Jump to content

గోండీ

వికీపీడియా నుండి
గోండీ  
:
మాట్లాడే దేశాలు: భారతదేశం 
ప్రాంతం: ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్,గుజరాత్
మాట్లాడేవారి సంఖ్య: 29 లక్షలు (మాతృభాష, భారత దేశం 2011)
భాషా కుటుంబము: ద్రవిడ
 దక్షిణ-మధ్య
  గోండీ 
వ్రాసే పద్ధతి: గోండీ లిపి, తెలుగు లిపి, దేవనాగరి లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష: భారతదేశం
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: none
ISO 639-2: gon
ISO 639-3: either:

ggo — దక్షిణ గోండి

gno — ఉత్తర గోండి

గోండి భాష దక్షిణ-మధ్య ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. ఆంధ్ర ప్రదేశ్ ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు తెలంగాణలో 2011 జన గణన ప్రకారం13 మిలియన్ మంది తమను తాము గోండులుగా నమోదించుకున్నప్పటికీ ఈ భాషని కేవలం సుమారు 30 లక్షల మందే మాట్లాడుతున్నారు[1]. గోండు భాష అంతరించే భాషలలో ఒకటిగా ఉంది.

వ్యుత్పత్తి శాస్త్రం

గోండు అనే పేరు యొక్క మూలం ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది. ఒడిషాలోని ఖోండ్‌ల మాదిరిగానే కొండ అనే అర్థం వచ్చే ద్రావిడ కోండ్ నుండి ఈ పదం ఉద్భవించిందని కొందరు నమ్ముతున్నారు.

గోండులు తమను తాము కోయ్తూర్ గా పిలుచుకుంటారు.

లిపి

[మార్చు]

గోండీ భాషకు రెండు లిపులు ఉన్నాయి అవి గుంజాల గోండి లిపి మరియు మెస్రం గోండి లిపి

మెస్రం గోండి లిపిని ఉత్తర భారతదేశంలో వాడుకలో ఉంది మరియు దక్షిణ భారతదేశంలో గోండీ భాషకు ఉన్న తనదైన సొంత లిపి గుంజాల గోండి లిపి (ఆదిలాబాదు జిల్లా గుంజాల వద్ద). ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీ అండ్ రిసెర్చ్ సెంటర్ యొక్క మాజీ డైరక్టర్ [[జయధీర్ తిరుమలరావు]] గారు, ఈ లిపిలోని అనేక వ్రాతప్రతులను సేకరించారు. గోండులలో ఈ లిపిని పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలవుతున్నాయి.

గోండు పదాలు ( దక్షిణ గోండి )

బెయ్యే - అమ్మ

బావల్ - నాన్న

మూర - ఆవు

రోన్ - ఇల్లు

కాండీ -అబ్బాయి

పేడి - అమ్మాయి

కాకో, ఆజీ -అమ్మమ్మ ,నాన్నమ్మ

అక్కో - తాదో-- అమ్మ యొక్క తండ్రి తాత, నాన్న యొక్క తండ్రి తాత.

భాష నమూనా

మొమోట్ కోయ్తూర్ అందుమ్ కోయంగ్ వడ్కంతోమ్ . ఏత్మాసూర్ పెందున్, పెర్సపెన్దూన్, జంగుబాయిన్, అని నాగోబా తున్ కాల్ కెరంతోమ్ .

అనువాదం

మమ్మల్ని కోయ్తూర్ లేదా గోండు అంటారు మేము గోండి(కోయంగ్) భాష మాట్లాడతాం.మేము పూజించే దేవుళ్ళలో ఏత్మాసూర్, పెర్సపెన్ జంగుబాయి నాగోబా మొదలైనవాళ్ళు ఉంటారు.

మూలాలు

[మార్చు]
  1. Beine, David Kగుంజాలgగోండి లిపి uistic Survey of the Gondi-speaking Communities of Central India. M.A. thesis. San Diego State University. chpt. 1
"https://te.wikipedia.org/w/index.php?title=గోండీ&oldid=4579923" నుండి వెలికితీశారు