Jump to content

అమరావతి (మహారాష్ట్ర)

అక్షాంశ రేఖాంశాలు: 20°55′33″N 77°45′53″E / 20.92583°N 77.76472°E / 20.92583; 77.76472
వికీపీడియా నుండి
అమరావతి (మహారాష్ట్ర)
నగరం
మేల్‌ఘాట్ సరస్సు, మేల్‌ఘాట్ పులుల సంరక్షణ పార్కు, మేల్‌ఘాట్ పులి, ఏకవీరదేవాలయం
Nickname: 
Headquarter of Amravati division
అమరావతి (మహారాష్ట్ర) is located in Maharashtra
అమరావతి (మహారాష్ట్ర)
అమరావతి (మహారాష్ట్ర)
అమరావతి (మహారాష్ట్ర) is located in India
అమరావతి (మహారాష్ట్ర)
అమరావతి (మహారాష్ట్ర)
అమరావతి (మహారాష్ట్ర) is located in Asia
అమరావతి (మహారాష్ట్ర)
అమరావతి (మహారాష్ట్ర)
Coordinates: 20°55′33″N 77°45′53″E / 20.92583°N 77.76472°E / 20.92583; 77.76472
దేశం India
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాఅమరావతి
Government
 • Typeమ్యునిసిపల్ కార్పొరేషన్
 • Bodyఅమరావతి మ్యునిసిపల్ కార్పొరేషన్
 • మ్యునిసిపల్ కమీషనర్ప్రవీణ్ అస్థికర్[1]
విస్తీర్ణం
 • Total70.8 కి.మీ2 (27.3 చ. మై)
Elevation
343 మీ (1,125 అ.)
జనాభా
 (2011)[2]
 • Total6,46,801
 • RankIndia: 70th
Maharashtra: 9th
Vidarbha: 2nd
 • జనసాంద్రత3,524/కి.మీ2 (9,130/చ. మై.)
DemonymAmravatikar
భాషలు
 • అధికారMarathi
Time zoneUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్
444 601 - 444 607, 444701, 444901
టెలిఫోన్ కోడ్+91-721
Vehicle registrationMH 27 (for entire Amravati district)
Distance from Nagpur152 కిలోమీటర్లు (94 మై.) (land)
Distance from Mumbai663 కిలోమీటర్లు (412 మై.) (land)
అక్షరాస్యతా రేటు93.03%
HDIMedium[3]

అమరావతి విదర్భ ప్రాంతంలో రెండవ అతిపెద్ద నగరం. మహారాష్ట్రలో ఎనిమిదో అతిపెద్ద నగరం. ఇది అమరావతి జిల్లా ముఖ్యపట్టణం. అకోలా, బుల్దానా, వాషిం, యవత్మాల్ జిల్లాలను కలిగి ఉన్న అమరావతి డివిజన్ కు కేంద్రం. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద మహారాష్ట్ర నుండి ఎంపికైన నగరాల్లో ఇది ఒకటి. [5] 1983లో అమరావతి నగరం విదర్భ ప్రాంతంలో రెండవ మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. [6] రాష్ట్ర రాజధాని ముంబైకి తూర్పున 663 కిలోమీటర్లు, నాగ్‌పూర్‌కు పశ్చిమాన 152 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి, నాగ్‌పూర్ తర్వాత విదర్భ ప్రాంతంలో రెండవ అతిపెద్ద నగరం.

భౌగోళికం

[మార్చు]

అమరావతి 20°56′N 77°45′E / 20.93°N 77.75°E / 20.93; 77.75 వద్ద [7] సముద్రమట్టం నుండి సగటు 343 మీటర్లు (1125 అడుగులు) ఎత్తున ఉంది. ఇది నాగ్‌పూర్‌కు పశ్చిమాన 165 కి.మీ. దూరంలో ఉంది. ఈ నగరం పశ్చిమాన పూర్ణా బేసిన్, తూర్పున వార్ధా బేసిన్ యొక్క పత్తి పండించే ప్రాంతాలను వేరుచేసే కొండ మార్గాలకు సమీపంలో ఉంది. విదర్భ ప్రాంతంలోని ఏకైక హిల్ స్టేషన్ అయిన చిఖల్దారా, అమరావతి నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరం విస్తీర్ణం దాదాపు 183.5 కి.మీ2 (70.8 చ. మై.) .

శీతోష్ణస్థితి

[మార్చు]

అమరావతి వేడి, పొడి వేసవి, తేలికపాటి నుండి చల్లని శీతాకాలాలతో ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంటుంది. వేసవి కాలం మార్చి నుండి జూన్ వరకు, వర్షాకాలం జూలై నుండి అక్టోబరు వరకు, శీతాకాలం నవంబర్ నుండి మార్చి వరకూ ఉంటుంది.

