యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?వీర్లపాలెం, దామరచర్ల, నల్లగొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
స్థితినిర్మాణంలో ఉంది
Construction beganఅక్టోబర్ 2017
Construction cost₹55,000 కోట్లు
Owner(s)టిఎస్ జెన్కో
సంచాలకులుటిఎస్ జెన్కో
Website www.tsgenco.co.in

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా, దామరచర్లలోని వీర్లపాలెం నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ని స్థాపించనున్నారు. రూ.30వేల కోట్ల వ్యయంతో 2024 జూన్ లోపు పూర్తిచేయాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ విద్యుత్ కేంద్రం దక్షిణ భారతదేశములోని రెండవ అతిపెద్ద విద్యుత్ కేంద్రం.[1]

ప్రారంభం

[మార్చు]

2015, జూన్ 8న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంకు భూమి పూజ చేశారు. టీఎస్‌జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ ఆధ్వర్యంలో సుమారు 5,558 ఎకరాల్లో రూ.55వేల కోట్ల వ్యయంతో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నారు.[2]

క్లియరెన్సులు

[మార్చు]

2017 జూన్ 29న పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నుండి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లభించింది.[3][4] ఇంకా కృష్ణా నది నుండి నీటి కేటాయింపులు జరగలేదు.[5] కేంద్రం సవరించిన పర్యావరణ నిబంధనలు, 4000 మెగావాట్ల ప్రాజెక్టు తెలంగాణకు అదనంగా ₹3100 కోట్లు ఖర్చు అవుతుంది. కొత్త పర్యావరణ నిబంధనలు ఫ్లూ-గ్యాస్ డీసల్ఫరైజేషన్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేస్తాయి.

నిర్మాణం

[మార్చు]

రూ.30 వేల కోట్లతో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో యూనిట్‌ 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్తును తయారు చేసేలా ప్లాంటు నిర్మిస్తున్నారు. బొగ్గు ఆధారితంగా పనిచేసే బాయిలర్ల పనుల్లో సుమారు 6 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. ఇది 2024 జూన్ నాటికి పూర్తికాబడి, విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించబడుతుంది.

అడవిదేవులపల్లి సమీపంలో టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపులైన్‌ నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ను ఒకసారి నింపితే 10 రోజులపాటు ప్లాంటు నీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాగే దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్‌ నుంచి యాదాద్రి థర్మల్‌ ప్లాంటు వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్‌ నిర్మిస్తున్నారు.[6]

సామర్థ్యం

[మార్చు]

నాలుగువేల మెగావాట్స్ (5 x 800 మెగావాట్స్) సామర్థ్యం.

దశ యూనిట్ సంఖ్య స్థాపన సామర్థ్యం (మెగావాట్లు) ప్రారంభ తేది స్థితి
దశ I యూనిట్ I 800 మెగావాట్లు 30 అక్టోబర్ 2020 పని ప్రారంభం[7]
దశ I యూనిట్ II 800 మెగావాట్లు 30 అక్టోబర్ 2020 పని ప్రారంభం
దశ I యూనిట్ III 800 మెగావాట్లు 30 అక్టోబర్ 2021 ఇంకా ప్రారంభం కాలేదు
దశ I యూనిట్ IV 800 మెగావాట్లు 30 అక్టోబర్ 2021 ఇంకా ప్రారంభం కాలేదు
దశ I యూనిట్ V 800 మెగావాట్లు 30 అక్టోబర్ 2021 ఇంకా ప్రారంభం కాలేదు

కేసీఆర్ సందర్శన

[మార్చు]

2022 నవంబరు 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి,ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నులను కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ప‌రిశీలించాడు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాల‌ని, ప్లాంట్ ఆప‌రేష‌న్‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ ప్లాంట్ నుంచి హైద‌రాబాదుతోపాటు అన్ని ప్రాంతాల‌కు విద్యుత్ క‌నెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లుచేయాల‌ని, ప‌వ‌ర్ ప్లాంట్‌లో ప‌నిచేసే 10 వేల మంది సిబ్బందికి టౌన్ షిప్ నిర్మాణం కోసం 100 ఎక‌రాలు సేక‌రించాలని, ప్ర‌త్యేకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు 50 ఎక‌రాలు కేటాయించాల‌ని అధికారులకు సూచించాడు.[8][9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, టీఎస్‌పీఎస్సీ. "తెలంగాణలో విద్యుత్‌ ప్రాజెక్టులు". Archived from the original on 29 October 2018. Retrieved 8 November 2018.
  2. సాక్షి, ఎడ్యుకేషన్ (17 June 2017). "తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగం". Archived from the original on 24 October 2018. Retrieved 8 November 2018.
  3. Chandrashekhar, B. (4 July 2017). "Work on Yadadri thermal project to begin soon". Thehindu.com. Retrieved 1 January 2019.
  4. "Letter from Indian Government Offices to Project's chief Engineer granting environmental clearance" (PDF). Environmentalclearance.nic.in. Retrieved 27 January 2019.
  5. V, Swathi (29 December 2015). "MoEF defers approval to Yadadri power project". Thehindu.com. Retrieved 1 January 2019.
  6. telugu, NT News (2022-04-25). "వడివడిగా యాదాద్రి పవర్‌ ప్లాంటు". Namasthe Telangana. Archived from the original on 2022-04-25. Retrieved 2022-04-26.
  7. "Bharat Heavy Electricals Ltd". Archived from the original on 2017-10-23. Retrieved 2018-11-09.
  8. "CM KCR: యాదాద్రి పవర్‌ ప్లాంట్‌.. దేశ ప్రతిష్ఠను పెంచుతుంది: సీఎం కేసీఆర్". EENADU. Archived from the original on 2022-11-28. Retrieved 2022-11-28.
  9. telugu, NT News (2022-11-28). "యాదాద్రి ప‌వ‌ర్ ప్రాజెక్టు దేశ కీర్తిప్ర‌తిష్ట‌ను పెంచుతుంది : సీఎం కేసీఆర్". www.ntnews.com. Archived from the original on 2022-11-28. Retrieved 2022-11-28.