Jump to content

గోండు

వికీపీడియా నుండి
గోండు
గోండు మహిళలు
ముఖ్యమైన జనాభా కలిగిన ప్రాంతాలు
 భారతదేశం4 కోట్లు
భాషలు
గోండీతెలుగుమరాఠీహిందీ
మతం
కోయ పుణెం,హిందూ మతం,ఇస్లాం
సంబంధిత జాతి సమూహాలు
Indo-Aryan, Dravidian

గోండ్ : ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు తెగల జాబితాలో 6వ కులం. భరత దేశంలో అతిపెద్ద గిరిజన సమూహంగ గుర్తించబడుతుంది

భారతదేశంలోని గోండులకు ప్రత్యేక స్థానమూ, ప్రాధాన్యతా ఉన్నాయి. మధ్యభరత దేేశంలో గోండ్వనా సామ్రాజ్యంలో 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు వీరి పరిపాలనా కొనసాగింది. గోండ్వనా సామ్ర్రాజ్యం చాలా పెద్దది, పైగా దక్షిణ సామ్ర్రాజ్యలకు కంచు కోటలాఉండేది. 1700 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన గోండులలో రాణి కమలపతి భోపాల్ పాలకురాలిని చివరి గోండు రాణిగా పరిగణిస్తారు. 52 యుధ్ధాలు గేలిచి అక్బర్ ను మూడు సార్లు ఓడించి ప్రసిద్ధిగాంచిన రాణి దుర్గావతి ఈ తెగకు చెందినదె. మహారాష్ట లోని నాగ్ పూర్ దేేేేవ్ గడ్ గోండ్ రాజుల రాజధాని నగరము నాగ్ పూర్ నగరమును ఇతిహాస పరిశోధన దృష్టితో అభ్యాసము చేసిన ఎడల మనకు ఎన్నో చారిత్రాత్మిక సత్యాలు దొరుకుతాయి. నాగ్ పూర్ రాజధానిగా చేసుకోవాలనే ఆలోచన మధ్యయుగాలలో ఆరంభమయినది. దేవగడను పరిపాలిస్తున్న గోండు రాజు భక్త్ బులన్ద్ షా కు ఈ ఆలోచన తట్టింది. ఆయన దేవ్ గడ్ నుండి రాజధాని నగరమును నాగ్ పూర్లో స్థాపన చేశాడు. ఈ చర్య పరిపాలనలో సౌలభ్యమునకు ప్రజలకు సుస్థిరపాలన అందించుటకు ఎంతో సహాయ పడింది. ప్రజల కొరకు ఎన్నో సదుపాయాలు ఏర్పరచి తరువాత నాగ్ పూర్ ఖిల్లాను నిర్మించారు. ఈ విధముగా నాగ్ పూర్ పురాతన కాలములో నాగవంశ గోండురాజుల యొక్క రాజధానియేకాక గోండి ధర్మ సంస్కృతి కేంద్రంగా విలసిల్లి తన ప్రత్యేకతను చాటుకున్నది. గోండి సంస్కృతి సంపదను దాని ఆస్తిత్వము క్రీ. 1700 సం॥వరకు సంపూర్ణ స్వరూపముగా వెలిసినది. నేటికికూడ నాగ్ పూర్ నగరములో గోండిధర్మ అవశేషములు సంస్కృతి మనకు కనిపిస్తాయి. నేటికిని పాత తరానికి చెందిన వారు నాగ్ పూర్ ను భక్త్ బులంద్ షా జిల్లా అని పిలుస్తారు.ఖిల్లా అనగా కోట అని అర్ధం.

