తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్ (టి.ఎస్. జెన్‌కో)
Typeప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ-ప్రభుత్వ రంగ సంస్థ
పరిశ్రమవిద్యుత్తు ఉత్పత్తి
స్థాపన2014 జూన్ 2 (2014-06-02)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం ఖైరతాబాదు, హైదరాబాదు, తెలంగాణ
Areas served
ప్రాంతాల సేవలు
Key people
శ్రీ డి ప్రభాకర్ రావు, చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్[1]
Productsవిద్యుత్తు
Websitehttp://www.tsgenco.co.in/

తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (టి.ఎస్. జెన్‌కో) అనేది తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు ఉత్పత్తి సంస్థ.[2] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ కార్యకలాపాలను నియంత్రించే అధికారాలను ఈ సంస్థ కలిగి ఉంటుంది.[3] 2013 కంపనీల చట్టం ప్రకారం 2014 మే 19న తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ విలీనం చేయబడింది. 2014 జూన్ 2 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది.[4]

చరిత్ర[మార్చు]

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు 1959లో ఉనికిలోకి వచ్చింది. విద్యుత్తు ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వంటి బాధ్యతలను నిర్వర్తించింది. విద్యుత్ రంగ సంస్కరణల అజెండా కింద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం 1998ని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, ఏపిట్రాన్స్‌కో నుండి టిఎస్‌ట్రాన్స్‌కో విభజించబడింది. 2014 జూన్ 2నుండి తెలంగాణ రాష్ట్రం కోసం టిఎస్‌ట్రాన్స్‌కో కంపెనీగా ఏర్పాటయింది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని ప్లాంట్లు (థర్మల్, హైడల్, సోలార్) తెలంగాణ జెన్‌కోకు బదిలీ చేయబడ్డాయి.[5]

విధులు[మార్చు]

  • కొత్త విద్యుత్తు ప్రాజెక్టులకు ప్రణాళికలు తయారుచేసి వాటిని అమలు పరచడం ద్వారా విద్యుత్ అభివృద్ధిని వేగవంతం చేయడం.[6]
  • అత్యంత ఆర్థికంగా, సమర్ధవంతంగా, పర్యావరణ అనుకూలమైన తగినంత-నమ్మదగిన శక్తిని ఉత్పత్తి చేయడం.
  • ఇప్పటికే ఉన్న అన్ని యూనిట్ల పునరుద్ధరణ, ఆధునికీకరణతోపాటు వాటి పనితీరును మెరుగుపరచడం.

బడ్జెట్ వివరాలు[మార్చు]

  • 2014-15 బడ్జెటులో ఈ విభాగానికి 1000 కోట్ల రూపాయలు కేటాయించబడింది.

విద్యుత్ కేంద్రాలు[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Shashank (4 June 2014). "Prabhakar Rao appointed as T-GENCO CMD". The Siasat Daily. Retrieved 13 January 2019.
  2. "TG Genco, Transco Created, to be Functional from June 2". Indian Express. 30 May 2014. Archived from the original on 19 ఆగస్టు 2014. Retrieved 30 May 2014.
  3. "Notification" (PDF). The Gazette of India. Government of India. 4 March 2014. Retrieved 4 March 2014.
  4. http://www.tsgenco.co.in/getInfo.do?dt=1&oId=33[permanent dead link]
  5. Sudheer Goutham (30 May 2014). "Power plants division between Andhra Pradesh and Telangana". Deccan Chronicle. Retrieved 7 June 2014.
  6. "Missions of TSGENCO". Archived from the original on 2018-06-03. Retrieved 2022-01-12.