూరు విమానాశ్రయం - 650 కిలోమీటర్లు
రానున్న రాష్ట్రీయ విమానాశ్రయం[మార్చు]
మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లీ నగరానికి 8 కిలోమీటర్ల దూరంలోని కవతె పిరన్ వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంకోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదన పంపింది. AAI ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం పూర్తి చేసి, పౌర విమానయాన మంత్రిత్వశాఖ నుండి ఆమోదం కోసం ఎదురు చూస్తోంది. ఒకసారి ఈ విమానాశ్రయం ఉనికిలోకి వచ్చిందంటే, సాంగ్లీ నగరం భారతదేశంలోని ప్రధాన నగరాలన్నిటితో ప్రత్యక్ష అనుసంధానంలోకి వస్తుంది.[ఆధారం కోరబడింది]
సాంగ్లీ సమీపంలో ఉన్న పర్యాటక స్థలాలు[మార్చు]
సాంగ్లీకి 200 కిలోమీటర్ల పరిధిలో అనేక పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, ఆలయాలు, యాత్రా స్థలాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైన వాటిని కింద ఇస్తున్నాము.
సాంగ్లీ గణపతి ఆలయం - ఇది సాంగ్లీ పట్వర్ధన్ రాజవంశం నిర్మించిన అతి పెద్ద ఆలయం
సాగరేశ్వర్ వైల్ట్ లైఫ్ అభయారణ్యం - భారతదేశంలో మనిషి రూపొందించిన ఏకైక అడవి.[ఆధారం కోరబడింది]
కృష్ణా వ్యాలీ వైన్ పార్క్, పలూస్ - గ్రేప్ & వైన్ పర్యాటకం స్పాట్
చందోలీ నేషనల్ పార్క్ - సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌గా ప్రకటించబడింది
- చందోలీ డ్యామ్ & సరస్సు
- కందార్ వాటర్‌ఫాల్స్
- దండోబా రిజర్వ్ ఫారెస్ట్
- ప్రచిత్గడ్ ఫోర్ట్ - మరాఠా చక్రవర్తి శివరాజ్ మహరాజ్ చేత నిర్మించబడింది
- బట్టిస్ షిరాలా - అటవీ సర్పాలకు పేరు గాంచింది
- ప్రకృతిసహజమైన పసుపు నిల్వ గుంతలు, హరిపూర్
- సంగమేశ్వర్ శివాలయం, హరిపురం
- బగెటిల్ గణేష్ ఆలయం, హరిపురం
- టాస్గావన్ గణేష్ ఆలయం
- ఔడుంబర్ - దత్తాత్రేయ ఆలయం
- నర్సోబవాడి ఆలయం
- ప్రతాపసింగ్ ఉద్యానవనం, రాజ్వాడ చౌక్, సాంగ్లీ
పరిశ్రమలు[మార్చు]
మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC) కి సాంగ్లీలో ఒక ప్రాంతీయ కార్యాలయం ఉంది ఇది సాంగ్లీ మరియు సోలాపూర్ జిల్లాలలో పారిశ్రామిక ప్రాంతాలను నిర్వహిస్తుంటుంది. తక్కువ ఖర్చు[ఆధారం కోరబడింది]తో కూడిన మౌలిక సౌకర్యాలు, నిపుణ కార్మికులు మరియు రియల్ ఎస్టేట్ వంటివాటిని అనుకూలంగా తీసుకుని, పెద్ద కంపెనీలు కూడా మెల్లగా సాంగ్లీ సమీప ప్రాంతానికి రావడం ప్రారంభించాయి
ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు[మార్చు]
కిర్లోస్కర్ బ్రదర్శ్ లిమిటెడ్.కిర్లోస్కరవాడి : పుణె నుంచి 210 కిలోమీటర్లు, మరియు సాంగ్లీ నుంచి 33 కిలోమీటర్లు దూరంలో ఉంది.
కిర్లోస్కర్ బ్రదర్స్ తొలి ప్లాంట్ 1929లో స్థాపించబడింది - కంపెనీ కిర్లోస్కరవాడి జిల్లా: సాంగ్లీ వద్ద ఉంది. ఇది వ్యావసాయిక పనిముట్లు, విద్యుత్తుతో నడిచే పంపులు, సుగర్కేన్ క్రషర్లు, సెంట్రిఫ్యుగల్ పంపులు, స్లుయస్ వాల్వులు వగైరాలను తయారు చేస్తుంది.
