Jump to content

షిలహర

వికీపీడియా నుండి

షిలహర

8th century CE–13th century CE
రాజధానిThane
సామాన్య భాషలుSanskrit, Marathi, Old Marathi, Kannada[1]
ప్రభుత్వంMonarchy
చరిత్ర 
• స్థాపన
8th century CE
• పతనం
13th century CE
Today part of భారతదేశం

శిలహర రాజవంశం (IAST: Śilāhāra; సింహర, శైలహర, శ్రీలారా, లేదా సిలారా) ఒక రాజ వంశం. ఇది రాష్ట్రకూట కాలంలో స్థాపించబడిన ఈ రాజవంశం ఉత్తర, దక్షిణ కొంకణ, ప్రస్తుత ముంబై, దక్షిణ మహారాష్ట్రలలో ప్రాంతాలను పాలించింది.

అవి మూడు శాఖలుగా విభజించబడ్డాయి; ఒక శాఖ ఉత్తర కొంకణాన్ని, రెండవ దక్షిణ కొంకణాన్ని (765 – 1029 మధ్య) పరిపాలించింది. మూడవది ప్రస్తుతం సతారా, కొల్హాపూరు, బెల్గాం ఆధునిక జిల్లాల ప్రాంతాలను 940 – 1215 మధ్య పాలించింది. తరువాత వారిని చాళుక్యులు పడగొట్టారు.[2]

ఉత్పన్నం

[మార్చు]

ఈ రాజవంశం ముందుగా రాష్ట్రకూట రాజవంశం సామంతరాజ్యంగా ప్రారంభమైంది. ఇది 8 – 10 వ శతాబ్దాల మధ్య దక్కను పీఠభూమిని పాలించింది. రాష్ట్రకూట రాజు అయిన రెండవ గోవింద, ఉత్తర కొంకణ రాజ్యాన్ని (థానే, ముంబై, రాయగఢు ఆధునిక జిల్లాలు) కపర్ధిను (సంస్కృతంలో: ఝటాఝూట ధారి. శివుడిలా వ్రేలాడదీసిన జుట్టు ముడి - శివ (రిషభనాథ) దేవుని సూచించడానికి ఉపయోగించే పదం) సుమారు 800 లో ఉత్తర సిల్హారా కుటుంబాన్ని స్థాపించాడు. అప్పటి నుండి ఉత్తర కొంకణు కపర్ది-ద్విపా లేదా కవాదిద్విపా అని పిలువబడింది. ఈ శాఖకు రాజధాని పూరి (ప్రస్తుత రాయగఢు జిల్లాలోని రాజపూరు).

ఈ రాజవంశానికి టాగారా-పురాధీశ్వర బిరుదులు ఉన్నాయి. ఇది వారు మొదట ఠగర (ఉస్మానాబాదు జిల్లాలో ఆధునిక టెరు) నుండి వచ్చినవారని సూచిస్తుంది.

1343 లో సల్సెటు ద్వీపం, చివరికి మొత్తం ద్వీపసమూహం ముజాఫారిదు రాజవంశానికి స్వాధీనం అయ్యాయి.

ఈ మూడింటిలో చివరిదైన కొల్లాపూరు వద్ద ఉన్న దక్షిణ మహారాష్ట్రకు చెందిన శిలాహరా కుటుంబం రాష్ట్రకూట సామ్రాజ్యం పతనమయ్యే సమయంలో స్థాపించబడింది.

ఈ కుటుంబంలోని అన్ని శాఖలు గరుడ బారి నుండి నాగ యువరాజును రక్షించడానికి తనను తాను త్యాగం చేసిన పురాణ విద్యాధర యువరాజు జీముతవాహన నుండి ఉద్భవించాయి. కుటుంబం పేరు శిలాహర (సంస్కృతంలో "పర్వత శిఖర ఆహారం" అని అర్ధం) ఈ సంఘటన నుండి ఉద్భవించింది. ఒకటి కంటే ఎక్కువ రూపాలతో ఒకే శాసనాలు కూడా ఉన్నాయి. ఒకటి సిలారా, శిలారా, శ్రీలారా అనే మూడు రూపాలు ఉన్నాయి.

