తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్
రకం | ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ-ప్రభుత్వ రంగ సంస్థ |
---|---|
పరిశ్రమ | విద్యుత్ ప్రసారం |
స్థాపన | 2 జూన్ 2014 |
ప్రధాన కార్యాలయం | ఖైరతాబాదు, హైదరాబాదు, తెలంగాణ |
సేవ చేసే ప్రాంతము | తెలంగాణ |
కీలక వ్యక్తులు | శ్రీ డి ప్రభాకర్ రావు, చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్[1] |
ఉత్పత్తులు | ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్‌మిషన్, విద్యుత్ పంపిణీ, కమోడిటీ మార్కెట్ |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
మాతృ సంస్థ | తెలంగాణ ప్రభుత్వం |
వెబ్‌సైట్ | http://tstransco.in |
తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ (టిఎస్‌ట్రాన్స్‌కో) , తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ పంపిణీ సంస్థ. దీనికి పవర్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కార్యకలాపాలను నియంత్రించే అధికారం ఉంటుంది. 2013 కంపనీల చట్టం ప్రకారం 2014 మే 19న తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ విలీనం చేయబడింది. 2014 జూన్ 2 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది.[2] ఈ సంస్థ విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీలలో ఉత్తమసంస్థగా అనేక అవార్డులు అందుకుంది.[3]
చరిత్ర
[మార్చు]ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు 1959లో ఉనికిలోకి వచ్చింది. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వంటి బాధ్యతలను నిర్వర్తించింది. విద్యుత్ రంగ సంస్కరణల అజెండా కింద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం 1998ని ప్రకటించింది.
1998 ఫిబ్రవరి 1న ఏపిట్రాన్స్‌కో ఉనికిలోకి వచ్చింది. అప్పడినుండి 2005 జూన్ వరకు వివిధ జనరేటర్ల నుండి రాష్ట్ర-కొనుగోలు శక్తిలో ఒకే కొనుగోలుదారుగా కొనసాగింది. బల్క్ సప్లై టారిఫ్ రేట్ల ప్రకారంలో వ్యక్తిగత పిపిఏల నిబంధనలు, షరతులకు అనుగుణంగా విక్రయాలు సాగించింది. తదనంతరం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నోటిఫై చేయబడిన మూడవ బదిలీ పథకానికి అనుగుణంగా, ఏపిట్రాన్స్‌కో పవర్ ట్రేడింగ్ చేయడం మానేసింది. పవర్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ కార్యకలాపాలను నియంత్రించే అధికారాలను కలిగి ఉంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, ఏపిట్రాన్స్‌కో నుండి టిఎస్‌ట్రాన్స్‌కో విభజించబడింది. 2014 జూన్ 2నుండి తెలంగాణ రాష్ట్రం కోసం టిఎస్‌ట్రాన్స్‌కో కంపెనీగా ఏర్పాటయింది.[4]
అవార్డులు
[మార్చు]తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ కు వచ్చిన పురస్కారాల వివరాలు:[5]
- స్కోచ్ అవార్డు 2021: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం
- స్కోచ్ అవార్డు 2020: తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పోరేషన్ కోవిడ్ -19 సమయంలో 198 మంది ఉద్యోగులకు 19 రోజుల ఆన్‌లైన్ ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించడం
- స్కోచ్ అవార్డు 2019: 8 సర్క్యూట్ కిలోమీటర్ల విస్తీర్ణంలో హైదరాబాద్ నగరంలోని 136 సంఖ్యలలో 220కెవి లైన్స్ వేయడం
- స్కోచ్ అవార్డు 2018: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గత కొద్ది సంవత్సరాల్లో అసాధారణమైన పురోగతిని సాధించడం
- కేంద్ర ప్రభుత్వ అవార్డు: విద్యుత్తు ఉత్పత్తి, పంపిణీలో పురోగతి సాధించడం (2018 జూలై 5న న్యూఢిల్లీలోని ఐదవ వార్షికోత్సవం సందర్భంగా హెవీ ఇండస్ట్రీస్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖామంత్రి బాబుల్ సుప్రియో నుండి అవార్డు)
- కేంద్ర బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ శాఖ అవార్డు: పవర్ ట్రాన్స్‌మిషన్ సెక్టార్లో అత్యుత్తమ ప్రదర్శన (2017 డిసెంబరు)
- ఐపిపిఏఐ అవార్డు: బెస్ట్ పవర్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ (2017 అక్టోబరు 28)
గుర్తింపులు
[మార్చు]దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‌కో సంస్థల పనితీరును, ఆర్థిక రుణ క్రమశిక్షణ, లోపాలు లేని సేవలను పరిగణనలోకి తీసుకొని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) క్యాటగిరీలుగా విభజించగా, తెలంగాణ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ ట్రాన్స్‌కో) కు ఏ ప్లస్ (A+) క్యాటగిరీ వచ్చింది. 2022 జూన్ 1 నుండి తదుపరి కేటాయింపు ప్రక్రియ ప్రకటించే వరకు ఇది ఉంటుంది.[6]
ఇవికూడా చూడండి
[మార్చు]- తెలంగాణ పవర్ జనరేషన్ కార్పోరేషన్
- తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి
- ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ
- దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ
మూలాలు
[మార్చు]- ↑ "Ahmad Nadeem to be new TRANSCO CMD". Archived from the original on 2018-05-25. Retrieved 2022-01-11.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Telangana Transco to come into being on June 2"
- ↑ "Awards". tstransco.in. Archived from the original on 2021-01-26. Retrieved 2022-01-11.
- ↑ "TG Genco, Transco Created, to be Functional from June 2". Indian Express. 30 May 2014. Archived from the original on 19 ఆగస్టు 2014. Retrieved 30 May 2014.
- ↑ "పురస్కారాలు". te.tstransco.in. Archived from the original on 2021-03-06. Retrieved 2022-01-11.
- ↑ telugu, NT News (2022-06-23). "తెలంగాణ ట్రాన్స్‌కోకు ఏ+ క్యాటగిరీ". Namasthe Telangana. Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.