Jump to content

ఆలంపూర్ జోగులాంబ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 15°52′37.2″N 78°07′55.2″E / 15.877000°N 78.132000°E / 15.877000; 78.132000
వికీపీడియా నుండి
ఆలంపూర్ జోగులాంబ దేవాలయం
దేవాలయ గోపురం
మతం
అనుబంధంహిందూ
జిల్లాజోగులాంబ జిల్లా
దైవంజోగులాంబ దేవి
ప్రదేశం
ప్రదేశంఆలంపూర్
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
ఆలంపూర్ జోగులాంబ దేవాలయం is located in India
ఆలంపూర్ జోగులాంబ దేవాలయం
Location in Telangana
ఆలంపూర్ జోగులాంబ దేవాలయం is located in Telangana
ఆలంపూర్ జోగులాంబ దేవాలయం
ఆలంపూర్ జోగులాంబ దేవాలయం (Telangana)
భౌగోళిక అంశాలు15°52′37.2″N 78°07′55.2″E / 15.877000°N 78.132000°E / 15.877000; 78.132000
వాస్తుశాస్త్రం.
శైలిడ్రావిడియన్
Website
https://srijogulamba.com/

జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న దేవి ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయమిది. పద్దెనిమిది (అష్టాదశ) మహా శక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం, తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఆలంపూర్ లో ఏడవ-ఎనిమిదవ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన తొమ్మిది శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోనే ఈ జోగులాంబ దేవాలయం ఉంది.[1][2]

జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడి స్థానికులు చెబుతారు. 2019లో, ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్‌మెంట్ డ్రైవ్) పథకం కింద చేర్చారు.[3]

ప్రదేశం

[మార్చు]

హైదరాబాద్-బెంగళూరు హైవేపై హైదరాబాదుకు దక్షిణాన 200 కి.మీ. దూరంలో ఈ దేవాలయం ఉంది.

చరిత్ర

[మార్చు]
సతీదేవి శవాన్ని మోస్తున్న శివుడు

సతీదేవికి చెందిన పైపళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడి, 1390లో బహమనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు, బహమనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్ఠపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు.[4][5] ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి, దాచిపెట్టారు. అప్పటినుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు.[4][5][6]

అవార్డులు

[మార్చు]

హిందూస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించిన సందర్భంగా సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న శక్తిపీఠాలకు అందించిన అవార్డులలో జోగులాంబ దేవాలయానికి ప్రతిష్టాత్మక హిందూస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు - 2022 వచ్చింది. 2022 డిసెంబరు 14న జోగులాంబ దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈవో పురేందర్ కుమార్, దేవాలయ ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ, వేద పండితులు వంకాయల శ్యాం కుమార్ శర్మ తదితరులు ఈ అవార్డును అందుకున్నారు.[7]

వెబ్‌సైట్

[మార్చు]

జోగులాంబ దేవాలయంకోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ ను 2023 ఫిబ్రవరి 13న అరణ్య భవన్‌లో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించాడు. దేవాలయానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేయ‌డంతోపాటు భక్తులు సులువుగా ఆయాల దర్శనం, ఛండీహోమం, వసతి గదుల బుకింగ్ సేవల వంటివి ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్‌సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో ఆలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం. అబ్రహం, అధికారులు పాల్గొన్నారు.[8]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Alampur, Temples of Andhra Pradesh". Retrieved 2022-03-30.
  2. "Mahabubnagar-NIC". mahabubnagar.nic.in. Archived from the original on 3 April 2016. Retrieved 2022-03-30.
  3. Chandrasekhar, K. (2019-08-27). "Jogulamba temple gets Centre's 'Prasad'". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-30.
  4. 4.0 4.1 Kolluru, Pallavi. "Alampur temple town beckons one and all". Telangana Today. Retrieved 2022-03-30.
  5. 5.0 5.1 Bhoomi, Vivek. "This ancient temple town is the Kashi of south". Telangana Today. Retrieved 2022-03-30.
  6. "ఐదవ శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ". Mana Telangana. 2018-10-31. Archived from the original on 2022-10-04. Retrieved 2022-03-30.
  7. telugu, NT News (2022-12-15). "జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు". www.ntnews.com. Archived from the original on 2022-12-17. Retrieved 2022-12-17.
  8. "జోగులాంబ ఆలయ వెబ్‌సైట్‌ ప్రారంభం". EENADU. 2023-02-14. Archived from the original on 2023-02-14. Retrieved 2023-02-16.

వెలుపలి లింకులు

[మార్చు]