గడ్చిరోలి జిల్లా

వికీపీడియా నుండి
(గఢ్ చిరోలి జిల్లా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గఢ్ చిరోలి జిల్లా
गडचिरोली जिल्हा
మహారాష్ట్ర పటంలో గఢ్ చిరోలి జిల్లా స్థానం
మహారాష్ట్ర పటంలో గఢ్ చిరోలి జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
డివిజనునాగపూర్
ముఖ్య పట్టణంGadchiroli
మండలాలు
List
Government
 • లోకసభ నియోజకవర్గాలు1. Gadchiroli-Chimur (shared with Chandrapur district) (Based on Election Commission website)
విస్తీర్ణం
 • మొత్తం14,412 km2 (5,565 sq mi)
జనాభా
 (2001)
 • మొత్తం9,70,294
 • జనసాంద్రత67/km2 (170/sq mi)
 • Urban
6.93%
జనాభా వివరాలు
 • అక్షరాస్యత60.1%
 • లింగ నిష్పత్తి976
ప్రధాన రహదార్లుNH-16
సగటు వార్షిక వర్షపాతం1,704 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
భామ్రాగడ్ సమీపంలోని కోత్రి నది

మహారాష్ట్ర లోని జిల్లాలలోగఢ్ చిరోలి జిల్లా (హిందీ:गडचिरोली जिल्हा) ఒకటి. గఢ్ చిరోలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

సరిహద్దులు

[మార్చు]

గఢ్ చిరోలి జిల్లా మహారాష్ట్ర ఆగ్నేయ సరిహద్దులో ఉంది. జిల్లా పశ్చిమ సరిహద్దులో చంద్రపూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో గోండియా జిల్లా, తూర్పు సరిహద్దులో చత్తీస్‌ఘడ్ జిల్లా, వాయవ్య సరిహద్దులో తెలంగాణా రాష్ట్రం ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

1982 ఆగస్టు 26న చంద్రపూర్ జిల్లాలోని గఢ్‌చిరోలి, సిరొంచ తాలూకాలను వేరుచేసి గఢ్‌చిరోలి జిల్లా రూపొందించబడింది. 2011 గణాంకాలను అనుసరించి మహారాష్ట్ర జిల్లాలలో ఇది అత్యంత తక్కువ జనసాంధ్రత కలిగిన జిల్లాలలో ఇది రెండవ స్థానంలో ఉందని గుర్తించబడుతుంది. మొదటి స్థానంలో సింద్‌దుర్గ్ జిల్లా ఉంది.[1] ఈ జిల్లా ప్రస్తుతం " రెడ్ కార్పెట్‌లో " భాగంగా ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

జిల్లాలో గోదావరి నదీమైదానం ప్రధానమైనదిగా ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దులో గూదావరినది పడమర దక్షిణాలుగా ప్రవహిస్తుంది. గూదావరి నదికి ప్రధాన ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నదులు జిల్లాలో చమర్షి తాలూకాలోని చప్రాలా గ్రామం వద్ద వార్ధానది, వైనగంగా నదితో సంగమిస్తున్నాయి.

జిల్లాలోని ధనోరా, ఎతపల్లి, అహెరి, సిరొంచ తాలూకాలు అరణ్యాలతో కప్పబడి ఉన్నాయి. భంరగాడ్, తిపగాడ్, పలస్గాడ్, సుర్జాగాడ్ తాలూకాలలో కొండలు ఉన్నాయి. గఢ్‌చిరోలి ప్రధానంగా కొండప్రాంతం.

విద్య

[మార్చు]

గఢ్‌చిరోలి జిల్లాలో సమీపకాలంలో " గొండ్వానా యూనివర్శిటీ " స్థాపించబడింది.[3]

పాఠశాలలు, కళాశాలలు

[మార్చు]
 • కమలేష్ యు.కె.ఇ ఉన్నత పాఠశాల, సవంగి, డేసైగంజ్, గడ్చిరోలి
 • గోండ్వానా సైనిక విద్యాలయ, గడ్చిరోలి
 • శ్రీ. శివాజీ ఉన్నత పాఠశాల, గడ్చిరోలి
 • జెడ్పి ఉన్నత పాఠశాల, గడ్చిరోలి
 • కార్మెల్ ఉన్నత పాఠశాల, గడ్చిరోలి
 • ప్లాటినం జూబ్లీ ఉన్నత పాఠశాల, గడ్చిరోలి
 • ఇంజనీరింగ్, గడ్చిరోలి యొక్క నాందేవ్రావు పొరెదివర్ కాలేజ్
 • వసంత్ విద్యాలయ, గడ్చిరోలి
 • సరస్వతీ విద్యాలయ, గడ్చిరోలి
 • ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, గడ్చిరోలి

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,071,795,[1]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. రోడో ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[5]
640 భారతదేశ జిల్లాలలో. 424వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 74 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.46%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 975:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.55%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.
షెడ్యూల్డ్ కులాలు 1,08,824
షెడ్యూల్డ్ తెగలు 3,71,696.
గిరిజన ప్రజలు 38.3%.[6]

.

