Coordinates: 16°21′55″N 80°35′52″E / 16.365274°N 80.597706°E / 16.365274; 80.597706

వీర్లపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీర్లపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
వీర్లపాలెం is located in Andhra Pradesh
వీర్లపాలెం
వీర్లపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°21′55″N 80°35′52″E / 16.365274°N 80.597706°E / 16.365274; 80.597706
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం దుగ్గిరాల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522305
ఎస్.టి.డి కోడ్ 08644

వీర్లపాలెం, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం పంచాయతీలో, 2015-16 ఆర్థిక సంవత్సరానికి 100% పన్ను వసూలయినది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీరామాలయం[మార్చు]

ఆలయంలో విగ్రహాలు ఉండవు. స్తంభాకార రూపం మాత్రమే ఉంటుంది. దీనిని రాములవారి ప్రతిరూపంగా భావించెదరు. ఈ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ప్రతి సంవత్సరం అట్టహాసంగా నిర్వహించెదరు. ఎక్కడో సుదూర ప్రాంతాలలో ఉంటున్న గ్రామస్థులు సైతం, పండుగ రోజుకు గ్రామానికి చేరుకుంటారు. తమ బంధుమిత్రులను గూడా ఆహ్వానించెదరు. శ్రీరామనవమి రోజున శ్రీ సీతా, రామ, లక్ష్మణుల చిత్రపటాలను గ్రామంలో మేళతాళాలతో ప్రదర్శనగా తీసికొని వెళతారు. ఇంటింటికీ వెళ్ళి, శ్రీ సీతారాముల కల్యాణానికి అందరినీ ఆహ్వానించెదరు. వేలాదిమంది సమక్షంలో కళ్యాణం నిర్వహించెదరు. శ్రీరామనవమి మరుసటి రోజున భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది. బెల్లం, పళ్ళు, నాణేలు, తదితర వస్తువులతో తాము మొక్కుకున్న విధంగా తులాభారం తూగుతారు. తమ చిన్నారులను గూడా అలా తూచగా వచ్చిన మొత్తాన్ని ఆలయానికి అందించెదరు. శ్రీరామనవమి పర్వదినం అనంతరం, మరుసటి రోజున శ్రీరామాలయంలో, భక్తులకు భారీగా అన్నసంతర్పణ చేయటం దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని, అనంతరం అన్నసంతర్పణలో పాల్గొంటారు. [1]&[2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాఎధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.