ఆమన‌గల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆమన‌గల్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఆమన‌గల్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో ఆమన‌గల్ మండలం యొక్క స్థానము
ఆమన‌గల్ is located in Telangana
ఆమన‌గల్
తెలంగాణ పటములో ఆమన‌గల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°51′00″N 78°32′00″E / 16.8500°N 78.5333°E / 16.8500; 78.5333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము ఆమన‌గల్
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 62,034
 - పురుషులు 32,201
 - స్త్రీలు 29,833
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.90%
 - పురుషులు 60.33%
 - స్త్రీలు 32.47%
పిన్ కోడ్ 509321

ఆమన‌గల్ (Amangal) తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే ఏరు కల ఒక గ్రామము. ఇది హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్నది. పిన్ కోడ్ నం, 509 321., యస్.టీ.డీ.కోడ్=08543.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 62113. ఇందులో పురుషుల సంఖ్య 32291, స్త్రీల సంఖ్య 29822. అక్షరాస్యుల సంఖ్య 31348.[1]

నీటిపారుదల, భూమి వినియోగం[మార్చు]

మండలంలో 7 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 551 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]

విద్యాసంస్థలు[మార్చు]

 • ప్రభుత్వ నిర్వహణ లో బాల, బాలికలకు వేర్వేరుగా ఒక ప్రాథమిక, ఒక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
 • రెండు ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు ఉన్నాయి.
 • కె.ఆర్.డి.ఆర్.సహకార జూనియర్ కళాశాల ( స్థాపన : 1988-89)
 • ప్రభుత్వ జూనియర్ కళాశాల ( స్థాపన : 2001-02)
 • విజ్ఞాన్ గ్రామర్ ఉన్నత పాఠశాల
 • ఆమనగల్ గ్రామర్ ఉన్నత పాఠశాల
 • నలoద విద్యాలయం
 • ప్రతిభ విద్యానికేతన్(stapana : 1994)
 • లిటిల్ స్కాలర్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం)
 • నెతాజి విద్యాలయము(స్థాపన : 1985)

pragan high school

మైసిగండి మైసమ్మ దేవాలయం(ఎడమ వైపు)

దేవాలయాలు[మార్చు]

ఆమనగల్లుకు తూర్పున ఒక పురాతన హనుమాన్ దేవాలయం, పడమరన శివాలయం, దక్షిణాన మార్కండేయ దేవాలయం, ఉత్తరాన సాయిబాబా దేవాలయము ఊరి మధ్యలో పురాతన శివాలయం, వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి.

 • మైసిగండి రామాలయం.
 • నూతనంగా అయ్యప్పస్వామి దేవాలయాన్ని 2008, మే 2న విగ్రహ ప్రతిష్టాపన చేశారు.
 • శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం:-

వాసవాంబగా అర్పింపబడే శ్రీ కన్యకా పరమేశ్వరి ఈ గ్రామంలో కొలువుదీరి ఉంది. కన్యకగా వైశ్యకులంలో జన్మింంచి, మదాంధుడైన రాజుతో వివాహానికి తిరస్కరించి, దుర్గలో ఐక్యమైపోయిన, మహిమాన్వితురాలు.[3]

మైసిగండి మైసమ్మ దేవాలయం

ప్రభుత్వ కార్యాలయాలు[మార్చు]

 • గ్రామ సచివాలయము.
 • గ్రంథాలయము.
 • మండల రెవెన్యూ కార్యాలయము.
 • మండల ప్రజా పరిషత్ కార్యాలయము.
 • తంతి తపాల కార్యాలయము.
 • ప్రభుత్వ ఆసుపత్రి.

వినోదం[మార్చు]

 • శ్రీ వెంకటేశ్వర సినిమ హాలు
 • శ్రీనివాస సినిమ హాలు

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
 2. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
 3. ఈనాడు జిల్లా 23 ఆగస్టు 2013, 13వ పేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ఆమన‌గల్&oldid=1956540" నుండి వెలికితీశారు