Jump to content

పాగ పుల్లారెడ్డి

వికీపీడియా నుండి
పాగ పుల్లారెడ్డి
పాగ పుల్లారెడ్డి

నియోజకవర్గం గద్వాల శాసనసభ నియోజకవర్గం
(1952-57 & 1972-77)

వ్యక్తిగత వివరాలు

జననం 1919, మే 2
జల్లాపూర్
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం గద్వాల

ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడైన పాగ పుల్లారెడ్డి 1919, మే 2న జన్మించాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు మరణించగా గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 1947-48 కాలంలో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో విముక్తి కావడానికి చేపట్టిన ఉద్యమంలో చేరి చురుకుగా వ్యవహరించాడు. 3 మాసాలు గౌతు లచ్చన్న నిర్వహించిన సైనిక శిభిరంలో శిక్షణ పొంది కర్నూలు ప్రాంతం డిక్టేటరుగా నియమించబడ్డాడు. విమోచనోద్యమ అనంతరం 1952లో గద్వాల-ఆలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1968లో గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, 1972లో గద్వాల నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. 1984-87 కాలంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ గా పనిచేశాడు. కళారంగానికి ఎంతో కృషిచేసి కళారంగపోషకుడిగా పేరుపొందినాడు. 198లో గద్వాలలో లలితకళాభివృద్ధి సంఘం ఏర్పాటుచేయడమే కాకుండా బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. ప్రతినెల సాహితీసాంస్కృతిక కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించాడు.[1] 2010, అక్టోబరు 20న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. పాలమూరు జిల్లా నాటక కళా వైభవం, రచయిత దుప్పల్లి శ్రీరాములు, ప్రచురణ 2005, పేజీ 68