పృథ్వీ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పృథ్వీ షా
2019 లో షా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పృథ్వీ పంకజ్ షా
పుట్టిన తేదీ (1999-11-09) 1999 నవంబరు 9 (వయసు 24)
థానే, మహారాష్ట్ర
ఎత్తు5 ft 4 in (163 cm)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ బ్రేక్
పాత్రOpening batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 293)2018 అక్టోబరు 4 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2020 డిసెంబరు 17 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 231)2020 ఫిబ్రవరి 5 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2021 జూలై 23 - శ్రీలంక తో
ఏకైక T20I (క్యాప్ 87)2021 జూలై 25 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016/17–presentముంబై
2018–presentఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫస్ట్
మ్యాచ్‌లు 5 6 1 41
చేసిన పరుగులు 339 189 0 3623
బ్యాటింగు సగటు 42.37 31.50 0.00 51.76
100లు/50లు 1/2 0/0 0/0 12/15
అత్యుత్తమ స్కోరు 134 49 0 379
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 2/– 1/– 28/-
మూలం: ESPNcricinfo, 11 January 2023

పృథ్వీ షా భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1999, నవంబరు 9న జన్మించాడు.తండ్రి విహార్.

అరంగేట్రం[మార్చు]

వెస్టిండీస్‌తో 2018 లో రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పృథ్వీ షా, 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. దాంతో భారత్‌ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేయడమే కాకుండా సెంచరీతో మెరిశాడు.  మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు సచిన్‌ టెండూల‍్కర్‌ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు.

మరొకవైపు టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్‌ సెంచరీ సాధించిన మూడో ఓవరాల్‌ క్రికెటర్‌గా షా గుర్తింపు సాధించాడు. శిఖర్‌ ధావన్‌ 85 బంతుల్లో ఆసీస్‌పై సెంచరీ సాధించగా, డ్వేన్‌ స్మిత్‌ 93 బంతుల్లో శతకం సాధించిన ఆటగాడు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన నాల్గో పిన్నవయస‍్కుడిగా షా నిలిచాడు.

పృథ్వీ షా బ్యాటింగ్‌ రికార్డులు[మార్చు]

14 ఏళ్ల వయసులో పాఠశాల జట్టు రిజ్వీ స్ప్రింగ్‌ ఫీల్డ్‌ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో 546 పరుగులు. 17 ఏళ్ల వయసులో అరంగేట్ర ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కైవసం. తొలి దులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లోనే, అదీ అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన అరుదైన రికార్డు. దేశానికి అండర్‌–19 ప్రపంచ కప్‌ సారథి. ఇప్పుడిక మొదటి ఫస్ట్‌క్లాస్‌మ్యాచ్‌ ఆడిన 21 నెలల వ్యవధిలోనే జాతీయ జట్టు తరఫున ప్రాతినిధ్యం... ఈ ఘనతలన్నీ పృథ్వీ షా సొంతం.

పురస్కారాలు[మార్చు]

వన్డే క్రికెట్[మార్చు]

[2]

మూలాలు[మార్చు]

  1. Venugopal, Arun (5 January 2017). "Mumbai tune in to the Prithvi show". Cricinfo. At five feet, four inches, he is the shortest player in the team.
  2. Sakshi (18 July 2021). "తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం". Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పృథ్వీ_షా&oldid=3957742" నుండి వెలికితీశారు