అంటరానితనం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అంటరానితనం అనే దురాచారం ఒక మూఢ విశ్వాసం. తోటి మానవుని, మానవునిగా చూడలేని మూఢ విశ్వాసం. ఈ అంటరానితనం అనాదిగా సమాజంలో ఉంటూ, ఈ నాటికి కూడా కొన్ని సమాజాలలో కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో హిందూ మతంలోని కుల వ్యవస్థకు సంబంధించిన నియమాలతో అంటరానితనం ఒకటి. దీనినే అస్పృస్యత అని కూడా అంటారు.హిందూ మతంలోని చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉంది. అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు. నాలుగోవర్ణమైన శూద్ర వర్ణం వారు వ్యవసాయ అనుబంధ వృత్తులు పై మూడు వర్ణాలకు సేవలు అందించే వారిగా పరిగణింపబడ్డారు. ఆధునిక సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలలో తేడాలు తగ్గినప్పటికీ, చాతుర్ వర్ణ వ్యవస్థ కు బైట ఉన్న పంచములను (చర్మకార,వృత్తులవారిని)అంటరాని వారిగా చూసారు.
పుట్టుపూర్వోత్తరాలు[మార్చు]
ప్రాచీన హిందూమతంలో అంటరానితనం కుల వ్యవస్థలో ఎక్కడా ఉన్న నిదర్శనాలు లేవు.చాతుర్వర్ణాలను గురించే మనపురాణాలలో చెప్పబడింది. పంచమ వర్ణాన్ని గురించి చెప్పబడలేదు. ఆర్యులు మన దేశానికి వచ్చిన తర్వాత హిందువులలో కొందరు వారి ఆచార వ్యవహారాలను పాటిస్తూ వారిలో కలిసిపోయారు. వారిలో కలవకుండా మిగిలిన వారే పంచములు లేదా అంటరానివారుగా పరిగణింపబడ్డారు.కొన్ని మతపరమైన శుచి, అశుచి భావనల నుండి అస్పృశ్య కులాలు ఉద్భవించినట్లు 'గుర్యే' అనే శాస్త్రవేత్త అభిప్రాయం. పంచములు హీన వృత్తులను చేపట్టడం వలన అస్పృశ్యులుగా పరిగణింపబడ్డారు. ఈ విధంగా పంచముల పుట్టుక జాతి పర్యవసానమని కొందరు, వృత్తిపరమైన వర్యవసానమని కొందరి అభిప్రాయం.అంటరానితనం అనేది తక్కువ స్థాయి పని అని సమాజంలో
అంటరానితనం అనేది కొన్ని సామాజిక సమూహాల తక్కువ స్థితి. ఇది సాధారణంగా హిందూ కుల వ్యవస్థతో ముడిపడి ఉంటుంది, కానీ ఇలాంటి సమూహాలు హిందూ మతం వెలుపల ఉన్నాయి. ఉదాహరణకు జపాన్‌లోని బురాకుమిన్, దక్షిణాఫ్రికాలో నల్లజాతీయులు, రువాండాలోని హుటు, త్వా. ఇరవై ఒకటవ శతాబ్దం ప్రారంభంలో భారత ఉపఖండంలో 160 మిలియన్లకు పైగా అంటరానివారు ఉన్నారని అంచనా.
అంటరానితనం, వివక్షత[మార్చు]
- ఇతర కుల సభ్యులతో కలిసి తినకుండా నిషేధం
- గ్రామాలలోని టీ స్టాల్స్‌లో దళితులకు ప్రత్యేక త్రాగు నీటి పాత్రలు ఏర్పాటు
- గ్రామ కార్యక్రమాలు పండుగలలో, ఆహార ఏర్పాట్లలో వేరుగా పరిగణించడం
- గ్రామ దేవాలయాలలోకి ప్రవేశించకుండా నిషేధం
- ధనిక,అధిక కుల సభ్యుల ముందు చెప్పులు ధరించడం, గొడుగులు పట్టుకోవడం
- అగ్ర కులాల గృహాల్లోకి ప్రవేశించకుండా నిషేధం
- గ్రామం లోపల సైకిల్ తొక్కడం నిషేధం
- సాధారణ గ్రామ మార్గాన్ని ఉపయోగించకుండా నిషేధం
- ప్రత్యేక శ్మశాన వాటికలు
- గ్రామం యొక్క సాధారణ / ప్రజా ఆస్తులు, వనరులకు (బావులు, చెరువులు, దేవాలయాలు మొదలైనవి) ఉపయోగించుకోవటానికి నిషేధం
- పాఠశాలల్లో దళిత పిల్లలను ప్రత్యేకంగా విభజించి కూర్చోబెట్టుట
- తమ "విధులను" నిర్వహించడానికి నిరాకరించినందుకు ఇతర కులాల సామాజిక బహిష్కరణలు
భారత ప్రభుత్వం చర్యలు[మార్చు]
భారతదేశపు 1950 జాతీయ రాజ్యాంగం అంటరానితనం అభ్యాసాన్ని చట్టబద్దంగా రద్దు చేస్తుంది, విద్యా సంస్థలు, ప్రజా సేవలు రెండింటిలోనూ అంటరానితనం నిర్మూలనకు సానుకూల చర్యలు తీసుకుంటన్నాయి.వీటిని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వంటి అధికారిక సంస్థలు భర్తీ చేస్తాయి.