ఆర్ధికం

[మార్చు]

జిల్లా అభివృద్ధి చెందని గిరిజన జిల్లాగా వర్గీకరించబడింది. జిల్లాలో కొండలు, అరణ్య ప్రాంతం అధికంగా ఉనాయి. జిల్లాలో 79.36% అటవీప్రాంతం ఉంది. జిల్లా వెదురు, తెండు ఆకులకు ప్రసిద్ధి చెంది ఉంది. జిల్లాలో వరి ప్రధానపంటగా ఉంది. సొర్ఘుం, లింసీడ్, కందులు, గోధుమ ప్రధానంగా పండించబడుతున్నాయి. తోటపని జిల్లా ప్రజల ప్రధాన వృత్తిగా ఉంది.

జిల్లాలో బృహత్తర ప్రణాళికలో చమోర్షి తాలూకాలోని అష్తి వద్ద ఉన్న పేపర్ మిల్ అండ్ పేపర్ పల్ప్ ఫ్యాక్టరీ (దేసిగంజ్) మాత్రమే ఉంది. జిల్లాలో పలు రైస్ మిల్లులు ఉన్నాయి. అర్మోరీ తాలూకాలో టషర్ సిల్క్ దారాల తయారీ ఫ్యాక్టరీ ఉంది. జిల్లాలో 18.5 కి.మీ పొడవైన రైలు మార్గం మాత్రమే ఉంది. జిల్లా నక్సలైట్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. జిల్లాలోని దట్టమైన అరణ్యాలు, కొండలలో " పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ " కనుమరుగుగా ఉంటుంది.

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గఢ్‌చిరోలి జిల్లా ఒకటి అని గుర్తించింది.[7] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మహారాష్ట్ర రాష్ట్ర 12 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[7]

విభాగాలు

[మార్చు]
 • జిల్లాలో 3 ఉపవిభాగాలు ఉన్నాయి : అహెరి, గడ్చిరోలి, దేసైగంజ్
 • జిల్లాలో 12 తాలూకాలు ఉన్నాయి :
 • గడ్చిరోలి ఉపవిభాగం లోని తాలూకాలు : గడ్చిరోలి, ధనోర, చమొర్షి, ముల్చెర
 • అహెరి ఉపవిభాగం లోని తాలూకాలు : అహెరి, సిరొంచ, ఏతపల్లి, భంరగడ
 • దేసైగంజ్ ఉపవిభాగం లోని తాలూకాలు : వార్దా, అర్మోరి, కుర్ఖెడా, కొర్చి
 • జిల్లాలో గ్రామ పంచాయితీలు ఉన్నాయి : 467
 • జిల్లాలో గ్రామాలు : 1688
 • జిల్లాలో 3 శాసనసభ నియోజకవర్గాలు : అహెరి, అర్మోరి, గఢ్‌చిరోలి.
 • జిల్లాలో పంచాయితీ సమితులు : 12
 • పార్లమెంటు నియోజకవర్గం : గఢ్‌చిరోలి
 • జిల్లాలో 2 పురపాలితాలు ఉన్నాయి : గడ్చిరోలి, వాద్స (దేసైగంజ్)

[8]

ఆరోగ్యం

[మార్చు]

భర్మగాడ్ వద్ద " ది లోక్ బిరదారి ప్రకల్ప " ఏర్పాటు చేయబడింది. జిల్లాలోని మడియా - గోండ్ ప్రజలకు ఆరోగ్య సంరక్షణ, విద్యా సేవలు అందిస్తున్న ప్రధాన సంస్థలలో ఇది ఒకటి. దీనిని గాంధీజి, డాక్టర్ మురళీధర్ దేవీదాస్ అంటే సందర్శించారు. అంటే కుటుంబ సభ్యులైన డాక్టర్. మందాకిని ఆంటే, డాక్టర్ ప్రకాష్ ఆంటే, వారి పిల్లలు ఎల్.బి.పిలో పనిచేస్తున్నారు. .[9]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-17. Retrieved 2014-11-27.
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est.
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567
 6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
 7. 7.0 7.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 8. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 2010-03-18. Retrieved 2014-11-27.
 9. http://lokbiradariprakalp.org/

వెలుపలి లింకులు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]