వామన్ గోపాల్ జోషి
వామన్ గోపాల్ జోషి | |
---|---|
జననం | 18 మార్చి 1881 |
మరణం | 1956 జూన్ 3 | (వయసు 75)
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | వీర్ వామనరావు జోషి, దాదా జోషి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత స్వాతంత్ర్య ఉద్యమం |
వామన్ గోపాల్ జోషి - భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు. మహారాష్ట్ర[1]కు చెందిన అతను సత్యాగ్రహం, కైడే భాంగ్ ఉద్యమాల్లో భాగంగా హైదరాబాద్ కూడా సందర్శించారు. అతని ఆశయాలను బ్రిటిష్-ఇండియా ప్రభుత్వం నిషేధించింది.
జీవితం
[మార్చు]వీర్ వామనరావు జోషి గా పిలువబడే వామన్ గోపాల్ జోషి (18 మార్చి 1881 - 3 జూన్ 1956) - మరాఠీ జర్నలిస్ట్. నాటక రచయిత. స్వాతంత్ర్య సమరయోధుడు. భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో అతను 'రాష్ట్రమాత్' వార్తాపత్రికలో దేశభక్తి గల గంగాధరరావు దేశ్‌పాండేకు ప్రధాన సహకారి. 'స్వతంత్ర హిందూస్థాన్' సంపాదకులుగా ఉన్నారు. అతని స్వరం, రచన శక్తివంతమైనవి. అతను 1920, 1942 మధ్య అనేక సార్లు జైలు శిక్ష అనుభవించాడు. అతను 'రానా-దుందుభి' నాటకాన్ని రాశాడు. దీని పాటలు దీనానాథ్ మంగేష్కర్ ద్వారా ప్రసిద్ధి పొందాయి. రచయిత వామన్ మల్హర్ జోషి, వామన్ గోపాల్ జోషి సమకాలీనులు.
వామన్ మల్హర్ జోషి (జనవరి 21, 1882 - జూలై 20, 1943) మహారాష్ట్రకు చెందిన మరాఠీ రచయిత. అతను దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వీరిది కొంకణ్ ప్రాంతంలోని టేల్ పట్టణం. 1900లో తన హైస్కూల్ విద్యను పూర్తి చేసిన తరువాత, 1904లో బ్యాచిలర్, 1906లో మాస్టర్స్ డిగ్రీలను దక్కన్ కాలేజీ, పూణే లో పూర్తిచేసారు.[2]
స్వాతంత్ర్య ఉద్యమం
[మార్చు]అమరావతికి చెందిన వామన్ నారాయణ్ జోషి ఒక విప్లవకారుడు. మరాఠీ మాధ్యమంలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. దేశ సేవ కోసం పాటుపడి విద్యను సగంలో వదిలేసి విదేశి వస్తు బహిష్కరణకు పూనుకున్నాడు. అతను బాంబులను తయారు చేయడానికి శిక్షణ పొందాడు. అలాగే అహ్మద్ నగర్ లోని గుజార్ గల్లీలో బాంబులు తయారు చేయడానికి శిక్షణ కూడా ప్రారంభించాడు.
అనంత్ కంహేర్.. అతని సహచరులు బ్రిటీష్ కలెక్టర్ జాక్సన్ హత్యకు పథకం వేశారు. నాసిక్‌లో జాక్సన్ 23, డిసెంబర్ 1909న కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో, బ్రిటిష్ వారు 7 మంది నిందితులను విచారించారు. ఆ సమయంలో నిందితుల్లో ఒకరు నగర్ జిల్లాలోని సంషేర్‌పూర్ (తాల్. అకోలే) కు చెందిన వామన్‌రావు జోషి అనే పేరుతో ఒకరు ఉన్నారు.
పేరులో సారూప్యత కారణంగా, వీర్ వామనరావుకు ఈ సంఘటనతో ముడిపెట్టారు. అయితే, ఈ కేసు పత్రాలు, రికార్డులను పరిశీలించినప్పుడు, సంషేర్‌పూర్‌కు చెందిన వామన్ నారాయణ్ జోషి అలియాస్ డాజికాకా కుట్రలో పాల్గొన్నట్లు కనుగొనబడింది. అండమాన్‌లో అతనికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ప్రచురించిన సాహిత్యం
[మార్చు]నాటకాలు
[మార్చు]- రాక్షసి మహత్త్వకాంక్ష (20-9-1913న లలిత్ కళాదర్శ్ ద్వారా మొదటి ప్రయోగం)
- రణదుందుభి (17-2-1927న బల్వంత్ సంగీత నాటక మండలి ద్వారా ప్రదర్శించబడింది)
- ధోతుంగ్ పద్షాహి
- ధర్మసింహాసనం
- షీలాసన్యాసం
పుస్తకాలు
[మార్చు]- చంద్రపూర్ చి మహాకాళి
- జాతిపిత మహాత్మాగాంధీ
నాట్యగీతాలు
[మార్చు]- ఆపద రాజ్ - పదా భయద
- జగీ హ ఖాస్ వేద్యాంచ పసార
- దివ్య స్వాతంత్ర్య రవి
- పరవశత పాస్ దైవే జ్యాంచ్య గలా లగల
- వీతరీ ప్రఖర్ తేజోబల్
మూలాలు
[మార్చు]- ↑ National Informatics Center, Amravati District, The Land of Great Men, archived from the original on 8 అక్టోబరు 2011, retrieved 27 July 2011
- ↑ https://en.wikipedia.org/wiki/Vaman_Malhar_Joshi. వికీసోర్స్.