గోండులు తమను తాము కోయ్తూర్ అని పిలుస్తారు కోయ్తూర్ అనగా యోధుడు అని అర్థం . గోండులలో ప్రధానంగా రాజ్ గోండ్ లు, పర్దన్,తోటి, కోలాం అనె ఉప తెగలు ఉంటాయి, చత్తిస్గడ్ లో ప్రధానంగ మూడు రకాలున్నాయి. (1) మరియా గోండ్ లు (Marias) (2) కొండ మరియలు ( Hill Marias) (3) భిషోహార్ మరియలు (Bisonhorn Marias) ప్రస్తుతం చత్తిస్గడ్ లోని బస్తర్ ప్రాంతమే ఈ మూడు రకాల గోండ్ లకు పుట్టినిల్లు. గోండ్ లు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,రాష్ట్రాలలో కూడా గణనీయంగా ఉన్నారు. వీళ్ళను ప్రధానంగా రాజ్ గోండ్ (koitur) అంటారు. మహారాష్ట్రలోని చందాను పరిపాలించిన శక్తివంతమైన గోండురాజుల ఆస్థానం ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లా వరకు వ్యాపించి ఉండేది. చత్తీస్‌ఘఢ్ లోని చాలా ఆస్థానాల్లో, చత్తిస్గడ్ కు ఆ పేరు రావడానికి ఈ గోండ్ రాజులు నిర్మించిన 36 కోటలేే కారణం, 1947 వరకు కూడా గోండురాజుల పాలన వుండేది. బ్రిటిషువాళ్ళు భారతదేశాన్ని వదలి వెళ్ళిన తర్వాత గోండు సంస్థానాలన్నీ, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనమైపోయాయి.

హరప్ప మోహంజోదరో సింధు నాగరికతతో గోండులకు సంభంధం ఉందని పరిశోధకులు గుర్తించారు, అక్కడ నివసించింది వీళ్ళే అని అక్కడ దొరికిన అస్దిపంజరాల DNA ద్వారా గుర్తించారు. గోండుల ప్రాచీన చరిత్ర గురించిన చారిత్రిక ఆధారాలు చాలా ఎక్కువ. కొంతకాలం క్రితం వరకూ కూడా, ఆదిలాబాద్ జిల్లాలో రాచరికపు ఛాయలు కనిపించాయి. గోండు వీరులు, రాజులు, ఏ ప్రభువూ, బయటి రాజుకూ, జవాబుదారీ కానీ, సామంతుడు కానీ, కాదని అక్కడి గోండులు చెబుతారు. గోండులు ఆ కాలంలోనే నాగలి, ఎద్దులతో వ్యవసాయం చేసేవారు. గోండుల సామాజిక వ్యవస్థకు మూలం వారి నాలుగు గోత్రాలు (phratries). ఇందులో మళ్ళీ ఉపగణాలు (clans) కూడా వుంటాయి. ముఖ్యంగా రాజగోండులలో వున్న నాలుగు phratries కు నాలుగు పేర్లున్నాయి.

  1. ఎర్వెన్ సాగా (Yerwen saga : Seven brother phratry)
  2. సెర్వెన్ సాగా (Serwen saga : Six brother phratry)
  3. సివెన్ సాగా (Sewen saga : Five brother phratry)
  4. నల్వెన్ సాగా ( Nalven saga : Four brother phratry)

హిందువులు ఎలాగైతే సగోత్రీకులను వివాహం చేసుకోరో, అలాగే గోండులు కూడా ఒక phratryకి చెందినవారు మరొక phratryకి చెందిన వారిని వివాహం చేసుకోరు. ఈ వ్యవస్థకు మూలపురుషుడిగా గోండులు ఒక వీరుడిని కొలుస్తారు. అతడే పెర్సపేన్ (Persapen = Great God) .

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా జరిగిన కళాయాత్రలో పాల్గొన్న గుస్సాడీ కళాకారుల బృందం

బస్తర్ ప్రాంతంలో నివసించే గోండులంతా ఒకలా ఉండరు. అబుఝమర్ కొండల్లో (Abujhamar Hills) పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న కొండ మరియలు వ్యవసాయ పద్ధతుల రీత్యా, కొండ రెడ్లు లాగా, కొలాములులాగా కనిపిస్తారు. వీరు ఎక్కువగాచంద్రాపూర్ జిల్లాలోని భామ్రగఢ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న మార్పుల వల్ల, వీళ్ళు కొండప్రాంతం నుండి మైదాన ప్రాంతాల్లోకి తరలి వచ్చి, అక్కడి వ్యవసాయ పద్ధతులను నేర్చుకొని, బియ్యం పండిస్తున్నారు. భిషోహార్ మరియాలు, వ్యవసాయ పద్ధతుల్లోనే కాక, యితర ఆచార వ్యవహారాల్లో, సంప్రదాయాల్లో కూడా ఆదిలాబాద్‌లోని రాజగోండులను పోలి వుంటారు. వీరి వివాహాల్లో, ప్రత్యేకంగా ఎద్దుకొమ్ములతో తయారుచేసిన ఒక రకమైన టోపీని పెట్టుకొని నృత్యం చేసే సాంప్రదాయం వుండటం వల్లే, వీళ్ళకు (Bisonhorn Mariyas) ఆ పేరు వచ్చి వుంటుందని, మానవ పరిణామ శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. గోండులు చేసే నృత్యాన్ని గుస్సాడీ అంటారు.

