సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Singareni Collieries Company Limited
Typeప్రభుత్వాధీనంలోని సంస్థ
Industrymining of hard coal
త్రవ్వకాలు(గనుల) Edit this on Wikidata
Founded1920 డిసెంబరు 23
Headquartersకొత్తగూడెం , భద్రాద్రి జిల్లా, తెలంగాణ
Area served
350KM ప్రాణహిత - గోదావరి నదీ పరివాహక ప్రాంతం - తెలంగాణ
Key people
ఎన్ శ్రీధర్ (చైర్మన్) 2015
Productsబొగ్గు మైనింగ్ & పవర్
Number of employees
55,086 (2017)
Websitescclmines.com

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ప్రభుత్వాధీనంలోని సంస్థ. సింగరేణి, పరిసర గోదావరీ లోయలో బొగ్గు గనుల త్రవ్వకాలు, పంపిణి మొదలైనవి దీని పని.

తొలినాళ్లు[మార్చు]

1871 సంవత్సరంలో, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన డాక్టర్ కింగ్, ఖమ్మం జిల్లా లోని 'ఇల్లందు' అనే గ్రామంలో బొగ్గు గనులను కనుగొన్నాడు. ఆంద్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా, గోదావరి జిల్లాల వారు, 'సర్ ఆర్ధర్ కాటన్' చేసిన సేవలను ఎలా మరిచిపోరో, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి గనుల వలన, ఈ జిలాల ప్రజలు డాక్టర్ కింగ్ ను కూడా మరిచి పోరు. ఇక్కడ దొరికే ప్రతి 'బొగ్గు' మీద 'డాక్టర్ కింగ్' పేరు ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. గోదావరి జిల్లాల వారు కూడా అక్కడ పండే ప్రతి బియ్యం గింజ మీద సర్ ఆర్ధర్ కాటన్ సంతకం ఉంటుంది అంటారు. 1886లొ, ఇంగ్లాండులో ఉన్న 'ది హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్', 'ఎల్లెండు' పరిసర ప్రాంతాలలో బొగ్గు గనులను తవ్వుకొనే హక్కు సంపాదించింది. 23 డిసెంబరు 1920 నాడు, 'హైదరాబాద్ కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.

శ్రామికుల సంక్షేమం[మార్చు]

సింగరేణి సంస్థ తెలంగాణా అభివృద్ధి, ఆత్మగౌరవ, రాష్ట్రసాధన ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించింది. దీంతో సింగరేణి సంస్థ శ్రామికుల సంక్షేమం తెలంగాణా ఏర్పడ్డ తర్వాత ముఖ్యమైన అంశమయింది.. ఎప్పటినుంచో ఉన్న వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదన అమల్లోకి వచ్చింది. 2016 నవంబరులో వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ అంగీకరించింది. దీనికి సంబంధించి 15ఏళ్ల తర్వాత చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్‌ 11 నాటికి 48-56 వయస్సు మధ్యగల కార్మికులు వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కార్మికుల కుమారులు, అల్లుడు, సోదరుడు వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హులని పేర్కొంది. అయితే 18-35 ఏళ్ల వయసున్న వారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తామని ప్రకటించింది.

సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై 2002లో అప్పటి ప్రభుత్వ నిషేధం విధించింది. దీంతో కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే తెలంగాణా రాష్ట్రసాధనా ఉద్యమ సమయంలో, 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని తెరాస రాజకీయ పార్టీ హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే అ అంశంపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం, వారసత్వ ఉద్యోగాల ప్రతిపాదనను అంగీకరించింది.

లక్ష్యాలు,ఫలితాలు[మార్చు]

