బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం
బెల్లంపల్లి | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాదు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఇది నూతనంగా ఏర్పడింది. అదిలాబాదు తూర్పువైపున ఉన్న ఈ నియోజకవర్గం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు[మార్చు]
అదిలాబాదు జిల్లాలో తూర్పు వైపున కల ఈ నియోజకవర్గానికి ఉత్తరాన సిర్పూర్, ఆసిఫాబాదు నియోజకవర్గాలు ఉండగా, దక్షిణాన చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున కొద్ది భాగం మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది.
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2009 గుండా మల్లేష్ సి.పి.ఐ. శంకర్ కాంగ్రెస్ పార్టీ 2014 దుర్గం చిన్నయ్య తె.రా.స గుండా మల్లేష్ సి.పి.ఐ. 2018 దుర్గం చిన్నయ్య తె.రా.స జి.వినోద్ బహుజన్ సమాజ్ పార్టీ
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున చిలుమల శంకర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున అమ్రాజుల శ్రీదేవి పోటీ చేశారు. మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సి.పి.ఐ.కు కేటాయించగా, ఆపార్టీ తరఫున గుండా మల్లేష్ పోటీచేయగా, లోక్‌సత్తా పార్టీ తరఫున బత్తుల మధు పోటిచేశాడు.