Jump to content

గోదావరి లోయ బొగ్గుక్షేత్రం

వికీపీడియా నుండి
గోదావరి లోయ బొగ్గుక్షేత్రం
ప్రదేశం
Godavari Valley Coalfield is located in Telangana
Godavari Valley Coalfield
Godavari Valley Coalfield
తెలంగాణలో ప్రాంతం ఉనికి
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
Owner
కంపెనీసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
Websitescclmines.com
Year of acquisition1920
గోదావరి లోయ బొగ్గు క్షేత్రాలపై మణుగూరు వద్ద సింగరేణి ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనులు

గోదావరి లోయ బొగ్గుక్షేత్రం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఉన్న బొగ్గుక్షేత్రం. గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ బొగ్గుక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గుక్షేత్రం.

చరిత్ర

[మార్చు]

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డా. రాజు 1871లో ఖమ్మం జిల్లాలో బొగ్గును కనుగొన్నాడు. హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ 1886లో బొగ్గును వెలికితీసేందుకు మైనింగ్ హక్కులను పొందింది. 1920లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్థాపించబడి, హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కు సంబంధించిన అన్ని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆ తరువాత సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మెజారిటీ షేర్లను 1945లో హైదరాబాద్ స్టేట్ కొనుగోలు చేసింది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో, 1956లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నియంత్రణని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం)కు అప్పగించింది.[1]

పంచవర్ష ప్రణాళికల అమలులో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్యకలాపాలు విస్తరింప చేయబడ్డాయి. 1960 మార్చి నుండి ఇది ఉమ్మడి (ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం), భారత ప్రభుత్వం సంయుక్త యాజమాన్యంలోకి వచ్చింది. కొంతకాలం తరువాత దీని కార్యకలాపాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు (కొమరంభీం జిల్లా మొదలుకొని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం) జిల్లాల్లోని విస్తరించాయి. దక్షిణ భారతదేశంలోని ఏకైక బొగ్గు క్షేత్రమైన గోదావరి లోయ బొగ్గుక్షేత్రంలో 2009-10 వరకు దాదాపు 929.12 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయబడింది.[2]

2019–20 వరకు 1,501 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు వెలికితీయబడింది. మరో 150 సంవత్సరాలు నిరంతరాయంగా తవ్వకాలు జరిపినా గోదావరి లోయ పరిధిలో బొగ్గు తరగదని తేలింది.[3]

బొగ్గు క్షేత్రం

[మార్చు]

గోదావరి లోయ బొగ్గుక్షేత్ర క్యుములేటివ్ బేసిన్ ప్రాంతం 17,400 కిమీ2, బొగ్గు బేరింగ్ ప్రాంతం 11,000 కిమీ2. ప్రాంతీయ అన్వేషణకు సంభావ్యంగా పరిగణించబడే ప్రాంతం 1,700 కిమీ2.[4]

గోదావరి లోయ బొగ్గుక్షేత్రం, కొన్నిసార్లు ప్రాణహిత-గోదావరి లోయ బొగ్గుక్షేత్రంగా సూచించబడుతోంది, వార్ధా లోయ బొగ్గు క్షేత్రానికి కొనసాగింపుగా ఉంది. ఇది 9,000 కిమీ2 విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది పన్నెండు కోల్ బెల్ట్‌లుగా విభజించబడింది. ఈ ప్రాంతంలోని ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు: తాండూరు బొగ్గుక్షేత్రం; ఉత్తర గోదావరి, దక్షిణ గోదావరి బొగ్గుక్షేత్రం; కర్లపల్లి లేదా కమరం బొగ్గుక్షేత్రం; రామగుండం బొగ్గు క్షేత్రం మొదలైనవి.[5]

నిల్వలు

[మార్చు]

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం, గోదావరి లోయ బొగ్గు క్షేత్రంలో 2004 జనవరి 1 నాటికి 8091 మీటర్ల లోతులో 1,200 మీటర్ల లోతు వరకు మొత్తం 16,697.26 మిలియన్ టన్నుల నాన్-కోకింగ్ బొగ్గు నిల్వలు ఉన్నాయి.వీటిలో 10 మిలియన్ టన్నుల నిల్వలు చూపించబడగా, మిగిలినవి సూచించబడ్డాయి. బొగ్గులో ఎక్కువ భాగం 300 మీటర్ల లోతు వరకు ఉంటుంది.[6] జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తదుపరి అధ్యయనాలలో గోదావరి లోయ బొగ్గు క్షేత్రానికి 22,054.58 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తేలింది.[7] 300 మీటర్ల నుంచి 600 మీటర్ల లోతులో 4,308.54 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉండగా, 600 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో మరో 325.76 మి. మెట్రిక్‌ టన్నుల బొగ్గును కనుగొన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "History". The Singareni Collieries Company Limited. Archived from the original on 2012-05-04. Retrieved 2022-06-29.
  2. "History". The Singareni Collieries Company Limited. Archived from the original on 2012-05-04. Retrieved 2022-06-29.
  3. "తరగని నిక్షేపాలు.. ఆ'గని' అన్వేషణ". Sakshi. 2020-09-29. Archived from the original on 2020-10-03. Retrieved 2022-06-29.
  4. "Godavari Valley Coalfield". The Singareni Collieries Company Limited. Archived from the original on 2005-03-12. Retrieved 2022-06-29.
  5. "Geological and Geographical Distribution of Coalfields in India". geologydata.info. Archived from the original on 2012-03-31. Retrieved 2022-06-29.
  6. "Coal Resources of India (As on 1.1.2004)" (PDF). Coal Wing, Geological Survey of India, Kolkata. Archived from the original (PDF) on 2012-03-27. Retrieved 2022-06-29.
  7. "Exploration Data on SCCL Web 2011_Final" (PDF). Geological Reserves. The Singareni Collieries Company Limited. Retrieved 2022-06-29.