గోండుల మధ్య భరతదేశంలో తమకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం గోండ్వానా ప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు, భాషా ప్రతిపాదిత రాష్ట్రాలు ఏర్పాటు చేసేటప్పుడు గోండి భాషా వాళ్ళకు అన్యాయం జరిగింది అని వాళ్ళ భావన. మధ్యప్రదేశ్ లోని తూర్పు భాగం,మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం, మొత్తం ఛత్తీస్గడ్, తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాలను కలుపుకొని ఈ గోండ్వానా రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 100 అసెంబ్లీ స్థానాలను గోండులు ప్రభావితం చేస్తారు .

వ్యవసాయం ఎక్కువగా చేసె గోండులలో సామాజిక చలనశీలత (social mobility) వేగంగా జరుగుతోంది. అన్ని రంగాల్లో ముందుకు వచ్చి వాళ్ళ ప్రతిభ కనబరుస్తూన్నరు.

సంస్కృతి

[మార్చు]

గోండులు గొప్ప, ప్రత్యేకమైన పురాతన సంస్కృతిని కలిగి ఉన్నారు. గోండులు అత్యధిక సంఖ్యలో నివాసించే మధ్యప్రదేశ్ రాష్ట్రం గోండ్ పెయింటింగుకు ప్రసిద్ధి చెందింది. గోండ్ తెగకు చెందిన సాంప్రదాయ జానపద నృత్యాలు పాటలు ప్రత్యేకంగా ఉంటాయి . దీపావళి సమయంలో వీళ్ళు జరుపుకునె దండారి పండుగ మాన మర్యాదలకు చిహ్నం, యెత్మసుర్ అనే దేవతను ఈ సందర్భంగా పూజ చేయడం ఆనవాయితీ . గుస్సాడి నృత్యం ప్రత్యేకంగా ఉంటుంది, యువకులు పాల్గొని చచోయి నృత్యాన్ని చేస్తారు, మహిళాలు రేల నృత్యన్నని ప్రదర్శిస్తారు

కళలు

భారతదేశంలోని గోండ్ తెగ దాని శక్తివంతమైన కళాకృతులకు ప్రసిద్ధి చెందింది. GI ట్యాగ్ పొందిన గోండ్ పెయింటింగ్స్ పురాతన కాలంలో గోండుల ఇళ్ళ గోడల పై వేసేవారు, గోండ్ పెయింటింగ్స్ లో ప్రకృతి, జంతువులు, చెట్లు వంటివి గీయబడుతాయి .గోండ్ పెయింటింగులు కేవలం భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందయి, భరత ప్రధాని నరేంద్ర మోడి ఆస్ట్రేలియా కొత్త ప్రధానికి ఈ గోండ్ పెయింటింగును కానుకగా ఇచ్చాడు, మధ్యప్రదేశ్ కు చెందిన బజ్జు శ్యాం, దుర్గబాయి వ్యోం లాంటి వారు ఈ పెయింటింగ్స్ లో ప్రసిద్ధి చెందిన వాళ్ళు పైగా పద్మా శ్రీ అవార్డులు పొందారు

దుస్తులు

పురుషుల సాంప్రదాయ దుస్తులు నెత్తికి రూమాలు తలపాగ చుట్టుకుంటారు, ధోతి కట్టుకొని భుజాల మీద గంచా వేసుకుంటారు తెల్లటి అంగి దానిపై నల్లటి కోట్ ధరిస్తారు,సాంప్రదాయకంగా మహిళలు గోచి చీర పోప్డ, సోగ ధరిస్తారు. గోండులకు అనేక సాంప్రదాయ ఆభరణాలు ఉన్నాయి. పురుషులు కడా, మయ్టా సర్రి, సాకరి ధరిస్తారు. మహిళలు సాకరి, సర్రి,పాంజొల్, పాటి, రూపాయి బిల్లల హరలు, ఊంగరాలు, గజ్జలు,జుమ్కంగ్, చెవిపోగులు, డాండ్ కాడెంగ్ (చేతి కడియాలు), నాథ్ని (ముక్కు-ఆభరణాలు) వంటి వివిధ రకాల ఆభరణాలను ధరిస్తారు. స్త్రీలకు సాధారణంగా వివాహానికి ముందు పచ్చబొట్టు చేస్తారు.

