అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]

  • హైదరాబాదు కార్పోరేషన్‌లోని కొన్ని భాగాలు
  • ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంతం

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

Year A. C. No. అసెంబ్లీ నియోజిక వర్గము Type of A.C. గెలిచిన అభ్యార్ది పేరు Gender Party Votes Runner UP Gender Party Votes
2014 59 అంబర్ పేట్ GEN జి.కిషన్ రెడ్డి పురుష భారతీయ జనతా పార్టీ 81430 ఆదెల సుధాకర్ రెడ్డి పురుష తెలంగాణ రాష్ట్ర సమితి 18832
2009 59 అంబర్ పేట్ GEN జి.కిషన్ రెడ్డి పురుష భారతీయ జనతా పార్టీ 59134 మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌ పురుష భారతీయ జాతీయ కాంగ్రెస్ 31891

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున జి.కిషన్ రెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రి ఫరీదుద్దీన్ పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జి, కిషన్ రెడ్డి తన సమిప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఫరీదుద్దీన్ పై 27వేలకుపైగా ఓట్ల మెజారిటీతో[2] విజయం సాధించి రెండో పర్యాయమ్ శాసనసభలో అడుగుపెట్టాడు.

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

జి. కిషన్ రెడ్డి.

జి.కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత.1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి 2010 మార్చి 6న భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్‌పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.2019 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం కేంద్రమంత్రిగా సాంస్క్రతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. సాక్షి దినపత్రిక, తేది 17-05-2009

వెలుపలి లంకెలు[మార్చు]