శీతోష్ణస్థితి డేటా - Amravati (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 38.0
(100.4)
38.9
(102.0)
43.9
(111.0)
46.1
(115.0)
48.3
(118.9)
46.7
(116.1)
40.2
(104.4)
40.5
(104.9)
38.9
(102.0)
42.6
(108.7)
37.4
(99.3)
35.6
(96.1)
48.3
(118.9)
సగటు అధిక °C (°F) 29.2
(84.6)
31.9
(89.4)
36.2
(97.2)
40.2
(104.4)
41.7
(107.1)
36.5
(97.7)
31.0
(87.8)
29.7
(85.5)
31.4
(88.5)
32.8
(91.0)
30.9
(87.6)
28.9
(84.0)
33.4
(92.1)
సగటు అల్ప °C (°F) 15.3
(59.5)
17.0
(62.6)
20.6
(69.1)
23.4
(74.1)
26.1
(79.0)
24.3
(75.7)
22.5
(72.5)
22.0
(71.6)
22.1
(71.8)
20.4
(68.7)
17.6
(63.7)
15.1
(59.2)
20.5
(68.9)
అత్యల్ప రికార్డు °C (°F) 6.1
(43.0)
5.0
(41.0)
8.9
(48.0)
12.8
(55.0)
17.0
(62.6)
17.0
(62.6)
16.8
(62.2)
15.6
(60.1)
16.8
(62.2)
12.0
(53.6)
8.9
(48.0)
7.8
(46.0)
5.0
(41.0)
సగటు వర్షపాతం mm (inches) 11.4
(0.45)
7.8
(0.31)
15.4
(0.61)
7.0
(0.28)
8.2
(0.32)
128.6
(5.06)
188.2
(7.41)
206.6
(8.13)
125.1
(4.93)
61.9
(2.44)
14.3
(0.56)
7.3
(0.29)
781.8
(30.78)
సగటు వర్షపాతపు రోజులు 0.8 0.6 0.8 0.7 1.2 6.3 10.3 10.9 8.4 2.7 0.8 0.5 44.0
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 45 40 35 29 30 51 71 76 69 54 52 53 51
Source 1: India Meteorological Department[8][9]
Source 2: Government of Maharashtra[10]

జనాభా వివరాలు

[మార్చు]

2011లో అమరావతి నగర జనాభా 6,46,801; ఇందులో పురుషులు, స్త్రీలు వరుసగా 3,30,544, 3,16,257. అమరావతి నగరంలో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 957. 0–6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 62,497. [2]

రవాణా

[మార్చు]
అమరావతి రైల్వే స్టేషన్

రోడ్డు

[మార్చు]

అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ స్టార్ సిటీ బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. విదర్భ ప్రాంతంలో తొలిసారిగా అమరావతి మహిళా స్పెషల్ సిటీ బస్సును కూడా ప్రారంభించింది.

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (MSRTC) ఇంటర్‌సిటీ, ఇంటర్‌స్టేట్ ప్రయాణానికి రవాణా సేవలను అందిస్తుంది. నాగ్‌పూర్, యావత్మాల్, భోపాల్, హర్దా, ఇండోర్, రాయ్‌పూర్, జబల్‌పూర్, ముంబై, పూణే, అకోలా, ధర్ణి, నాందేడ్, ఔరంగాబాద్, జాల్నా, బుర్హాన్‌పూర్, పర్భాని, షోలాపూర్, ఖాండ్వా, గోండియా, షిర్డీ, హైదరాబాద్, పరత్వాడ (అచల్‌పూర్) వంటి నగరాలకు బస్సు సేవలు) అందుబాటులో ఉన్నాయి. హజీరా ( సూరత్ ) నుండి కోల్‌కతా వరకు వెళ్లే జాతీయ రహదారి 6 అమరావతి గుండా వెళుతుంది.

రైల్వే

[మార్చు]

అమరావతిలో మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

  • నగరం నడిబొడ్డున ఉన్న అమరావతి రైల్వే స్టేషన్ ఒక టెర్మినస్. అమరావతి రైల్వే స్టేషన్ సెంట్రల్ రైల్వేస్‌లోని హౌరా-నాగ్‌పూర్-ముంబై లైన్‌లోని నాగ్‌పూర్-భూసావల్ సెక్షన్‌లో బద్నేరా నుండి బ్రాంచ్ లైన్‌లో ఉంది.
  • కొత్త అమరావతి రైల్వే స్టేషన్ భవనం 10 డిసెంబర్ 2011న ప్రారంభించబడింది. అమరావతి రైల్వే స్టేషన్ బద్నేరాకు రోజంతా బహుళ షటిల్ సేవలను అందిస్తుంది.
  • బద్నేరా జంక్షన్ రైల్వే స్టేషన్ అమరావతిలోని బద్నేరా ప్రాంతానికి సేవలు అందిస్తుంది. ఇది హౌరా-నాగ్‌పూర్-ముంబై లైన్‌లోని జంక్షన్ స్టేషన్. నార్ఖేడ్ కు బ్రాడ్ గేజ్ లైన్లో ఉంది.

విమానాశ్రయం

[మార్చు]

డా. పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ విమానాశ్రయం అమరావతి, బెల్లోరా వద్ద ఉంది. ఇది జాతీయ రహదారి-6 నుండి యావత్మాల్ వైపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కంపెనీ (MADC) నిర్వహిస్తోంది. ప్రస్తుతం దీనికి వాణిజ్య విమాన సేవలు లేవు. ఇందులో హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉంది.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Who's Who | Amravati District". amravati.gov.in. District Administration, Amravati. Retrieved 3 September 2018.
  2. 2.0 2.1 "Cities having population 1 lakh and above, Census 2011" (PDF). census.gov.in. Retrieved 30 October 2020.
  3. "Economic Survey of Maharashtra 2014-15" (PDF). maharashtra.gov.in. Retrieved 27 December 2020.
  4. "Amravati District Collector Office". Amravati.nic.in. Archived from the original on 1 December 2011. Retrieved 6 December 2011.
  5. "Smart City Amravati". MyGov.in (in ఇంగ్లీష్). 21 October 2015. Retrieved 4 April 2022.
  6. "Amravati Mahanagar Palika – Maharashtra Shasan Sthanik Swarajya". amtcorp.org. Retrieved 4 April 2022.
  7. "Falling Rain Genomics, Inc – Amravati". Fallingrain.com. Retrieved 7 September 2010.
  8. "Station: Amravati Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 41–42. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 30 March 2020.
  9. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M137. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 30 March 2020.
  10. "Climate". Government of Maharashtra. Archived from the original on 14 June 2011. Retrieved 30 March 2020.