విశ్వాసం ఆరాధన

ప్రతి గ్రామానికి దాని స్వంత స్థానిక దేవత (గ్రామదేవత) ఉంటుంది . 4 సగాల వారిగా, 750 గోత్రాల వారిగా ప్రతి గోత్రానికి పెర్సపెన్ (గొప్ప దేవుడు ) కలిగివుంటారు, శంభు షేక్ ని రాయితడ్ జంగుబాయిని పహండి పారి కూపార్ లింగోని పూజిస్తారు, కాళీ కంకలి, ఘ జల్కర్ దేవి, దంతెశ్వరి,బమ్లెశ్వరి, భీమల్ పేన్, మసెమల్ దేవతలను కొలుస్తారు

పండుగలు

[మార్చు]

గోండులలో అనేక పండుగలు ఉన్నాయి. గోండులు దీపావళి, దండారి, దసర, దురాడి హోళీ,మొదలైన జరుపుకుంటారు. వీటితో కొన్ని సాంప్రదాయ పండుగలను కూడా జరుపుకుంటారు. అకాడి, నొవ్వొంగ్, కోడంగ్, సట్టి, మొదలైనవి వివిధ రాష్ట్రాలలో వివిధ పద్ధతులతొ జరుపుకుంటారు

ప్రాంతీయ రాజకీయ నిర్మాణం

[మార్చు]

సాంప్రదాయ గోండు గ్రామాలకు ఒక అధిమతి (పాట్లల్,పటేల్) నేతృత్వం వహిస్తాడు. చాలా స్థానిక వివాదాలు లేదా సమస్యల మీద పటేల్ కు అధికారం, నిర్ణయం తీసుకునే అధికారాలు ఉన్నాయి.పటేల్ తొ పాటు కార్బారీ, ఘటియల్, దేవరి ఉంటారు. రాయి సెంటర్ గోండులలో ఒక కోర్టు లాంటిది ఎంత పెద్ద సమస్యను అయిన పోలీస్ స్టేషన్ లకు కోర్టు లకు వేళ్ళకుండా ఇక్కడే పరిష్కారం చేస్తారు

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

కొమరం భీమ్, స్వాతంత్ర్య సమరయోధుడు

రాణీ దుర్గావతి,గోండ్వనా రాణి

గుండా ధుర్, గిరిజన నాయకుడు

రామ్‌జీ గోండ్,స్వాతంత్ర్య సమర యోధుడు

మోతిరావన్ కంగలి, భాషావేత్త, రచయిత

హృదయ్షా, గర్హా రాజు

సంగ్రామ్ షా, గర్హా రాజు

రాజా శంకర్ షా, రఘూనాత్ షా, స్వాతంత్ర్య సమర యోధులు

బాబూరావు షెడ్‌మాకే, గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు

రాణి కమలపతి, భోపాల్ రాణి

భక్త్ బులంద్ షా, రాజ్‌గోండ్ పాలకుడు నాగ్ పూర్ సంస్దపకుడు

భజ్జు శ్యామ్, చిత్రకారుడు

జంగర్ సింగ్ శ్యామ్, చిత్రకారుడు

వెంకట్ శ్యామ్, కళాకారుడు

చక్రధర్ సింగ్, రాయ్‌ఘర్ రాష్ట్ర రాజు

వీర్ నారాయణ్ సింగ్, స్వాతంత్ర్య సమర యోధుడు

దుర్గా బాయి వ్యోమ్, కళాకారిణి

సిడాం శంభు, గిరిజన ఉద్యమా నాయకుడు

కనకరాజు, గుసాడీ నృత్యకారుడు

అనసూయ ఉయికే, గవర్నర్ మణిపూర్ రాష్ట్రం

అంకుష్ గేడం, బాలీవుడ్ నటుడు ఫీల్మ్ పేర్ అవార్డు గ్రహిత

దివ్య దుర్వే, మిస్ ఇండియా డీసి 2022

రాజా నరేష్‌చంద్ర సింగ్,మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

సంగీత కూమారి,అద్లెట్స్ క్రీడాకారిణి

దుర్గేష్ నైతం, ఇండియా ప్రో కబడ్డి టీం ప్లేయర్

భాస్కర్ హలమి,  సీనియర్ సైంటిస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