సిలారు కాఫీర్లు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తానులో ఉన్నందున శిలహారాలు ఆఫ్ఘను మూలానికి చెందినవారని లాసెను సూచిస్తున్నారు. అయినప్పటికీ దాదాపు అన్ని మంత్రుల పేర్లలో ఉపయోగించిన "అయ్య" కొంతమంది ముఖ్యుల సంస్కృతేతర పేర్లు వారు కన్నడ మూలానికి చెందిన వారన్న అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నాయి. దక్షిణ కొంకణంలోని శిలాహరాలు రాష్ట్రకూటుల సామంతులుగా 765 – 1020 వరకు పాలించారు.[3]

ఉత్తర కొంకణు (థానె శాఖ)

[మార్చు]
పటం
Find spots of inscriptions issued during the reign of the Shilaharas of North Konkan[4]
An anonymous silver drachma (perhaps from the North Konkan Silaharas) dating from the 11th-12th centuries. This kind of currency was found in the district of Nimar of Madhya Pradesh and in the Huzur Jawhirkhana of Indore. Dimension: 14 mm Weight: 4.4 g.

రాష్ట్రకూట శక్తి బలహీనమైన తరువాత ఈ కుటుంబానికి చివరి పాలకుడు రత్తరాజ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. కానీ విక్రమాదిత్య తమ్ముడు చాళుక్య జయసింహ ఆయనను పడగొట్టి ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాడు. ఎనిమిదవ శతాబ్దం ద్వితీయార్ధంలో ఉత్తర కొంకణాన్ని రాష్ట్రకూట రాజు దంతిదుర్గ స్వాధీనం చేసుకున్నాడు.[5]

ఆర్ నరసింహచార్య అభిప్రాయం ఆధారంగా వప్పువన్న, లస్తియవ, మొదలైన పేర్లు థానాలోని సిలహరలు కన్నడ మూలానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.[6]

పాలకులు

[మార్చు]
  1. మొదటి కపర్దినుడు (800 – 825)
  2. పుల్లషక్తి (825 – 850)
  3. రెండవ కపార్ధిను (850 – 880)
  4. వప్పువన్న (880 – 910)
  5. ఝాంఝా (910 – 930)
  6. గొగ్గిరాజ (930 – 945)
  7. మొదటి విజ్జడ (945 – 965)
  8. చాద్వైదేవ (965 – 975)
  9. అపరాజితుడు (975 – 1010)
  10. రెండవ వజ్జడ (1010–1015)
  11. అరికేసరినుడు (1015–1022)
  12. చిత్తరాజ (1022–1035)
  13. నాగార్జున (1035–1045)
  14. ముమ్మునిరాజా (1045–1070)
  15. మొదటి అనంతదేవ (1070–1127)
  16. మొదటి అపరాదిత్య (1127–1148)
  17. హరిపాలదేవ (1148–1155)
  18. మల్లిఖార్జునుడు (1155–1170)
  19. రెండవ అపరాదిత్య ( 1170–1197)
  20. రెండవ అనంతదేవ (1198–1200)
  21. కేషిదేవ (1200–1245)
  22. మూడవ అనంతదేవ (1245–1255)
  23. సోమేశ్వరుడు (1255–1265)

దక్షిణ కొంకణు

[మార్చు]
పటం
Find spots of inscriptions issued during the reign of the Shilaharas of South Konkan[7]

