Jump to content

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం

అక్షాంశ రేఖాంశాలు: 18°50′14″N 79°34′29″E / 18.837231°N 79.574766°E / 18.837231; 79.574766
వికీపీడియా నుండి
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం
దేశంభారతదేశం
ఎక్కడ ఉందీ?జైపూర్, మంచిర్యాల జిల్లా, తెలంగాణ
అక్షాంశ రేఖాంశాలు18°50′14″N 79°34′29″E / 18.837231°N 79.574766°E / 18.837231; 79.574766
స్థితిపనిచేస్తుంది
Construction began11 నవంబరు 2011
మొదలయిన తేదీయూనిట్-1: 25 సెప్టెంబరు 2016[1]
యూనిట్-2: 2 డిసెంబరు 2016[2]
Construction costరూ 8250 కోట్లు
Owner(s)సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
సంచాలకులుస్టీగ్ ఎనర్జీ సర్వీసెస్ (ఇండియా) ప్రై. లిమిటెడ్

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, జైపూర్ లో నెలకొల్పబడిన విద్యుత్ కేంద్రం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నిర్వహిస్తన్న ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రంలో 1200 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంది, ఇందులో రెండు 600 మెగావాట్ల యూనిట్లు ఉన్నాయి.

ప్రారంభం

[మార్చు]

బొగ్గు తవ్వకాలలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కు ప్రధాన్యత ఉండగా, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా విద్యుత్ పరిశ్రమలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలోకి ప్రవేశించిన మొదటి భారత బొగ్గు పిఎస్‌యుగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ గా నిలిచింది.

రెండు 600 మెగావాట్ల యూనిట్లను కలిగి ఉన్న సింగరేణి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2011, నవంబరు 11న మంచిర్యాల జిల్లాలోని జైపూర్ లో ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు నిర్వహించడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. బాయిలర్ టర్బైన్ జనరేటర్ (బిటిజి), బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (బిఓపి) కోసం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కోల్‌కతాలోని మెక్‌నాలీ భారత్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు కాంట్రాక్టులు మంజూరు చేయబడ్డాయి.

2016 మార్చి 1న యూనిట్ 1 కోసం, 2016 సెప్టెంబరు 1న యూనిట్ 2 కోసం పవర్ ప్లాంట్ సింక్రొనైజేషన్ పూర్తిచేయబడ్డాయి.[3] 2016 సెప్టెంబరు 25న యూనిట్ 1,[1] 2016 డిసెంబరు 2న యూనిట్ 2కి పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ మెదటి దశ పూర్తయింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని 2016, ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి అంకితం చేశాడు.

భవిష్యత్ విస్తరణ

[మార్చు]

రెండవ దశలో భాగంగా 800 మెగావాట్ల యూనిట్‌తో మూడవ విద్యుత్ ప్లాంట్‌ను విస్తరించాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ యోచిస్తోంది.[4] 2015, మార్చి 3న జరిగిన మూడవ విద్యుత్ ప్లాంట్‌ శంకుస్థాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసీఆర్ పాల్గొని శంకుస్థాన చేశాడు.[5][6] అంచనా వ్యయం రూ .5879.62 కోట్లతో ఏర్పాటుచేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి 800 మెగావాట్ల కోసం ప్రస్తుతం ఉన్న ప్లాంటుకు పక్కనే 127.31 హెక్టార్ల భూమి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం 2019, డిసెంబరు 18న పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.[7]

విద్యుత్ ఉత్పత్తి

[మార్చు]

పి.ఎల్‌.ఎఫ్‌. (ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టర్‌)

[మార్చు]

2018 సెప్టెంబరులో 100.04 శాతం, 2019 ఫిబ్రవరిలో 100.05 శాతం స్టేషన్‌ పి.ఎల్‌.ఎఫ్‌., 2020 ఫిబ్రవరి నెలలో గరిష్ఠంగా 100.18 శాతం స్టేషన్‌ పి.ఎల్‌.ఎఫ్‌. సాధించింది. అంతేకాకుండా 2వ యూనిట్‌ 9 సార్లు, 1వ యూనిట్‌ 6 సార్లు నూరుశాతం పి.ఎల్‌.ఎఫ్‌. సాధించాయి. ఈ విద్యుత్‌ కేంద్రం 2016 సెప్టెంబరులో ప్రారంభమైన నాటినుండి 2020 ఫిబ్రవరి వరకు 30,921 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగా దీనిలో 29,056 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును రాష్ట్ర అవసరాలకు సరఫరా చేయబడింది.[8]

అవార్డులు, గుర్తింపులు

[మార్చు]
  • సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 2017-18 ఆర్థిక సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో, 2019- 20 ఆర్థిక సంవత్సరంలో 87.53 శాతం పి.ఎల్.ఎఫ్.తో జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచింది.[9][10]
  • సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 2023 మార్చి 3న కేంద్రం బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డును ప్రదానం చేసింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ అండ్‌ పవర్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలోని స్కోప్‌ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ చేతులమీదుగా సింగరేణి డైరెక్టర్‌ డీ సత్యనారాయణరావు అందుకున్నాడు.[11][12]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 IANS (25 March 2016). "BHEL commissions 600 Mw power plant in Telangana". Business Standard.
  2. Press Trust of India (29 December 2016). "Bhel commissions another 600 Mw thermal unit in Telangana". Business Standard. New Delhi.
  3. Singh, S. Harpal (13 March 2016). "Singareni 600 MW power unit synchronised in Telangana". The Hindu. Retrieved 15 August 2020.
  4. "Singareni gives 800 MW thermal plant work to BHEL". The Hindu. 31 October 2017. Retrieved 15 August 2020.
  5. "Lay foundation stone for Jaipur 3rd power plant". Retrieved 15 August 2020.
  6. "SCCL power plant to get new arm". www.telanganatoday.com. 2 April 2017. Archived from the original on 25 October 2017. Retrieved 15 August 2020.
  7. "SCCL thermal plant gets eco clearance in Mancherial". newindianexpress. 23 December 2019. Retrieved 15 August 2020.{{cite news}}: CS1 maint: url-status (link)
  8. గ్లోబల్ గ్రీన్ న్యూస్, జాతీయం (2 March 2020). "విద్యుత్ ఉత్పత్తిలో టాప్ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం". www.globalgreenews.com. Archived from the original on 16 ఆగస్టు 2020. Retrieved 16 August 2020.
  9. టివి9 తెలుగు, తెలంగాణ (17 April 2020). "telangana singareni thermal power plant achieves seventh rank in the country- మ‌రోసారి జాతీయ స్థాయిలో మెరిసిన సింగరేణి". TV9 Telugu. జ్యోతి గడ్డ. Archived from the original on 15 August 2020. Retrieved 15 August 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  10. ఈనాడు, తెలంగాణ (17 April 2020). "జాతీయస్థాయిలో సింగరేణి సత్తా". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 15 August 2020.
  11. telugu, NT News (2023-03-04). "సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌కు కేంద్ర అవార్డు". www.ntnews.com. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.
  12. "కేంద్ర అవార్డులు.. కె.వి.ఎన్ చక్రధర్ బాబు.. సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణకు పురస్కారం". Prabha News. 2023-03-03. Archived from the original on 2023-03-04. Retrieved 2023-03-04.