Jump to content

గడ్చిరోలి

వికీపీడియా నుండి
గడ్చిరోలి
—  పట్టణం  —
గడ్చిరోలి is located in Maharashtra
గడ్చిరోలి
గడ్చిరోలి
మహారాష్ట్ర పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°10′44″N 79°59′26″E / 20.178918°N 79.990614°E / 20.178918; 79.990614
దేశం India
రాష్ట్రం మహారాష్ట్ర
జిల్లా గడ్చిరోలి
Founder ఖండ్క్యా బల్లాల్ షా
జనాభా (2011)
 - మొత్తం 54,152
భాషలు
 - అధికారిక మరాఠీ
Time zone IST (UTC+5:00)
Area code(s) 07132
Vehicle registration MH-33

గడ్చిరోలి మహారాష్ట్ర, గడ్చిరోలి జిల్లాలోని పట్టణం. ఇది మహారాష్ట్ర తూర్పు భాగంలో ఉంది. ఇది ఈ జిల్లాకు పరిపాలనా ప్రధాన కార్యాలయం. వైన్‌గంగ నది నగరం గుండా ప్రవహిస్తుంది. గడ్చిరోలి అడవులకు ప్రసిద్ధి. టేకును వాణిజ్యపరంగా పండిస్తారు. వెదురును వివిధ చేతిపనుల కోసం ఉపయోగిస్తారు.

భౌగోళికం

[మార్చు]

గడ్చిరోలి 20°06′N 80°00′E / 20.10°N 80.0°E / 20.10; 80.0 వద్ద, సముద్రమట్టం నుండి సగటున 217 మీటర్లు (715 అడుగులు) ఎత్తున ఉంది. పట్టణం చుట్టుపక్కల టేకు అడవులు ఉన్నాయి.

భారత ద్వీపకల్పం మధ్యలో ఉన్న గడ్చిరోలిలో ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంటుంది. సంవత్సరంలో చాలా వరకు పొడి వాతావరణం ఉంటుంది. సుమారు 1,000 mమీ. (39 అం.) వార్షిక వర్షపాతం ఉంటుంది. వేసవి కాలం మార్చి నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంటుంది,

జనాభా వివరాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[1] గడ్చిరోలి జనాభా 42,464. జనాభాలో పురుషులు 51%, స్త్రీలు 49%. గడ్చిరోలి సగటు అక్షరాస్యత 74%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 80%, స్త్రీల అక్షరాస్యత 67%. జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.

ప్రధానంగా మాట్లాడే భాషలు మరాఠీ, హిందీ, గోండి, మదీయా, బెంగాలీ, తెలుగు . విద్యా సౌకర్యాల పెరుగుదలతో అక్షరాస్యత శాతం మెరుగుపడుతోంది.

రవాణా

[మార్చు]

గడ్చిరోలికి చంద్రపూర్, నాగ్‌పూర్, భండారా, గోండియాలకు రోడ్ల సౌకర్యం ఉంది. గడ్చిరోలికి రైలు మార్గం లేదు. సమీప రైలుమార్గం వాడ్సా (దేశాయిగంజ్) గుండా వెళుతుంది. గడ్చిరోలి జిల్లాలో వడ్సా మాత్రమే రైల్వే స్టేషన్.

విద్య

[మార్చు]

గడ్చిరోలిలోని అన్ని డిగ్రీ కళాశాలలు ఇటీవల స్థాపించబడిన గోండ్వానా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నాయి.[2] మహారాష్ట్ర ప్రభుత్వం RTM నాగ్‌పూర్ యూనివర్శిటీని విభజించడం ద్వారా గోండ్వానా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది.

మూలాలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  2. "Archived copy". Archived from the original on 12 December 2013. Retrieved 23 December 2019.{{cite web}}: CS1 maint: archived copy as title (link)