కొత్తగూడెం పట్టణానికి దగ్గరలో ఉన్న గౌతంఖని సింగరేణి ఓపెన్ కాస్ట్

2011 మే 1 నాడు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (సింగరేణి కాలరీస్ సంస్థ) సమీక్ష. సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం, పవర్ ప్రాజెక్ట్‌లకు బొగ్గు సరఫరాల్లో కొరత రాబోతుంది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ విద్యుత్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సింగరేణిలోనే బొగ్గు వినియోగం పెరిగే అవకాశం కనిపిస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో 51.3 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిర్దేశించుకుని 36 భూగర్భ, 14 ఓపెన్‌కాస్టు గనుల ద్వారా అనేక అవరోధాలను అధిగమించి లక్ష్యాన్ని సంస్థ అధిగమించింది. అంతేకాకుండా సింగరేణి చరిత్రలో ఎప్పుడూలేని విధంగా 2010-11లో టర్నోవర్ సుమారు 8,939 కోట్ల రూపాయలు కాగా 2009-10 ఆర్థిక సంవత్సరంకన్నా ఇది 14శాతం ఎక్కువ. అన్ని పన్నుల చెల్లింపు తర్వాత సంస్థ అంచనా లాభాలు 320 కోట్ల రూపాయలు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థిక సంవత్సరం మిలియన్ టన్నులు రవాణా
2009-10 49.26
2010-11 50.05
  • పవర్ సెక్టార్‌కు ఉత్పత్తిలో 72శాతం బొగ్గును రవాణా చేయడం విశేషం.
సంస్థతో ఒప్పందం ఒప్పందం ప్రకారం చేయవలసిన బొగ్గు సరఫరా సరఫరా చేసిన బొగ్గు
ఎపి జెన్కోతో ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం 113.40 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయవలసి ఉండగా రికార్డు స్థాయిలో 151.95 లక్షల టన్నులు సరఫరా చేసింది. 134%
ఎన్‌టిపిసికి తెలియదు 133.88 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసింది. 131%
  • అంతేకాకుండా సిమెంట్, హెవీవాటర్ ప్లాంట్, స్పాంజ్ ఐరన్ ఎన్‌ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ యూనిట్లకు అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరా చేస్తోంది. అయితే తొలిసారిగా విద్యుత్ రంగంలోకి అడుగులు వేస్తూ ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సమీపంలోని జైపూర్ వద్ద 5685 కోట్ల రూపాయలతో 1200 మెగావాట్ల సామర్థ్యంతో 600 మెగావాట్ల చొప్పున రెండు విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తూ 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించి శరవేగంగా పనులను కొనసాగిస్తోంది. ఈ విద్యుత్ ప్లాంట్లు ప్రారంభమైతే సంవత్సరానికి 500 లక్షల టన్నుల బొగ్గును వినియోగించాల్సిన పరిస్థితులు ఉండటంతో ఇప్పటివరకు సింగరేణి కాలరీస్ సంస్థ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు మినీ విద్యుత్ ప్లాంట్లకు ఉపయోగిస్తున్న బొగ్గు వినియోగంతోపాటు అదనంగా సంవత్సరానికి 500 లక్షల టన్నులు వినియోగించాల్సి వస్తోంది. అప్పటికి, సింగరేణిలో అదనంగా నూతన బొగ్గు ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాకపోతే, ఇప్పటివరకు పవర్ సెక్టార్‌తో పాటు ఇతర సెక్టార్లకు బొగ్గును సరఫరా చేసే సింగరేణి కాలరీస్ సంస్థ, ఇతర రంగాలకు, అవి ఆశించే స్థాయిలో బొగ్గును సరఫరా చేసే అవకాశాలు తక్కువ అవుతాయి.
  • సింగరేణికి అనుబంధంగా ఉన్న అన్వేషణ విభాగం బొగ్గు నిల్వల నిర్ధారణ కోసం నిర్వహించే డ్రిల్లింగ్ పనులకు పలుచోట్ల ఆటంకాలు ఎదురవుతుండటంతో నూతన ప్రాజెక్ట్‌ల ఏర్పాటు సందేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ సింగరేణి సంస్థ బొగ్గును సొంత అవసరాలతో పాటు ఇతర రంగాలకు సరఫరా చేసేందుకు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నది.
  • సంస్థ బొగ్గు తవ్వకం మొదలుపెట్టినప్పటి నుండి 2022 వరకూ తవ్విన బొగ్గు 155 కోట్ల టన్నులు.[1]
  • సింగరేణి ఒక్క నెలలో సాధించిన అత్యధిక బొగ్గు ఉత్పత్తి 68.4 లక్షల టన్నులు. 2023 జనవరిలో ఈ రికార్డు సాధించింది.[2]

విద్యుత్ ఉత్పత్తి రంగంలో సింగరేణి[మార్చు]

సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తే కాకుండా 2015 లో విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి కూడా అడుగుపెట్టింది. కొత్తగూడెంలో స్వంత అవసరాలకోసం ఒక విద్యుత్తు ప్లాంటు పని చేస్తోంది. మంచిర్యాల జిల్లా లోని జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును 6వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తోంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 150 మెగావాట్లను సింగరేణి తన అవసరాలకు వాడుకుంటుంది. 1050 మెగావాట్లను తెలంగాణ లోని నాలుగు డిస్కంలకు అమ్మడానికి 25 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. దీని మొదటి దశ లోని రెండు యూనిట్లు 2016 లో ఉత్పత్తి లోకి వచ్చాయి.[3]

మూలాలు[మార్చు]

  1. edit, Disha (2022-12-23). "Singareni: 102 యేండ్ల సింగరేణి". www.dishadaily.com. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.
  2. telugu, NT News (2023-02-02). "బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి ఆల్‌టైం రికార్డు". www.ntnews.com. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.
  3. "దేశంలోనే మరోసారి నెంబర్‌ 1 స్థానంలో సింగరేణి థర్మల్‌.. దేశానికే ఆదర్శంగా తెలంగాణ విద్యుత్‌ కేంద్రం". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-01-05. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.

బయటి లింకులు[మార్చు]