బ్రహుయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోదర ద్రావిడ భాషలు మాట్లాడే ప్రాంతం నుండి దూరంగా, పాకిస్తాన్‌లో బ్రహూయీ మాట్లాడే ప్రదేశం

బ్రహుయి ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ప్రధానంగా పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతములో ఈ భాష మాట్లాడుతారు. ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్ లోని బ్రహుయీలు కూడా ఈ భాషను మాట్లాడతారు. 1998 ఎత్నోలాగ్ నివేదిక ప్రకారము బ్రహుయి మాట్లాడే జనాభా పాకిస్తాన్లో 20 లక్షల మంది ఉన్నారని అంచనా. ఇతర ప్రాంతాలలో 2 లక్షల దాకా ఉంటారని అంచనా. పాకిస్తాన్లో ముఖ్యముగా ఈ భాష మాట్లాడే ప్రజలు బలూచిస్తాన్ కు చెందిన కలత్ ప్రాంతములో నివసిస్తున్నారు.

బ్రహుయి ద్రావిడ భాషా అయినప్పటికీ, దీని పరిసర ప్రాంతాలలో మాట్లాడే ఇరానియన్ భాషలైన బలూచ్ భాష, పుష్తో భాషల యొక్క ప్రభావము దీని మీద చాలా ఎక్కువ.

హింద్వార్య వలస కాలములో అప్పటివరకు విస్తారముగానున్న ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలు క్షీణించగా మిగిలిన అవశేషమే బ్రహుయి భాష అని భావిస్తారు. ఒక ఆలోచన ప్రకారము బ్రహుయి నేరుగా సింధు నాగరికత యొక్క వారసత్వముగా యేర్పడినదని భావిస్తారు. ఇంకొక సిద్ధాంతము ప్రకారము బ్రహుయి వంటి భాషలు ఆర్య, ద్రావిడ సంస్కృతుల సమ్మేళనముతో ఉద్భవించాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బ్రహుయి&oldid=3552424" నుండి వెలికితీశారు