Jump to content

మక్కపాటి మంగళ

వికీపీడియా నుండి
Makkapati Mangala
మక్కపాటి మంగళ
జననండాక్టర్ మక్కపాటి మంగళ
గ్రామం : సెట్టిపల్లి ; మండలం : ఆమన‌గల్ ; రంగారెడ్డి జిల్లా తెలంగాణ
నివాస ప్రాంతంగ్రామం : గోఖలే నగర్, మండలం : రామంతాపూర్ ; ఉప్పల్ ; మేడ్చల్ జిల్లా తెలంగాణ భారత దేశముIndia
ప్రసిద్ధికవయిత్రి, స్వర్ణపుష్పం సంపాదకులు, ప్రచురణకర్త
మతంహిందూ
భాగస్వాములుమక్కపాటి నర్సింహారావు
పిల్లలుపూజిత, సాయి పునీత్
తండ్రిమల్లారావుగారు
తల్లిజయలక్ష్మి
వెబ్‌సైటు
https://swarnapushpammonthly.blogspot.in//

డాక్టర్ మక్కపాటి మంగళ హైదరాబాద్ కు చెందిన కవయిత్రి, స్వర్ణపుష్పం మాసపత్రిక ప్రధాన సంపాదకులు, ప్రచురణ కర్త .

జీవిత విశేషాలు

[మార్చు]

కవయిత్రిగా పసిద్ధిపొందిన మంగళ గారు జయలక్ష్మి మల్లారావు పుణ్యదంపతులకు జన్మించారు. మహోన్నత పుష్పాలతో మాలలల్లి,దేశమాత గళసీమలో వేసి ప్రపంచాన్ని ప్రేమిద్దాం అంటూ సమాజంలోని వివిధ సమస్యలను పరిష్కరించడానికి జాతి జాగృతికి శంఖారావం చేస్తూ మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తరతరాలకు అందిస్తూ భారతదేశ ఔనత్యాన్ని చాటుటకు విద్యార్థులను, మహిళలలు, చైతన్య పరుస్తూ నిరాదరణలో ఉన్న మన ఆలయాల సంరక్షణలో అందరిని ఉత్తేజ పరుస్తూ .. దేశ మాట పాదాలకు సంగీత, సాహిత్య, విద్య, వైద్య, సామాజిక అంశాలతో గుబాళించే స్వర్ణపుష్పంతో సేవచేస్తున్న భరతమాత ముద్దుబిడ్డ మక్కపాటి మంగళ [1]

విద్యాబ్యాసం

[మార్చు]

మక్కపాటి మంగళగారు ఎమ్. ఎస్.సి, బి,ఇ,డి. పూర్తి చేసి, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కమ్యూనికేషన్, జర్నలిజం చేశారు. అమెరికన్ థియోలాజికల్ విశ్వవిద్యాలయం, బర్కలీ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా నుండి డాక్టరేట్ అందుకున్నారు.

మంగళ గారి పుస్తకాల వివరాలు[2]

[మార్చు]
  • మహోన్నత పుష్పాలు {దేశభక్తి గీతాలు}
  • గేయ సంపుటి మార్గగామి {వ్యక్తిత్వ వికాసం}
  • స్వర్ణ పుష్పాలు {ఆడియో సిడి}
  • దేశభక్తి గీతాలు ప్రపంచాన్ని ప్రేమిద్దాం {సమాజంలో మన బాధ్యత}
  • ప్రేమ వర్షం {ప్రేమ, స్నేహం కవితలు}

అందుకున్న పురస్కారాలు

[మార్చు]
  • అష్టాక్షరి పురస్కారం
  • ఆరాధన ప్రతిభా పురస్కారం - పత్రికారంగం {జీవీఆర్‌}
  • మథర్ థెరిస్సా ఎక్స్ లెన్సీ అవార్డు
  • శ్రీ శక్తి పురస్కారం {కళా నిలయం}
  • శ్రీ శక్తి పురస్కారం {కమల భారతి మెమోరియల్ ట్రస్ట్}
  • మహిళా పురస్కారం {రాగసప్తస్వరం}
  • అడివి బాపిరాజు పురస్కారం
  • చైతన్య మహిళా పురస్కారం
  • నవరత్న మహిళా పురస్కారం.

మూలాలు

[మార్చు]
  1. అష్టాక్షరి మాసపత్రిక : మార్చి 2018: పేజీ నంబర్ : 44
  2. కిరణం మాసపత్రిక : మార్చి 2018: పేజీ నంబర్ : 39

బాహ్య లింకులు

[మార్చు]