Jump to content

వేములవాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
వేములవాడ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°28′12″N 78°52′12″E మార్చు
పటం

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో వేములవాడ శాసనసభ నియోజకవర్గం ఒకటి. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో వేములవాడ శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాలు, జగిత్యాల జిల్లాలోని కథలాపూర్‌, భీమారం, మేడిపల్లి మండలాల్లో విస్తరించి ఉన్న వేములవాడ నియోజకవర్గంలో 2009లో 1,81,512 మంది ఓటర్లు ఉండగా, 2023లో ఆ సంఖ్య 2,22,302 మందికి పెరిగింది. 2009 నుంచి ఒక ఉప ఎన్నికతోపాటు మూడు సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌ వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 28 వేములవాడ జనరల్ ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 71451 చల్మెడ లక్ష్మీనరసింహారావు పు బీఆర్ఎస్ 56870
2018 28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీఆర్ఎస్ 84050 ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 55864
2014 28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీఆర్ఎస్ 58414 ఆది శ్రీనివాస్ పు బీజేపీ 53146
2010 ఉప ఎన్నిక వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీఆర్ఎస్ 79146 ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 28695
2009 28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీడీపీ 36601 ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 34780

శాసన సభ్యులు- రమేశ్ బాబు (టీఆర్ఎస్)

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేస్తుండగా, విద్యాసాగర్ రావు సోదరుడు సిరిసిల్ల శాసన సభ్యుడు రాజేశ్వరరావు కుమారుడు తెలుగుదేశం పార్టీకి చెందిన రమేశ్ బాబు మహాకూటమి తరఫున పోటీలో ఉండగా. కాంగ్రెస్ తరఫున వి.ఆదిశ్రీనివాస్ పోటీ చేసాడు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. ఈనాడు దినపత్రిక తేది 22-03-2009