ఊర్మిళ సింగ్, హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్

రాగిని మార్కొ, క్రీడాకారిణి (అర్చెరి గోల్డ్ మేడలిస్ట్)

ఆశా గోండ్, స్కెటర్ బోర్డ్ క్రీడాకారిణి

గర్హ రాజ్యం గోండు రాజు ల జాబితా

[మార్చు]

ఖర్జీ (1440–1460)

గోరక్షదాస్ (1460–1480)

సుఖందాస్ (1480–1500)

అర్జున్ దాస్ (1500–1513)

సంగ్రామ్ షాను అమన్ దాస్ అని కూడా పిలుస్తారు (1513–1543)

దల్పత్ షా (1543–1550)

రాణి దుర్గావతి (1550–1564)

చంద్ర షా (1566–1576)

మధుకర్ షా ప్రేమ్ నారాయణ్ హృదయ్షా (1634–1668)

ఛత్ర షా (1668–1685)

కేసరి షా (1685–1688)[25]

నరేంద్ర షా (1688–1732)

మహారాజ్ షా (1732–1742)

శివరాజ్ షా (1742–1749)

దుర్జన్ షా (1749)

నిజాం షా (రాణి కమలపతి) (1749–1776)

నరహర్ షా (1776–1781)

చందా రాజ్యం గోండ్ రాజుల జాబితా

[మార్చు]

పాలకుడు - పాలన ప్రారంభం (AD)

భీమ్ బల్లాల్ సింగ్ - 870

ఖుర్జా బల్లాల్ సింగ్ - 895

హీర్ సింగ్ - 935

ఆండియా బల్లాల్ సింగ్ - 970

తుల్వార్ సింగ్ - 995

కేశూర్ సింగ్ - 1027

దినకూర్ సింగ్ - 1072

రామ్ సింగ్ - 1142

సుర్జా బుల్లాల్ సింగ్ (షేర్ షా బల్లాల్ షా) - 1207

ఖండకియా బల్లాల్ షా -1242

హిర్ షా - 1282

భూమా, లోక్బా, సంయుక్తంగా పాలించిన ఇద్దరు సోదరులు - 1342

కుండియా షా వినిని కర్న్ షా అని కూడా పిలుస్తారు -1402

బాబ్జీ బల్లాల్ షా - 1442

ధూండియా రామ్ షా - 1522

కృష్ణ షా - 1597

బీర్ షా - 1647

రామ్ షా - 1672

నీలకాంఠ్ షా - 1735-51

దేవ్ గడ్ ను పరిపాలించిన గోండు రాజులు

[మార్చు]

పేరు పరిపాలించిన కాలం

1.జాట్ బా క్రీ.శ.1570-1634

2.కోక్ షా క్రీ.శ.1634-1644

3. కేశార్ షా జాట్ బా 2 క్రీ.శ. 1644-1660

4. కోక్ షా 2 క్రీ.శ.1660-1680

5. దిందార్ షా క్రీ.శ.1680-1686

6. భక్త్ బులంంద్ షా ఉయికె క్రీ.శ.1686-1691

7.దిందార్ షా (రెండవ సారి) క్రీ.శ.1691-1695

8.భక్త్ బులంంద్ షా ఉయికె (రెండవ సారి) క్రీ.శ.1695-1706

9.చాంద్ సుల్తాన్ క్రీ.శ.1706-1739

10.పలీషా క్రీ.శ.1739-1740

11.బరహన్ షా,అక్బర్ షా సంయుక్త పాలన క్రీ.శ.1740-1743

గోండ్ రాజులు స్థాపించిన నగరాలు

[మార్చు]

1.భోపాల్ -భోపాల్ షా సలం

2.నాగ్ పూర్ - భక్త్ బులంద్ షా ఉయికె

3.రాయ్ పూర్ - రాయి జగత్

4.చంద్ర పూర్ - ఖండక్య బల్లర్ష

5.హోషంగ బాద్- హోషంగ్ షా

6. జబల్ పూర్- మదన్ షా

గోండి నెలలు

[మార్చు]

