ఇంద్రావతి నది
ఇంద్రావతి | |
---|---|
స్థానం | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర |
జిల్లా | కలహండి, నబ్‌రంగ్‌పూర్ |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | దండకారణ్యం, కలహండి, ఒరిస్సా |
• అక్షాంశరేఖాంశాలు | 19°26′46″N 83°07′10″E / 19.44611°N 83.11944°E |
• ఎత్తు | 914 మీ. (2,999 అ.) |
సముద్రాన్ని చేరే ప్రదేశం | గోదావరి |
• స్థానం | సోమునూర్ సంగం, సిరోంచా, గడ్చిరోలి, మహారాష్ట్ర |
• అక్షాంశరేఖాంశాలు | 18°43′25″N 80°16′19″E / 18.72361°N 80.27194°E |
• ఎత్తు | 82.3 మీ. (270 అ.) |
పొడవు | 535 కి.మీ. (332 మై.) |
పరీవాహక ప్రాంతం | 40,625 కి.మీ2 (15,685 చ. మై.) |
పరీవాహక ప్రాంత లక్షణాలు | |
ఉపనదులు | |
• ఎడమ | నందిరాజ్ నది |
• కుడి | భస్కేల్ నది, నారంగి నది, నంబ్రా నది, కోట్రి నది, బందియా నది |
ఇంద్రావతి నది, గోదావరికి ఉపనది. ఇది తూర్పు కనుమలలో పుట్టి గోదావరిలో కలసిపోతుంది. ఈ నది మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకు, ఒరిస్సా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలకూ సరిహద్దుగా ఉంది. ప్రఖ్యాతి చెందిన చిత్రకూట జలపాతం ఇంద్రావతి నది మీదనే, జగదల్ పూర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ నది చాలావరకు దట్టమైన అడవుల మధ్యగా ప్రవహిస్తుంది. ఇంద్రావతి నదిని బస్తర్ జిల్లా ప్రాణదాత అని పిలుస్తారు. ఈ నదీ తీరంలో ఇంద్రావతి జాతీయ వనం ఉంది.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ల నుండి తెలంగాణలో ప్రవేశించి, భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు వద్ద గోదావరిలో కలుస్తుంది. ఇంద్రావతి నదికి వరద నీరు ఎక్కువ. కాళేశ్వరం పాజెక్టు లో భాగంగా తుపాకులగూడెం బ్యారేజీ నుంచి రోజు నాలుగు టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు కావాల్సిన నీటి లభ్యత ఈ నది నుంచి లభిస్తుందని నిపుణులు అంచనా వేసరు. ఇంద్రావతి నది నీటిని రివర్స్ పంపిగ్ ద్వారా నాగార్జున సాగర్‌కు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు మళ్లించి నదులను అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.
ఒరిస్సా లోని కలహండి జిల్లాలో మర్దిగూడా గ్రామం వద్ద తూర్పు కనుమల్లో సముద్ర మట్టం నుండి 914.4 మీ. ఎత్తున ఇంద్రావతి నది పుడుతోంది. అక్కడి నుండి ఒరిస్సా లోని కలహండి, నబరంగ్‌పూర్, కోరాపుట్ జిల్లాల గుండా 164 కి.మీ. ప్రవహించి, ఆ తరువాత 9.5 కి.మీ. దూరం ఒరిస్సా, చత్తీస్‌గఢ్ లకు సరిహద్దుగా ప్రవహించి చత్తీస్‌గఢ్ లోకి ప్రవేశిస్తుంది. చత్తీస్‌గఢ్‌లో 233 కి.మీ. దూరం ప్రవహించి, చత్తీస్‌గఢ్ మహారాష్ట్ర లకు సరిహద్దుగాఅ మరో 129 కి.మీ. ప్రవహిస్తుంది. చివరికి, మొత్తం 535 కి.మీ. ప్రయాణం తరువాత, చత్తీస్‌గఢ్ మహారాష్ట్ర, తెలంగాణ -ఈ మూడు రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దు వద్ద గోదావరిలో కలుస్తుంది. దీని మొత్తం పరీవాహక ప్రాంతం 40,625 చ.కి.మీ. ఒరిస్సాలో ఇది 7,435 చ.కి.మీ., ఉంటుంది.. దీని ప్రయాణంలో ఇది 914.4 మీ. నుండి గోదావరిలో కలిసే సరికి దీని ఎత్తు 832.1 మీ. పడి పోయి 82.3 మీ.కు చేరుతుంది.
ఒరిస్సాలో ఇంద్రావతి, శబరి నదులు ఒకచోట కలుస్తాయి. వరదలు వచ్చినపుడు ఇంద్రావతి నుండి వరద నీరు ప్రవహించి శబరిలో కలుస్తుంది.
ఉపనదులు
[మార్చు]కేశధార నాలా, కందబింద నాలా, చంద్రగిరి నాలా, గోలాగర్ నాలా, పోరాగఢ్ నాలా, కాపూర్ నాలా, మూరాన్ నది, బనగిరి నాలా, తెలెంగి నాలా, పర్లిజోరి నాలా, తురి నాలా, చౌరిజోరి నాలా, దమయంతి సాయాఢ్, కోరా నది, పద్రికుండిజోరి నది, జౌరా నది, భస్కేల్ నది, బోర్డింగ్, నారంగి, నింబ్రా, కోట్రి, బందియా, నందిరాజ్ లు ఇంద్రావతికి ఉపనదులు. [1]
ఆనకట్టలు
[మార్చు]ఒరిస్సాలో కలహండి జిల్లా ముఖిగూడా వద్ద ఇంద్రావతి ఆనకట్ట, ఎగువ ఇంద్రావతి జలవిద్యుత్తు కేంద్రాన్ని నిర్మించారు. ఈ కేంద్రానికి 600 మె.వా. ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఈ ఆనకట్ట ద్వారా ఎగువ మహానది లోయలో సాగునీటి సౌకర్యం కలుగుతుంది.
ఇంద్రావతిపై నిర్మించ తలపెట్టిన్ ఐదు ఇతర జలవిద్యుత్తు ప్రాజెక్టులు పర్యావరణ సమస్యల కారణంగా రద్దయ్యాయి.
బయటి లింకులు
[మార్చు]- Indravati Power Station
- Damning the Indravati? Archived 2007-11-11 at the Wayback Machine
- Indravati National Park, Chattisgarh
వెలుపలి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Chapter 3 : River System & Basin Planning" (PDF). Powermin.nic.in. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 2016-02-11.