1008 లో జారీ చేసిన రత్తరాజ ఖరేపాటను ఫలకాల ఒక రికార్డు ఈ ఇంటి చరిత్ర తెలియజేస్తుంది. ఈ రాజవంశానికి చివరి పాలకుడు రత్తరాజ. రత్తరాజకు చెందిన పదిమంది పూర్వీకుల వంశవృక్షాన్ని ఇవ్వడమే కాక, వారి దోపిడీలను కూడా పేర్కొన్న కారణంగా ఈ ఈ పత్రం చాలా ముఖ్యమైనదిగా భావించబడుతుంది. స్థాపకుడు సనాఫుల్లా, రాష్ట్రకూట చక్రవర్తి మొదటి క్రిష్ణా చక్రవర్తికి సామంతుడుగా ఉన్నాడు. 765 నాటికి ఆయన కొంకణ మీద తన అధికారాన్ని స్థాపించి బహుశా దానిని సనాఫుల్లాకు అప్పగించాడు. క్రిష్ణారాజుకు అనుకూలంగా ఉండి సహయా పర్వతం, సముద్రం మధ్య ఉన్న భూభాగం మీద ప్రభువుగా సనాఫుల్లా అధికారం పొందాడని ఖరేపాటను ప్లేట్లు ప్రకటించాయి.

సనా-ఫుల్లా కుమారుడు ధమ్మాయిరా పశ్చిమ తీరంలో వల్లిపట్టన వద్ద ఒక కోటను నిర్మించినట్లు తెలుస్తుంది. గోవాలోని చంద్రపురి (చందోరు) లో అయ్యపరాజు విజయం సాధించాడు. మొదటి అవసరా పాలన, ఆయన కుమారుడు ఆదిత్యవర్మను సూర్యుని వంటి శౌర్యం కలవాడని పేరుపొందాడు. ఆయన బొంబాయికి దక్షిణాన 30 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రపురి, చెముల్య (ఆధునిక చౌలు) రాజులకు సహాయం అందించాడు. కాబట్టి శిలాహరల ప్రభావం కొంకణు అంతటా వ్యాపించింది. ఈ సమయంలో థానే శాఖ పాలకుడు లఘు కపర్ది కేవలం బాలుడు, చౌలు పాలకుడికి ఇచ్చిన సహాయం ఆయన ఖర్చుతోనే ఉండాలి. రెండవ అవసరా తన తండ్రి విధానాన్ని కొనసాగించాడు. చంద్రోరు చిన్న పాలకుడిని పడగొట్టినందున ఇంద్రరాజు కుమారుడు భీమాను 'రాహువాద్గ్రాస్త చంద్రమండల' అని పిలుస్తారు. ఈ సమయంలో కదంబ పాలకుడు శాస్తదేవ, అతని కుమారుడు చతుర్భుజా రాష్ట్రకుట పాలనను పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చంద్రపురి లేదా చందోరు పట్ల భీముడి వ్యతిరేకతను వివరిస్తుంది. మూడవ అవసరా నిస్సందేహంగా సమస్యాత్మక కాలంలో పాలించారు. చివరగా రాష్ట్రకూటులకు విధేయుడైన రత్తరాజా తన విధేయతను రెండవ తైలాకు బదిలీ చేయవలసి వచ్చింది.

1008 లో ఫలకాలు జారీ అయిన వెంటనే కొంకణు పాలన తరువాత చాళుక్యులకు చేరింది. (డిపార్ట్మెంటు గెజిటీరు: కొలాబా, 1964, డిపార్ట్మెంటు గెజిటీరు: 2002).

పాలకులు

[మార్చు]
  1. సనఫుల్లా (765 నుండి 795)
  2. ధమ్మాయిరా (795 నుండి 820)
  3. ఐయాపరాజా (820 to 845)
  4. మొదటి అవసరా (845 to 870)
  5. ఆదిత్యవర్మ (870 to 895)
  6. రెండవ అవసరా (895 to 920)
  7. ఇంద్రరాజా (920 to 945)
  8. భీమా (945 to 970)
  9. మూడవ అవసరా (970 to 995)
  10. రత్తరాజా (995 to 1020)

కొల్హాపూరు శాఖ

[మార్చు]
పటం
Find spots of inscriptions issued during the reign of the Shilaharas of Kolhapur[7]

