గుస్సాడీ నృత్యం

వికీపీడియా నుండి
(గోండు నృత్యం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గుస్సాడి నృత్యం గిరిజన గోండులు,కొలామ్ తెగల సాంప్రదాయ నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలోని రాజగోండులు,, కొలములు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు.

విధానం[మార్చు]

గుస్సాడీ నృత్యం

వీరు సమూహాలుగా చేరి నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సమూహాలను దండారి సమూహాలు అంటారు. ఇందులోని చిన్నచిన్న సమూహాలను గుస్సాడీ అంటారు. వీరు నెమలి ఈకలు పొదిగిన, జింక కొమ్ములున్న తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, మేక చర్మాన్ని ధరిస్తారు. ఇందులోని వాయిద్యాలు డప్పు, తుడుము, పిప్రి, కొలికమ్ము. నృత్యం అయిపోయిన తర్వాత వీరి కాళ్లు కడిగి గౌరవాన్ని వ్యక్తం చేయడం ఈ నృత్యం ప్రత్యేకత.[1]

దీపావళి గోండులకు అతి పెద్ద పండుగ. గుస్సాడి పండుగ దీపావళి పండుగకు 1 వారం లేదా 10 రోజుల ముందు ప్రారంభమవుతుంది. ప్రారంభ రోజును "భోగి" అని పిలుస్తారు. ముగింపు రోజును "కోలబోడి" అని పిలుస్తారు. గుస్సాడీలు రంగురంగుల దుస్తులను ధరించి ఆభరణాలతో అలంకరించుకుంటారు. వారు బృందాలతో పాడుతూ, నృత్యాలు చేస్తూ పొరుగు గ్రామాలకు వెళతారు. ఇటువంటి బృందాలను "దండారి" అంటారు. ప్రతి బృందంలో నలభై మందికి పైగా సభ్యులు ఉంటారు. 'గుసాడి' దండారిలో ఒక భాగం. డప్పు, తుడుము, వెట్టే, డోల్కి, పెప్రే, కాలికోంలు వారి సంగీత వాయిద్యాలు.

గుస్సాడీ రాజు[మార్చు]

గుస్సాడీ కనకరాజు

తెలంగాణ కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల గుస్సాడీ కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.[2][3] ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజుకు గుస్సాడీ రాజుగా పిలుస్తారు.1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. 55 ఏళ్ళుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ, నేర్పుతూ వస్తున్న ‘రాజు’, ఈ నృత్యానికి దేశవ్యాప్తంగా ‘గుర్తింపు’ని కూడా తెచ్చారు. కనకరాజుకు పద్మ పురస్కారంతో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న గోండి ఆదివాసీ నృత్యానికి వంటవానిగా పనిచేసే అతనికి పద్మశ్రీ గౌరవం పురస్కారం దక్కింది.[2]

మూలాలు[మార్చు]

  1. గుస్సాడీ నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.
  2. 2.0 2.1 "గుస్సాడీ నృత్యానికి గౌరవం". www.andhrajyothy.com. Retrieved 2021-01-27.
  3. Telugu, TV9 (2021-01-26). "Kanaka Raju: తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే పద్మశ్రీ.. కుమురంభీం జిల్లా గుస్సాడీ నృత్య ప్రదర్శనకు గుర్తింపుగా.. - kanaka raju wins padma shri". TV9 Telugu. Archived from the original on 2021-01-26. Retrieved 2021-01-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

బాహ్య లంకెలు[మార్చు]