నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్
స్వరూపం
(రామగుండం జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి దారిమార్పు చెందింది)
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (National Thermal Power Corporation) పెద్దపల్లి జిల్లా, రామగుండం లోని ప్రముఖ సంస్థ. ఈ సంస్థ 1975లొ స్థాపించబడింది.2010 జనవరి 1 నాటికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపిసి), రామగుండంలో రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించింది. రామగుండం ఎన్టీపిసి 2009-10 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాలను అదిగమించే దిశలో కొనసాగుతున్నాయి. ఎన్టీపిసికి చెందిన 200 మెగావాట్ల 3 యూనిట్లు (600 మెగావాట్ల ఉత్పత్తి) , 500 మెగవాట్ల 4 యూనిట్లు (2000 మెగావాట్ల ఉత్పత్తి) మొత్తం రోజుకు 2600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుపుతూ దక్షిణాది రాష్ట్రాలకు నిరాటంకంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఎన్టీపిసి 92.66 శాతం పిఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి జరుపుతుంది.
- ఎన్.టి.పి.సి. రామగుండం ఉత్పత్తి చేసిన విద్యుత్తు, నెలవారీగా, ఈ కింది పట్టికలో చూడండి.
నెల | సంవత్సరం | మిలియన్ యూనిట్లు |
---|---|---|
ఏప్రిల్ | 2010 | 1,889.199 |
మే | 2010 | 1,840.53 |
జూన్ | 2010 | 1,691.814 |
జూలై | 2010 | 1,542.146 |
ఆగస్టు | 2010 | 1,636.88 |
సెప్టెంబర్ | 2010 | 1,542 |
అక్టోబర్ | 2010 | 12,072 |
నవంబర్ | 2010 | 13,957.218 |
డిసెంబర్ | 2010 | 15,900.76 |
- ఎన్టీపిసి వద్ద 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరపడం కోసం రోజుకు 30వేల పై చిలుకు మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉండగా ఎన్టీపిసి కోల్ యార్డ్‌లో సుమారు 7లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది.ఎన్టీపిసికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, (సింహాద్రి) అనే పేరుతో మరో సంస్థ విశాఖపట్నంలో ఉంది.