భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
స్వరూపం
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం | |
---|---|
దేశం | భారతదేశం |
ఎక్కడ ఉందీ? | మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్రం, |
అక్షాంశ రేఖాంశాలు | 17°56′14″N 80°49′07″E / 17.937255°N 80.81852°E |
స్థితి | నిర్మాణంలో ఉంది |
Owner(s) | TSGENCO |
భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మణుగూరులో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన ఈ విద్యుత్ కేంద్రం 2 యూనిట్లలో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడుతుంది.[1][2]
ప్రారంభం
[మార్చు]2015, మార్చి 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నిర్మిస్తున్న మొదటి విద్యుత్ ప్లాంటైన ఈ విద్యుత్ కేంద్రాన్ని బీహెచ్ఈఎల్ (BHEL) నిర్మిస్తుంది.[3]
2017, మార్చి 15న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని వచ్చింది. 2019 నాటికి మొదటి విభాగాన్ని పూర్తి చేసేందుకు పనులను ప్రారంభమయ్యాయి.
సామర్థ్యం
[మార్చు]దశ | యూనిట్ సంఖ్య | స్థాపన సామర్థ్యం (మెగావాట్స్) | ప్రారంభ తేది | స్థితి |
---|---|---|---|---|
దశ I | 1 | 1080 | మార్చి 28, 2015 | నిర్మాణంలో ఉంది |
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలు
- కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం
- కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం
- తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం
- యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
- సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 1 November 2018.
- ↑ ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 1 November 2018.
- ↑ "Lay foundation stone for Manuguru power plant". Retrieved 1 November 2018.