సతారా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?సతారా
మహారాష్ట్ర • భారతదేశం
మహారాష్ట్రలో సతారా జిల్లా యొక్క స్థానం
మహారాష్ట్రలో సతారా జిల్లా యొక్క స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°41′29″N 74°00′03″E / 17.69139°N 74.00092°E / 17.69139; 74.00092Coordinates: 17°41′29″N 74°00′03″E / 17.69139°N 74.00092°E / 17.69139; 74.00092
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
10,484 కి.మీ² (4,048 sq mi)
• 742 మీ (2,434 అడుగులు)
జనాభా
జనసాంద్రత
28,08,994 (2001 నాటికి)
• 266.77/కి.మీ² (691/చ.మై)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 415 xxx
• +02162
• MH-11
వెబ్‌సైటు: www.satara.nic.in

సతారా, మహారాష్ట్రలోని ఒక జిల్లా, పట్టణం, జిల్లా కేంద్రము. జిల్లా వైశాల్యం 10,480 కి.మీ.² 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 2,808,994. ఇందులో 14.17% మంది పట్టణ ప్రాంతాలలో ఉన్నారు.[1]. జిల్లా ముఖ్యపట్టణం సహారా కాక ఇతర పట్టణాలు వాయి, కరాడ్, కోరెగావ్, కొయనానగర్, మహాబలేశ్వర్, పంచగని. జిల్లాకు ఉత్తరాన పూణె, తూర్పున సోలాపూర్, దక్షిణాన సాంగ్లీ, పడమర రత్నగిరి జిల్లాలున్నాయి.

పంచగని దృశ్యం

జిల్లాకు పడమటి హద్దుగా సహ్యాద్రి పర్వత శ్రేణి ఉత్తర దక్షిణ దిశలో విస్తరించి ఉంది. ఇది పడమటి కనుమలులో భాగం. ఎగువ కృష్ణానది, దాని ఉపనది భీమా నది ఈ జిల్లాలో ముఖ్యమైన నదులు, నీటి వనరులు. పర్వత ప్రాంతాలలో విలువైన కలప లభిస్తుంది. నీటి పారుదల ఉన్న చోట్ల నేల సారవంతమైనది, మంచి పంటలు పండుతుంది. జిల్లా పశ్చిమ భాగంలో సంవత్సర వర్షపాతం 5మీటర్ల వరకు ఉంటుంది. తూర్పుకు వెళ్ళినకొద్ది వర్షపాతం తక్కువ.

జిల్లాలో 11 తాలూకాలున్నాయి.

సతారాలో పర్యాటక ప్రదేశాలు[మార్చు]

 • పంచగని
 • మహాబలేశ్వర్
 • పటేశ్వర్
 • అజింక్యతారా (మంగళాదేవి మందిరం)
 • యవతేశ్వర్
 • కాస్ సరస్సు
 • బమ్నోలి
 • సజ్జన్ గడ్
 • తోసేఘర్ జలపాతం
 • చల్కెవాడి
 • వందగిరి, కళ్యాణగడ్ కోటలు
 • మయాని పక్షి ఉద్యానవనం
 • కొయనా ఆనకట్ట

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సతారా&oldid=3449874" నుండి వెలికితీశారు