కొల్లాపూరులోని శిలాహర కుటుంబం ఈ మూడింటిలో చివరిది రాష్ట్రకూట సామ్రాజ్యం పతనమైన సమయంలో స్థాపించబడింది. వారు దక్షిణ మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించారు; ఆధునిక జిల్లాలైన సతారా, కొల్హాపూరు, బెల్గావు. వారి కుటుంబ దేవత మహాలక్ష్మి దేవత. వారు తమ రాగి ఫలకాల వారిని వారు మహాలక్ష్మీ వరప్రసాదులమని (మహాలక్ష్మి-లబ్ధ-వర-ప్రసాద) పేర్కొన్నారు. కొంకణు ఉత్తర శాఖకు చెందిన వారి బంధువుల మాదిరిగానే, కొల్హాపూరు శిలాహరాలు విద్యాధారా జిముతవాహన వంశానికి చెందినవారని పేర్కొన్నారు. వారు బంగారు గరుడ బ్యానరును మోశారు. శిలహరసు ఉపయోగించిన అనేక బిరుదులలో ఒకటి ఠాగరపుర సార్వభౌమ పాలకుడు టాగరాపురవధీశ్వర. [8]

రెండవ జలీగా పాలనలో షిలాహరల మొదటి రాజధాని కరాడ అని బిల్హానా 'విక్రమంకాదేవచారిత' మీరాజు రాగి ఫలకం ఆధారంగా తెలిసింది.[9] అందువలన కొన్నిసార్లు వారిని 'కరాడు షిలాహరాలు' అని పిలుస్తారు. తరువాత రాజధానిని కొల్హాపూర్‌కు మార్చినప్పటికీ వారి గ్రాంట్లలో కొన్ని వాలావాడ, ప్రణలక లేదా పద్మనల కొండ కోట (పన్హాలా) రాజ నివాస స్థలాలుగా పేర్కొన్నాయి. రాజధానిని కొల్హాపూరుకు మార్చినప్పటికీ, షిలాహరా కాలంలో కర్హాదు దాని ప్రాముఖ్యతను నిలుపుకుంది. ఈ శాఖ రాష్ట్రకూట పాలన తరువాతి భాగంలో అధికారంలోకి వచ్చింది. ఇతర రెండు శాఖల రాజుల మాదిరిగా కాకుండా, ఈ శాఖకు చెందినవారు రాష్ట్రకూటల వంశవృక్షాన్ని కూడా ప్రస్తావించలేదు. తరువాత వారు కొంతకాలం తరువాత చాళుక్యుల ఆధిపత్యాన్ని అంగీకరించారు. వారి శాసనాల ఆధారంగా వారు కన్నడను అధికారిక భాషగా ఉపయోగించారని భావిస్తున్నారు. ఈ శాఖ దక్షిణ మహారాష్ట్రలో సిర్కా 940 – 1220 వరకు పాలన కొనసాగించింది.[ఆధారం చూపాలి]

ఈ కుటుంబం చివరి పాలకుడు రెండవ భోజాను 1219–20 (సాకా 1131) లో లేదా వెంటనే సింఘానా పడగొట్టాడని సాకా 1160 నాటి సింఘనా శాసనాలలో పేర్కొనబడింది.[10]

పాలకులు

[మార్చు]
  1. మొదటి జతిగా (940 – 960)
  2. నైవర్మను (960 – 980)
  3. చంద్రా (980 – 1000)
  4. రెండవ జతింగ (1000–1020)
  5. గొంక (1020–1050)
  6. మొదటి గుహాలా
  7. కీర్తిరాజా
  8. చంద్రాదిత్య
  9. మార్సింహుడు (1050–1075)
  10. రెండవ గుహల (1075–1085)
  11. మొదటి భోజుడు (1085–1100)
  12. బల్లాల (1100–1108)
  13. రెండవ గొంక
  14. మొదటి గందరాదిత్య (1108–1138)
  15. మొదటి విజయాదిత్య (1138–1175)
  16. రెండవ భోజుడు (1175–1212)

స్మారకాలు

[మార్చు]

