Jump to content

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015)

వికీపీడియా నుండి
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015)
Submitted2014 నవంబరు 5
Submitted byఈటెల రాజేందర్
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2014 నవంబరు 5
Parliament1వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerఈటెల రాజేందర్
Total expendituresరూ. 1,00,637.96 కోట్లు
Tax cutsNone
2015 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015), అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి బడ్జెట్.[1] 2014-15 వార్షిక సంవత్సరంలో పది నెలల కాలానికి 2014 నవంబరు 5న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[2] తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి బడ్జెటును ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొంటూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. సమావేశ ప్రారంభంలోనే విపక్షాలు నిరసన తెలుపగా, ఆ నిరసనల మధ్యే రాజేందర్ 1 గంట 5 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.[3]

తెలంగాణ బడ్జెట్ విలువ రూ.1,00,637.96 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం: రూ.48,648.47 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం: రూ.51,989.49 కోట్లుగా అంచనా వేయబడింది.[4] ఈ బడ్జెటులో నీటిపారుదల రంగానికి రూ. 9,407 కోట్లు, వ్యవసాయరంగానికి రూ. 8,511 కోట్లు, రైతుల రుణమాఫీకి రూ. 4,250 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 2,000 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ. 4,000 కోట్లు, ఆరోగ్యరంగానికి రూ. 2,282 కోట్లు, అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లు, పింఛన్లకు రూ. 6,580 కోట్లు, నియోజకవర్గం అభివృద్ధి నిధులు కోటిన్నర, విద్యారంగానికి రూ. 10,956 కోట్లు, సామాజికరంగానికి రూ. 23,000 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 20,000 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ. 80,090.33 కోట్లుగా, రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని రూ. 79,789.31 కోట్లుగా చూపించారు.[5][6]

రాష్ట్ర ఆదాయం

[మార్చు]
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ. 9,749.36 కోట్లు
  • కేంద్రం గ్రాంట్లు రూ. 21,720 కోట్లు
  • కేంద్రం సేల్స్ టాక్స్ బకాయిలు రూ. 1,500 కోట్లు
  • ఫైనాన్షియల్ కాంపొనెంట్ గ్రాంట్‌ రూ. 3,139.46 కోట్లు
  • పన్నుల ఆదాయం రూ. 35,378.24
    • అమ్మకం పన్ను ఆదాయం రూ. 26,963.30 కోట్లు
    • ఎక్సైజ్ ఆదాయం రూ. 2,823.54 కోట్లు
    • వాహనాల పన్ను ఆదాయం రూ. 2,226.86 కోట్లు
    • స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2,583.88 కోట్లు
  • ప్రభుత్వ పన్నేతర ఆదాయం రూ. 13,242.02 కోట్లు
  • మైన్స్ అండ్ మినరల్స్ ఆదాయం రూ. 1,877.52 కోట్లు
  • వడ్డీల ఆదాయం రూ. 2,508.98 కోట్లు

కేటాయింపుల వివరాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2014-2015)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:

  • వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1000 కోట్లు
  • డ్రిప్ ఇరిగేషన్‌ రూ. 250 కోట్లు
  • ఐసీడీఎస్ పథకం రూ. 1,100 కోట్లు
  • టీఎస్ఐఐసీ రూ. 100 కోట్లు
  • ఐటీఐఆర్ ప్రాజెక్టు రూ. 90 కోట్లు
  • వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ ఎస్సీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం రూ. 97.51 కోట్లు
  • పాల ఉత్పత్తుల ప్రోత్సాహం రూ. 16.30 కోట్లు
  • రహదారుల అభివృద్ధి రూ. 10వేల కోట్లు
  • ఆర్టీసి రూ. 400 కోట్లు
  • విద్యుత్ రంగం రూ. 3,241 కోట్లు
  • సోలార్‌ రూ. 40 కోట్లు
  • టిఎస్ జెన్కోలో పెట్టుబడి రూ. 1000 కోట్లు
  • ఉస్మానియా ఆసుపత్రి రూ. 100 కోట్లు
  • మెడికల్ కళాశాలల నిర్మాణం రూ. 152 కోట్లు
  • పరిశ్రమల విద్యుత్ సబ్సిడీ రూ. 10 కోట్లు
  • కళాకారుల సంక్షేమం రూ. 11 కోట్లు
  • గోదావరి పుష్కరాలు రూ. 100 కోట్లు
  • పర్యాటకరంగ అభివృద్ధి రూ. 60 కోట్లు
  • క్రీడారంగం రూ. 90 కోట్లు
  • రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 480.43 కోట్లు
  • ఫారెస్ట్ కాలేజీలు రూ. 10 కోట్లు
  • ఇరిగేషన్ రూ. 6,000 కోట్లు
  • నియోజకవర్గ నిధులు రూ. 1.50 కోట్లు
  • సాంకేతిక విద్య రూ. 212.86 కోట్లు
  • నీలోఫర్ ఆసుపత్రి రూ. 30 కోట్లు
  • వైద్య ఆరోగ్యం రూ. 2282 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్‌ రూ. 7,579
  • ఎస్టీ సబ్ ప్లాన్‌ రూ. 4,559 కోట్లు
  • ఉచిత నిర్బంధ విద్య రూ. 25 కోట్లు
  • మోడల్ స్కూళ్ల రూ. 940 కోట్లు
  • సాంస్కృతికు, క్రీడల రూ. 1000 కోట్లు
  • యాదగిరిగుట్ట అభివృద్ధి రూ. 100 కోట్లు
  • బాసర ట్రిపుల్ ఐటి రూ. 119.63 కోట్లు
  • దళితులకు భూములు రూ. 1000 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం రూ. 500 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ. 1030 కోట్లు
  • కళ్యాణ లక్ష్మీ (ఎస్సీలకు రూ. 150, ఎస్టీలకు రూ. 80 కోట్లు, షాదీ ముబారక్‌కు రూ. 100 కోట్లు)
  • మహిళల భద్రత రూ. 10 కోట్లు
  • గృహ నిర్మాణం రూ. 1000 కోట్లు
  • దీపం పథకం రూ. 100 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ. 2020 కోట్లు
  • విద్యారంగ అభివృద్ధి రూ. 10956 కోట్లు
  • అమరవీరుల కుటుంబాలు రూ. 100 కోట్లు
  • 9వేల చెరువుల పునరుద్ధరణ రూ. 2వేల కోట్లు
  • నీటిపారుదలరంగం రూ. 6,500 కోట్లు
  • మార్కెట్లో ధరల స్థిరీకరణ రూ. 400 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమ నిధి రూ. 10 కోట్లు
  • విత్తనాభివృద్ధి రూ. 50 కోట్లు
  • ఫామ్ మెకలైజేష్ రూ. 10 కోట్లు
  • క్రాప్ కాలనీల రూ. 20 కోట్లు
  • హైదరాబాద్ చుట్టుపక్కల వెయ్యి ఎకరాల్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్ గ్రీన్ హౌస్ పైలట్ ప్రాజెక్టు కోసం రూ. 250 కోట్లు
  • పౌల్ట్రీ రంగంలో విద్యుత్ సబ్సిడీ రూ. 20 కోట్లు
  • సూక్ష్మ సేద్యం రూ. 250 కోట్లు
  • పాల ఉత్పత్తుల రూ. 16.30 కోట్లు
  • జోడేఘాట్ అభివృద్ధి రూ. 25 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం రూ. 221 కోట్లు

ఇతర వివరాలు

[మార్చు]

2013-2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 23 జిల్లాలకు కలిపి రూ. 1.61 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రవేశపెట్టబడగా, 2014-2015లో తెలంగాణలోని పది జిల్లాలకు (పది నెలల కాలానికి) తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.

మూలాలు

[మార్చు]
  1. "Telangana Finance Portal". finance.telangana.gov.in. Archived from the original on 2021-05-16. Retrieved 2022-06-15.
  2. "Telangana State Budget 2014-2015" (PDF). www.finance.telangana.gov.in. Archived from the original (PDF) on 2022-04-12. Retrieved 2022-04-12. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. Srinivas (2014-11-05). "తెలంగాణ బడ్జెట్: 2014-2015 కేటాయింపులు". www.telugu.oneindia.com. Archived from the original on 2022-04-12. Retrieved 2022-04-12.
  4. "Telangana Finance Minister presents maiden Budget". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 2014-11-05. Archived from the original on 2021-06-15. Retrieved 2022-04-12.
  5. "'భారీ' ఆశల బడ్జెట్!". Sakshi. 2014-11-05. Archived from the original on 2022-04-12. Retrieved 2022-04-12.
  6. "Telangana government presents over Rs 1 lakh crore maiden budget". The Economic Times. 2014-11-05. Archived from the original on 2021-05-29. Retrieved 2022-04-12.

బయటి లింకులు

[మార్చు]