Coordinates: Coordinates: Unknown argument format

అలంపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలంపూర్
—  శాసనసభ నియోజకవర్గం  —
ఆలంపూర్ is located in Telangana
ఆలంపూర్
ఆలంపూర్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు చల్లా వెంకట్రామి రెడ్డి

అలంపూర్ శాసనసభ నియోజకవర్గం, జోగులాంబ గద్వాల జిల్లా లోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి .2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో భాగంగా ఉన్న పెబ్బేరు మండలం వనపర్తి నియోజకవర్గంలోకి వెళ్ళిపోగా, గద్వాల నియోజకవర్గం నుంచి కొత్తగా అయిజ మండలం వచ్చి చేరింది. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీకి చెందిన రావుల రవీంద్రనాథ్ రెడ్డి 3 సార్లు విజయం సాధించాడు.[1][2][3]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గ గణాంకాలు[మార్చు]

  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,61,870.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి): 2,12,235.[4]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 21.64%, 0.43%.

నియోజకవర్గ భౌగోళికం[మార్చు]

మహబూబ్‌నగర్ జిల్లాలో దక్షిణంగా ఉన్న ఈ నియోజకవర్గం దక్షిణాన కర్నూలు జిల్లాతో తుంగభద్ర నది వేరు చేస్తున్నది. పశ్చిమాన కొంతభాగం కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కలిగి ఉంది. ఈశాన్యాన వనపర్తి నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం సరిహద్దులుగ్ ఉన్నాయి. వాయవ్యాన గద్వాల నియోజకవర్గం సరిహద్దును కలిగి ఉంది. నియోజకవర్గం గుండా ఇటిక్యాల, మానవపాడు మండలాల మీదుగా 7వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[5]

జాబితా[మార్చు]

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 నాగన్న భారత జాతీయ కాంగ్రెస్ జమ్మన స్వతంత్ర అభ్యర్థి
పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ టి.చంద్రశేఖర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1952-57 పాగ పుల్లారెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ డి.ఎం.రెడ్డి పి.డి.ఎఫ్
నాగన్న భారత జాతీయ కాంగ్రెస్ రాజయ్య పి.డి.ఎఫ్
1957 జయలక్ష్మీ దేవమ్మ[6] భారత జాతీయ కాంగ్రెస్ జనార్ధనరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1962 మురళీధర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పాగ పుల్లారెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1967 టి.చంద్ర శేఖర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ జనార్ధనరెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 టి.చంద్ర శేఖర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1974 ఉపఎన్నిక టి.రాజశేఖర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎన్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 చల్లా రాంభూపాల్ రెడ్డి జనతా పార్టీ టి.రజనీబాబు స్వతంత్ర అభ్యర్థి
1983 టి.రజనీ బాబు తెలుగుదేశం పార్టీ టి.ఎల్.ఎస్.దేవి భారత జాతీయ కాంగ్రెస్
1985 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ బి.అనసూయమ్మ భారత జాతీయ కాంగ్రెస్
1989 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ టి.రజనీబాబు భారత జాతీయ కాంగ్రెస్
1994 కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ డి.విష్ణువర్థన్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1999 రావుల రవీంద్రనాథ్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కొత్తకోట ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 చల్లా వెంకట్రామ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ పోతుల సునీత (వావిలాల సునీత) తెలుగుదేశం పార్టీ
2009 వి.ఎం. అబ్రహం భారత జాతీయ కాంగ్రెస్ ప్రసన్న కుమార్ తెలుగుదేశం పార్టీ
2014 సంపత్ కుమార్[7] భారత జాతీయ కాంగ్రెస్ మందా శ్రీనాథ్ తెలంగాణ రాష్ట్ర సమితి
2018 వి.ఎం. అబ్రహం తెలంగాణ రాష్ట్ర సమితి సంపత్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
2023[8] విజయుడు బీఆర్​ఎస్​ సంపత్ కుమార్ భారత జాతీయ కాంగ్రెస్

1999 ఎన్నికలు[మార్చు]

1999 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రావుల రవీంద్రనాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తకోత ప్రకాష్ రెడ్డిపై 30254 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు. రవీంద్రనాథ్ రెడ్డి 53588 ఓట్లు సాధించగా, ప్రకాష్ రెడ్డికి 23334 ఓట్లు లభించాయి. ఈ నియోజకవర్గం నుండి మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీ చేయగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి మద్దతి ఇచ్చింది. పోటీలో ఉన్న మిగితా ఐదుగురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన చల్లా వెంకట్రామిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన పోతుల సునీత (వావిలాల సునీత)పై 4191 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట్రామిరెడ్డి 37449 ఓట్లు సాధించగా, సునీతకు 33258 ఓట్లు లభించాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చల్లా వెంకట్రామిరెడ్డి రెబెల్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్లు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
110041
చల్లా వెంకట్రామిరెడ్డి*
  