- ఇస్లాంపూర్ NH4 హైవేలో MIDC ఇండస్ట్రియల్ ఏరియా[ఆధారం కోరబడింది]
- సాంగ్లీ-మిరాజ్ MIDC ఇండస్ట్రియల్ ఏరియా, కుప్వాడ్
- షిరాలా MIDC ఇండస్ట్రియల్ ఏరియా[ఆధారం కోరబడింది]
- విటా MIDC ఇండస్ట్రియల్ ఏరియా[ఆధారం కోరబడింది]
- కడెగావన్ MIDC ఇండస్ట్రియల్ ఏరియా[ఆధారం కోరబడింది]
- జాత్ MIDC ఇండస్ట్రియల్ ఏరియా[ఆధారం కోరబడింది]
- కవాతే మహంకాళ్ MIDC ఇండస్ట్రియల్ ఏరియా[ఆధారం కోరబడింది]
- వసంతదాదా ఇండస్ట్రియల్ ఏరియా
- మరాథే ఇండస్ట్రియల్ ఏరియా
- మరాజ్ MIDC ఇండస్ట్రియల్ ఏరియా
సాంగ్లీ జిల్లాలో 13కు పైగా సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి
ఆసియాలో అతి పెద్ద సహకార చక్కెర ప్యాక్టరీ వసంతదాదా పాటిల్ సుగర్ ఫ్యాక్టరీ సాంగ్లీలోనే ఉంది.
సుప్రసిద్ధ చిటాలే డైరీ పాల కర్మాగారం సాంగ్లీ సమీపంలోని భిల్వాడీ స్టేషను వద్ద ఉంది.
- ఈ జిల్లాలో 4 కంటే ఎక్కువ సహకార పాల పరిశ్రమలు ఉంటున్నాయి
ఐటి పార్కులు[మార్చు]
MIDC విశ్రామ్బాగ్ వద్ద సాంగ్లీ ఇన్ఫోటెక్ పార్కును అభివృద్ధి చేసింది, ఇది వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కి ఎదురుగా ఉంటుంది. విశ్రామ్భాగ్ రైల్వే స్టేషను ఈ పార్కుకు ఎదురుగా ఉంటుంది. ఐటీ కంపెనీలకోసం 28,000 square feet (2,600 మీ2) నిర్మించడానికి ఇక్కడ ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంది మరియు ఇక్కడ నిర్మాణంకోసం ప్లాట్లు కూడా ఉంటున్నాయి. ఇంతవరకు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజాంట్, పాట్ని, హెచ్‌సిఎల్ లేదా ఐబీఎమ్, ఆక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు సాంగ్లీలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఉద్యోగులను నియమించుకున్నాయి.[ఆధారం కోరబడింది]
స్వర్ణచరుర్భుజి NH4 హైవేలో ఇస్లాంపూర్[ఆధారం కోరబడింది] వద్ద మరొక ఐటీ హబ్ రానుంది, పుణె నుంచి 180 కిలోమీటర్లు మరియు ముంబైకి 350 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది
కృష్ణా వ్యాలీ వైన్ పార్క్[మార్చు]
సాంగ్లీ, భారతదేశంలో ఉత్తమంగా ద్రాక్ష పంట పెరుగుతున్న ప్రాంతాలలో ఒకటి. దీన్నుంచి ప్రయోజనం పొందడానికి మరియు మహారాష్ట్రలో ద్రాక్షసారాయి ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, MIDC, సాంగ్లీ నుండి ౩౦ కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలుస్ వద్ద కృష్ణా వ్యాలీ వైన్ పార్కును నెలకొల్పింది ఈ పార్కు 140 acres (0.57 kమీ2) భూమిలో వ్యాపించింది మరియు అంతర్జాతీయ నాణ్యత కలిగిన వైన్ సంస్థను కలిగి ఉంది.
సమీకృత టెక్స్టైల్ పార్క్[మార్చు]
MIDC సాంగ్లీ జిల్లాలోని స్వర్మ చతుర్భుజి NH4 పైన ఒక అతి పెద్ద సమీకృత టెక్స్టైల్ పార్కును ఏర్పర్చింది. ఈ పార్కు ఇస్లాంపూర్ వద్ద ఉన్న NH4 పేథ్ నక సమీపంలో ఉంది. ఈ టెక్స్టైల్ పార్కు నుంచి కొన్ని ప్రముఖ టెక్స్టైల్ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించాయి, ఈ పార్క్ ఇంతవరకు 10,000[ఆధారం కోరబడింది] యువతకి ఉపాధి కల్పించింది.
