గుస్సాడీ కనకరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుస్సాడీ కనకరాజు
జననంమర్లవాయి, జైనూర్ మండలం,
కొమరంభీం జిల్లా, తెలంగాణ
ఇతర పేర్లుకనకరాజు
ప్రసిద్ధిగుస్సాడీ నృత్య కళాకారుడు,
నృత్య గురువు
తండ్రికనకరాము
తల్లిరాజుబాయి

గుస్సాడీ కనకరాజు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన గుస్సాడీ నృత్య కళాకారుడు, నృత్య గురువు. 55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.[1]ఈ అవార్డును 2021 జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున ప్రదానం చేయాల్సి ఉండగా కొవిడ్‌ వల్ల నిర్వహించలేదు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2021 నవంబరు 9న జరిగే ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో అయన ఈ అవార్డును అందుకోనున్నాడు.[2]

కనకరాజును సన్మానిస్తున్న తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌

జీవిత విషయాలు[మార్చు]

కనకరాజు, కొమరంభీం జిల్లా, జైనూర్ మండలం, మర్లవాయి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి కనకరాము, తల్లి రాజుబాయి. పేద గోండు, ఆదివాసీ కుటుంబంలో పుట్టిన కనకరాజుకు పదిమంది సంతానం. ప్రస్తుతం మార్లవాయి గ్రామంలో ఐటిడిఎ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ హాస్టల్‌లో వంటవాడుగా (దినసరి జీతగానిగా) పనిచేస్తున్నాడు.[3]

కళారంగం[మార్చు]

గుస్సాడీ నృత్యంలో పట్టు సాధించిన కనకరాజు, అనేక వందల ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాకుండా ఎంతోమందికి గుస్సాడీ నృత్యం నేర్పించాడు. ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన గణతంత్ర వేడుకల్లో తన బృందంతో గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించాడు. 1981లో మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, జైల్‌సింగ్‌, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ ప్రదర్శనలు ఇచ్చాడు.[4]

తెలంగాణ రాష్ట్రం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్న కనకరాజుకు, రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కేటీఆర్ అభినందనలను తెలిపాడు.[5] 2021, జనవరి 27న రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, కనకరాజును సత్కరించి అభినందించాడు.[6]

పురస్కారాలు[మార్చు]

  1. పద్మశ్రీ పురస్కారం - భారత ప్రభుత్వం, 72వ గణతంత్ర దినోత్సవం (2021 జనవరి 26)

మూలాలు[మార్చు]

  1. టివి 9, తెలంగాణ (26 January 2021). "Kanaka Raju: తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే పద్మశ్రీ.. కుమురంభీం జిల్లా గుస్సాడీ నృత్య ప్రదర్శనకు గుర్తింపుగా.. - kanaka raju wins padma shri". ఉప్పల రాజు. Archived from the original on 26 January 2021. Retrieved 27 January 2021.
  2. Andrajyothy (18 October 2021). "గుస్సాడి కనకరాజుకు రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానం". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
  3. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (27 January 2021). "గుస్సాడీ నృత్యానికి గౌరవం". www.andhrajyothy.com. జయధీర్‌ తిరుమలరావు. Archived from the original on 27 January 2021. Retrieved 27 January 2021.
  4. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2021). "గుస్సాడీ పింఛంలో పద్మం". Archived from the original on 27 January 2021. Retrieved 27 January 2021.
  5. సాక్షి, తెలంగాణ (26 January 2021). "గుస్సాడీ కనకరాజును అభినందించిన మంత్రి". Archived from the original on 27 January 2021. Retrieved 27 January 2021.
  6. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (27 January 2021). "పద్మశ్రీ కనకరాజు ను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". www.andhrajyothy.com. Archived from the original on 27 January 2021. Retrieved 27 January 2021.