ముంబై, కొల్హాపూరు జిల్లాలోని అనేక పురాతన స్మారక చిహ్నాలు ఈ రాజవంశం పరాక్రమానికి నివాళి అర్పించాయి:

  • ఈ రాజవంశం రాజు చిత్తరాజు పాలనలో వాల్కేశ్వరలయం, బంగంగా సరోవరం నిర్మించబడ్డాయి..[11]
  • ముంబైకి సమీపంలో ఉన్న శివ మందిరం, అంబర్నాథు కూడా 1060 లో చిత్తరాజా నిర్మించారు. శివాలయం.[12]
  • కోపినేశ్వర మందిరం, థానేలోని శివాలయం.
  • ఇబ్రహీంపూరు వద్ద కొల్లాపూరు శిలాహర్సు పార్శ్వనాథు జైన ఆలయం, చంద్గడు తాలూకాలోని భోగోలి.
  • గాదింగులాజు తాలూకాలోని ఐనాపూరు వద్ద కొల్లాపూరు శిలాహర్సు పార్శ్వనాథు జైన ఆలయం.
  • బాగని వద్ద కొల్హాపూర్ శిలాహార్సు పార్శ్వనాథు జైన ఆలయం, కాగలు తాలూకాలోని సంగావు.

మూలాలు

[మార్చు]
  1. K. M. Shrimali (1996). "How monetized was the Śilāhāra economy?". In Ram Sharan Sharma; Dwijendra Narayan Jha (eds.). Society and ideology in India: essays in honour of professor R.S. Sharma. Munshiram Manoharlal. p. 95. ISBN 9788121506397. Linguistically, 32 out of a total of 45 records of the two branches of Konkan area are in Sanskrit and the rest are sprinkled mostly with Marathi — there are a few cases of the flourishes of Old Marathi as well as Kannada.
  2. "Nasik History – Ancient Period". State Government of Maharashtra. Archived from the original on 29 ఏప్రిల్ 2005. Retrieved 14 అక్టోబరు 2006.
  3. Dept. Gazetteer: Thane,1982: Dept. Gazetteer: 2002
  4. V. V. Mirashi 1977, pp. xi–xiii.
  5. Dept. Gazetteer: 2002
  6. Ramanujapuram, Narasimhacharya (1942). History of Kannada Language. Asian Educational Services. pp. 46, 49. ISBN 9788120605596.
  7. 7.0 7.1 V. V. Mirashi 1977, p. xiii.
  8. Bhandarkar : 1957, Fleet: 1896
  9. (Dept. Gazetteer: 2002)
  10. Fleet: 1896
  11. "Banganga, Walkeshwar history". Archived from the original on 6 అక్టోబరు 2008. Retrieved 11 నవంబరు 2019.
  12. "प्राचीन श्रीस्थानक ते आधुनिक ठाणे शहर" (in Marathi). Thane Municipal Corporation. Retrieved 8 ఆగస్టు 2015.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

గ్రంధసూచిక

[మార్చు]
  • Bhandarkar R.G. (1957): Early History of Deccan, Sushil Gupta (I) Pvt Ltd, Calcutta.
  • Fleet, J.F. (1896): "The Dynasties of the Kanarese District of The Bombay Presidency", written for The Bombay Gazetteer.
  • Department of Gazetteer, Govt of Maharashtra (2002): Itihaas : Prachin Kal, Khand -1 (Marathi)
  • Department of Gazetteer, Govt of Maharashtra (1960): Kolhapur District Gazetteer
  • Department of Gazetteer, Govt of Maharashtra (1964): Kolaba District Gazetteer
  • Department of Gazetteer, Govt of Maharashtra (1982): Thane District Gazetteer
  • A.S. Altekar (1936): The Śilāhāras of Western India.
  • V. V. Mirashi, ed. (1977). Corpus Inscriptionum Indicarum. Vol. VI: Inscriptions of the Śilāhāras. Archaeological Survey of India. OCLC 5240794.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=షిలహర&oldid=4088970" నుండి వెలికితీశారు