1.ధురాడి

2. చైత్

3.భావెయ్

4.బుడ్ భావెయ్

5.అకాడి

6.పోరా

7.అకుర్పోక్

8. దివాడి

9.కార్తి

10.సట్టి

11.పూస్

12. మహో

నాగోబా జాతర

[మార్చు]

సర్పజాతిని పూజిచండమే ఈ పండగ ప్రత్యేకత. ఆదిమ గిరిజనుల్లో మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత. నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌ దగ్గర కెస్లాపూర్‌ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈజాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్‌ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. యేటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం. నాగోబా చరిత్రను గోండు గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. పూర్వం మేస్రం కుటుంబానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని, ఆ కల నిజమైందని గోండుల నమ్మకం. సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరీతో వివాహం జరిపించింది. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా, ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది. ఆ తరువాత గౌరి ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని, అయితే పేరు ప్రతిష్ఠలు కావాలో.. సంప్రదాయం కావాలో.. తేల్చుకోమనగా గౌరి సంప్రదాయాలను లెక్కచేయక పోవడంతో తిరిగి పాముగా మారాడని కథ. ఆ తరువాత ఉడుంపూర్‌ నుంచి గరిమెల వరకు అతనికోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యవసి గుండంలో కలిసిపోయిందని, నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం. ఆ తరువాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడి సన్నిధిలో పరిచయం చేయాలని (పేథికొరి యాక్‌) చెప్పి నాగేంద్రుడు కెస్లాపూర్‌ గుట్టల్లోకి వెళ్లిపోయాడని చెప్తుంటారు. అదే కెస్లాపూర్‌ గ్రామంగా మారి పోయింది. నాగేంద్రుడు వెళ్లిన గుట్ట వద్ద నాగో బా దేవాలయాన్ని నిర్మిం చారు. ప్రతిఏటా పుష్ట మాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడని గిరిజనుల నమ్మకం. నాగోబా దేవతకు పూజలు మేస్రం వంశీయులే నిర్వహిస్తారు. మేస్రం వంశం కింద 22 తెగలు వస్తాయి. ఏడుగురు దేవతలను కొలిచే వారంతా మేస్రం వంశీయుల కిందికి వస్తారు. మడావి, మర్సకోల, పుర్క, మేస్రం, వెడ్మ, పంద్రా, పుర్వెత ఇంటి పేర్లు గలవారంతా మేస్రం వంశంలో వస్తారు.

పుష్యమాసంలో వచ్చే పౌర్ణమినాడు మేస్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఆ జలాన్ని తీసుకురావడానికి కెస్లాపూర్‌ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కెస్లాపూర్‌ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిదిచేసి అమావాస్యరోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. 3 సంవత్స రాల కొకసారి పూజారిని మార్చడం ఆనవాయితీ. జాతరకు వచ్చే మేస్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడపడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ లోపల, గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు (దుగుడు) ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మేస్రం వంశీయుల వంతుల వారిగా వంటలు చేసుకుంటారు. మిగితా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉన్నాయి. 63 ఏడేళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్‌ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్‌ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మేస్రం వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు. అల్లుళ్లు మట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను మెత్తి (అలికి) మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్లు మట్టిని తొక్కినందుకు వారికి ప్రత్యేక నజరానా అందజేయడం సంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిషా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.

ఇవీ చూడండి

[మార్చు]

అటు నక్సలైట్లకు, ఇటు పోలీసులకు, మధ్యనలిగే ఆదిలాబాద్‌ గోండు గిరిజనుల జీవితాన్నిఊరు అనే నవలలో వసంతరావు దేశ్‌పాండే చిత్రీకరించారు. గోండుల నృత్యాన్ని గూసాడి నృత్యం అంటారు.

మూలాలు

[మార్చు]
  • [1][permanent dead link] నాగోబా జాతర-సూర్య దినపత్రికలో
  • ఆంగ్ల మూలం : Tribes of India : The Struggle for Survival, Christoph Von Furer-Haimendorf. (అనువాదం : మనుగడ కోసం పోరాటం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు, అనంత్)
"https://te.wikipedia.org/w/index.php?title=గోండు&oldid=4372151" నుండి వెలికితీశారు