37499
వావిలాల సునీత*
  
33258
రావుల రవీంద్రనాథ్ రెడ్డి*
  
28253
బోయ గణపతినాయుడు*
  
2820
ఇతరులు*
  
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పేర్టీ పొందిన ఓట్లు
1 చల్లా వెంకట్రామిరెడ్డి ఇండిపెండెంట్ 37499
2 వావిలాల సునీత తెలుగుదేశం పార్టీ 33258
3 రావుల రవీంద్రనాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి 28253
4 బోయ గణపతి నాయుడు బహుజన్ సమాజ్ పార్టీ 2820
5 కె.గోపాల్ రావు పిపిఓఐ 2265
6 పి.నారాయణరెడ్డి ఇండిపెండెంట్ 1831
7 టి.రత్నకుమార్ ఇండిపెండెంట్ 1495
8 ఎం.సుబ్బయ్య ఇండిపెండెంట్ 553
9 సంకటి శ్యాంరాజు ఇండిపెండెంట్ 499
10 బోయ నర్సింహనాయుడు ఇండిపెండెంట్ 421
11 బి.భాస్కర్ రెడ్డి ఇండిపెండెంట్ 316
12 వెంకట్రామిరెడ్డి ఇండిపెండెంట్ 310
13 మద్దిలేటి ఇండిపెండెంట్ 292
14 రత్నమన్న ఇండిపెండెంట్ 235

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున సువర శోభారాణి పోటీచేస్తుండగా,[9] లోక్‌సత్తా తరఫున బి.స్వాములు రంగంలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మొదట సంపత్ కుమార్‌కు కేటాయించగా[10] తర్వాత అబ్రహాంకు లభించింది.[11] తెలుగుదేశం పార్టీ తరఫున ప్రసన్న కుమార్, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.ఇందిర పోటీలో ఉన్నారు.

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

  • నాగన్న:
ఆలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన నాగన్న 4 నియోజకవర్గాల నుండి 4 సార్లు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తొలిసారిగా 1952లో ఆలంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికకాగా, రెండో సారి 1957లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. 1962లో వరుసగా మూడవసారి అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి విజయం సాధిమ్చగా, 1967లో నాలుగవసారి షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచాడు.
  • రావుల రవీంద్రనాథ్ రెడ్డి:
ఈ నియోజకవర్గం నుండి రావుల రవీంద్రనాథ్ రెడ్డు మూడు సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించాడు. 1985లో మొదటిసారి విజయం సాధించగా, 1989లో కూడా గెలిచి వరుసగా రెండో పర్యాయం శాసనసభఎలో అడుగుపెట్టాడు. 1999 ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించి మూడవసారి ఎమ్మేల్యే అయ్యాడు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల అతను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి 2004 ఎన్నికలలో తెరాస తరఫున పోటీచేసిననూ విజయం దక్కలేదు. మూడోస్థానంలో నిలిచాడు.
  • ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్:అలంపూర్ నియోజకవర్గ ప్రముఖులలో అత్యంత అభిమానులు కలిగి ఉన్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం వీరు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తెలంగాణ యూనిట్ కు రాష్ట్ర అద్యక్షులుగా ఉన్నారుఒక మారుమూల గ్రామం నుంచి సివిల్స్ రాసి IPS OFFICER అయ్యారు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రములలో S.P గాపలు జిల్లాలలో విధులు నిర్వర్తించారు SP స్థాయి నుండి ADGP వరకు పదోన్నతులు పొందారు పోలీస్ శాఖలో అత్యునతమైన అవార్డులతో పాటు రాష్ట్రపతి గారి నుంచి కూడా అవార్డ్స్ పొందారు ఊమ్మడి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు/కళాశాలలు కార్యదర్శిగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల / కళాశాలల కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు స్వేరోస్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులకు ఉన్నత చదువుల కోసం సాయం చేశారు .ప్రస్తుతం రాజకీయాలలో నిరుపేదల కోసం పోరాటం చేస్తున్నారు

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. Sakshi (28 November 2023). "2023 అలంపూర్‌ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్ళే." Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  3. Namaste Telangana (2 November 2023). "రికార్డు రిజల్ట్‌". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.
  4. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  5. Namasthe Telangana (12 April 2022). "శాసనసభ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
  6. EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  7. Eenadu (13 November 2023). "తొలి ప్రయత్నం.. వరించిన విజయం". EENADU. Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  8. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  9. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009
  10. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  11. సూర్య దినపత్రిక తేది 30-03-2009