వినోదం & షాపింగ్[మార్చు]
మల్టీప్లెక్స్ మూవీ థియేటర్లు[మార్చు]
- బిగ్ సినిమాస్ న్యూ ప్రైడ్ (3 స్క్రీన్లు)
- సినిమాక్స్ (5 స్క్రీన్లు)
సింగిల్ స్క్రీన్ మూవీ థియేటర్లు[మార్చు]
నగరంలో 15 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి.[ఆధారం కోరబడింది]
- స్వరూప్
- ప్రతాప్
- త్రిమూర్తి
- సమర్థ్
- మాలి
- సరస్వతి
మాల్స్ & సూపర్‌మార్కెట్ ఛెయిన్లు[మార్చు]
- SFC మెగా మాల్ - దీంట్లో హైపర్ మార్కెట్ ఛెయిన్ సంస్థలు ఉంటున్నాయి
- శివ్ మెరీడియన్ మాల్
- D-మార్ట్ - 100 ఫీట్ రోడ్
- బిగి బజార్ - రామ్ మందిర్ సర్కిల్
- N-మార్ట్
- స్పినాక్ సూపర్‌మార్కెట్
- భార్తీ బజార్
- తరుణ్ భారత్ బజార్
- వసంత్ భజార్
- వాల్వా బజార్
- హట్టమా బజార్
విద్య[మార్చు]
సాంగ్లీ మిరాజ్ జంట నగరాలు వాల్చంద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పద్మభూషణ్ వసంతరావుదాదా పాటిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బుధగావన్ అండ్ మిరాజ్ మెడికల్ కాలేజ్ వంటి సుప్రసిద్ధ విద్యాసంస్థలను కలిగి ఉన్నాయి, ఇవి దక్షిణ మహారాష్ట్ర రాష్ట్రంలో పురాతన[ఆధారం కోరబడింది] విద్యాసంస్థలలో ఒకటి. నగరం శివార్లలో భూమి అందుబాటులో ఉంటున్నందున సాంగ్లీ నగరానికి 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో కొత్త ఇంజనీరింగ్ & మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి.
1. మరాఠీ బ్రాడ్‌కాస్టింగ్ రేడియో స్టేషను 704 MHzలలో ఒకటి. సాంగ్లీలో ఎమ్ఎమ్. 90.4=గ్రీన్ ఎఫ్ఎమ్ 91.1=రేడియో సిటీ (ఎంత సరదాగా ఉంటుందో) 91.1=యాపిల్ ఎఫ్ఎమ్ 94.3=టమేటో ఎఫ్ఎమ్ 98.3=రేడియో మిర్చి
బయటి లింకులు[మార్చు]
- www.sanglionline.com
- www.sangli.nic.in
- సాంగ్లీ మిర్చి కుప్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్
- సాంగ్లీ ఆన్లైన్
- సాంగ్లీ నగరం గురించి
- Sangli on Google Maps Satellite View of Sangli
- సాంగ్లీ పార్లమెంట్ సభ్యుడు ప్రతీక్ పాటిల్ సైటు
- సాంగ్లీ నగరం
- Sangli World
- Sangli Portal
- BSNL Sangli Telecom
- సాంగ్లీ, మిరాజ్, కుప్వాడి మునిసిపల్ కార్పొరేషన్
- సాంగ్లీ ఫొటోలు
మూలాలు[మార్చు]
- ↑ Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 3723: bad argument #1 to 'pairs' (table expected, got nil).
వెలుపలి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to సాంగ్లీ. |
మహారాష్ట్ర జిల్లాలు |
---|
అకోలా - అమ్రావతి - అహ్మద్ నగర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - కొల్హాపూర్ - గఢ్ చిరోలి - గోదియా - చంద్రపూర్ - జలగావ్ - జల్నా - ధూలే - నందుర్బార్ - నాగపూర్ - నాసిక్ - నాందేడ్ - ఠాణే - పర్భణీ - పూణే - బాంద్రా - బీడ్ - బుల్ఢానా - భండారా - ముంబయి - యావత్మల్ - రత్నగిరి - రాయఘడ్ - లాతూర్ - వార్ధా - వశీం - సతారా - సాంగ్లీ - సింధుదుర్గ్ - సోలాపూర్ - హింగోలి |
- గూగుల్ అనువాద వ్యాసాలు
- All articles with unsourced statements
- Articles with unsourced statements from April 2010
- Articles with unsourced statements from September 2010
- Articles with unsourced statements from December 2010
- భారతీయ రాజరిక రాజ్యాలు
- మహారాష్ట్ర రైల్వే స్టేషన్లు
- మహారాష్ట్రలోని పురపాలక సంఘాలు
- మహారాష్ట్ర
- మహారాష్ట్ర నగరాలు మరియు పట్టణాలు