కవితా లాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కవితా లాడ్
జననం (1973-11-13) 1973 నవంబరు 13 (వయసు 50)
విద్యహోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూల్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1993-ప్రస్తుతం
జీవిత భాగస్వామి
ఆశిష్ మేధేకర్‌
(m. 2003)
పిల్లలు2

కవితా లాడ్, మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. చార్ దివాస్ ససుచే, [1] ఉంచ్ మాజా జోకా, రాధా హి బవారీ, రాధా ప్రేమ్ రంగి రంగాలిలో వంటి సీరియళ్ళలోనూ, సుందర్ మి హోనార్, ఎకా లగ్నాచి గోష్ట, చార్ దివాస్ ప్రేమచే, లగ్నాచి పుఢ్చి గోష్ట వంటి నాటకాలలో నటించింది.[2]

జననం, విద్య

[మార్చు]

కవితా లాడ్ 1973, నవంబరు 13న మహారాష్ట్రలోనే థానే ప్రాంతంలో జన్మించింది. థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూల్ లోనూ, ఠాణా కళాశాలలోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తిచేసింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కవితకు 2003లో ఆశిష్ మేధేకర్‌తో వివాహం జరిగింది.[3] వారికి ఇద్దరు పిల్లలు.

నటనారంగం

[మార్చు]

కవితా లాడ్ తొలిసారిగా ఎన్. చంద్రస్ తీసిన ఘయాల్‌ అనే మరాఠీ సినిమాలో అజింక్యా డియోతో కలిసి నటించింది. లక్ష్మీకాంత్ బెర్డే సరసన జిగర్, ప్రశాంత్ దామ్లే సరసన తూ తిథే మీ అనే సినిమాలలో నటించింది.[4]

డా. శ్రీరామ్ లాగూ, వందనా గుప్తే నటించిన సుందర్ మి హోనార్‌ అనే నాటకంతో మరాఠీ నాటకరంగంలోకి అడుగుపెట్టింది. చార్ దివస్ ప్రేమచే, ఏక లగ్నాచి గోష్టా, మజియా భౌజిన్నా రీట్ కలేన్ ఎ, ఏకా లగ్నాచి పుడ్చి గోష్ట్ వంటి నాటకాలలో ప్రశాంత్ దామ్లేతో కలిసి నటించింది.[5] [6]

2014లో వచ్చిన చంద్రకాంత్ చిప్లుంకర్ సీడీ బంబావాలా[7] సీరియల్ తో మరాఠీ టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టి చార్ దివాస్ ససుచే, కే పహిలాస్ మజ్యాత్, దార్ ఉగాడ నా గాడే, ఉంచ్ మాజా జోకా, రాధా హాయ్ బవారీ, తుమ్చా ఆమ్చా సేమ్ అస్తా, తుజ్యా వచున్ కర్మేనా, రాధా ప్రేమ్, రంగి రంగాలి మొదలైన సీరియళ్ళలో నటించింది.

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు
1993 ఘయాల్ సంగీతా మాండ్కే తొలి సినిమా
1995 చల్ కన్వరియా శివ కే ధామ్
1998 జిగర్ లూసీ పాస్కల్/లతా పావస్కర్
1998 తూ తిథే మీ కవిత మరాఠీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
2006 లాపున్ చపున్
2008 అనోల్ఖి హే ఘర్ మేజ్ శుభదా దేశ్‌ముఖ్
2009 సుఖంత్ వినా గుంజే
2015 ఉర్ఫీ అమృత తల్లి
2016 డాక్టర్ రఖ్మాబాయి జయంతీబాయి
2018 అసేహి ఏకదా వ్హవే రేణుకా పరాంజపే
2019 లవ్ యు జిందగీ నలుడు [8]
2019 గర్ల్ ఫ్రెండ్ నచికేత్ తల్లి

నాటకరంగం

[మార్చు]
సంవత్సరం నాటకం పేరు పాత్ర మూలాలు
1996 సుందర్ మి హోనర్ సంజయ్ భార్య
1996 చార్ దివస్ ప్రేమచే [9]
1997 ష్...కుతే బోలాయ్చ నహీ
1998 ఏక లగ్నాచి గోష్ట మనీషా [10]
2012 మజియా భౌజినా రీత్ కలేనా [11]
2018 ఏక లగ్నాచి పుఢచి గోష్ట మనీషా [12]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం సీరియల్ పేరు పాత్ర మూలాలు
2000 కామెడీ డాట్ కామ్ సఖు
2000 కే పహిలాస్ మజ్యాత్
2001-2012 చార్ దివాస్ ససుచే అనురాధ దేశ్‌ముఖ్
2016-2012 మేజ్వానీ పరిపూర్ణ కిచెన్ హోస్ట్
2007 దార్ ఉఘడ నా గాడే ఎపిసోడిక్ పాత్ర
2008 జోడి జమ్లీ రే హోస్ట్
2012-2013 ఉంచ్ మాజా జోకా ఉమాబాయి కుర్లేకర్ [13]
2013-2014 రాధ హాయ్ బవారీ సీమా ధర్మాధికారి
2014-2015 చంద్రకాంత్ చిప్లుంకర్ సీడీ బంబావాలా హేమాలి చిప్లుంకర్ [14]
2015-2016 తుమ్చా ఆమ్చా సేమ్ అస్తా ఇషాన్ తల్లి [15]
2016-2017 తుజ్య వచున్ కర్మేణ సిద్ధార్థ్ తల్లి [16]
2017-2019 రాధా ప్రేమ్ రంగి రంగాలి మాధురీ పరాంజపే [17]

మూలాలు

[మార్చు]
  1. "Exclusive: I never wore jeans offscreen when Char Divas Sasuche was on air", says Kavita Lad-Medhekar - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  2. "I wish, I were part of films like 'Shala' and 'Deool' - Kavita Lad Medhekar". 2012-04-01. Retrieved 2022-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Kavitha Lad biography".[permanent dead link]
  4. "Eye-opener: Sukhant - Indian Express". archive.indianexpress.com. Retrieved 2022-09-03.
  5. "Kavita Lad loves these two Marathi plays - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  6. "Post-lockdown, Eka Lagnachi Pudhchi Goshta becomes first Marathi play to return to auditoriums - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  7. "Who is firefighter Chandrakant Chiplunkar Seedi Bambawala? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  8. "Love You Zindagi: Sachin Pilgaonkar and Kavita Lad's film will start our new year with a bang". Box Office India (in ఇంగ్లీష్). 2018-11-21. Retrieved 2022-09-03.[permanent dead link]
  9. "'Char Divas Premache' crosses the 1000th mark". Retrieved 2022-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Meet the Eka Lagnachi Pudhchi Gosht cast before watching them on stage - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  11. ""Mazhiya Bhaujina Reet Kalena" Marathi Natak Cast Crew Photos". MarathiStars. 2013-01-20. Retrieved 2022-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Theatre Review: Eka Lagnachi Pudhchi Goshta - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  13. "Kavita Lad exit from Char Divas Sasuche for Unch Maaza Zoka". Divya Marathi. 2012-08-04. Retrieved 2022-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "I am looking forward to another great innings with Prashant in Chandrakant Chiplunkar - Kavita Lad". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-03.
  15. megamarathi (2015-08-26). "Tumcha Amcha Same Asta| Star Pravah Serial". MegaMarathi.Com. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.
  16. "Tujhya Vachun Karmena - Colors Marathi Serial". MarathiStars. 2016-06-28. Retrieved 2022-09-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. "Radha Prem Rangi Rangli Colors Marathi Serial Starcast". 2017-12-17. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-03.

బయటి లింకులు

[మార్చు]