బంగారు లక్ష్మణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు లక్ష్మణ్
(1939-2014)
బంగారు లక్ష్మణ్


రాజ్యసభ

సభ్యుడు
పదవీ కాలం
1996-2002

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
1999 – 2000

వ్యక్తిగత వివరాలు

జననం (1939-03-17)1939 మార్చి 17
శంషాబాదు
మరణం 2014 మార్చి 1(2014-03-01) (వయసు 74)
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కుమారైలు
మతం హిందూమతం

బంగారు లక్ష్మణ్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశాడు.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఈయన నర్సింహ, శివమ్మ దంపతులకు 1939 మార్చి 17, న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలోని సిద్దంతి బస్తీలోని అతి సామాన్య దళిత కుటుంబంలో జన్మించాడు. హైదరాబాద్ నాంపల్లి గవర్నమెంట్ హైస్కూలులో పదవ తరగతి వరకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చదివాడు. 12 ఏళ్ల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాడు. 1958 -69 వరకు రాష్ట్ర విద్యుత్ శాఖలోనూ, కేంద్ర రైల్వే, ఏజీ శాఖలలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి ఆ తరువాత జనసంఘ్‌లో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా చేరిపోయాడు.

వివాహం

[మార్చు]

1972 నవంబరు 6న సుశీలను వివాహం చేసుకున్నాడు. ఈయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమారైలు.

రాజకీయ జీవితం

[మార్చు]

బీహెచ్‌ఈఎల్, మిథానీ, ఎఫ్‌ఐసీ కార్మిక నాయకుడి బాధ్యతలు నిర్వహించిన ఈయన 1975లో అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు వెళ్ళాడు. 1986-88 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు. 1996లో రాజ్యసభకు ఎన్నికై 1999-2000 కాలంలో అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో రైల్వేశాఖ సహాయమంత్రిగా పనిచేశాడు. 2000-01 కాలంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈయన భార్య సుశీలా లక్ష్మణ్ 14వ లోకసభకు రాజస్థాన్ లోని జూలోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనది.

1978లో అప్పటి జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానూ, 1986లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వహించాడు. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఏడేళ్లు పనిచేశాడు. 1985- 86 మధ్య కాలంలో రాష్ట్ర శాసనమండలి సభ్యుడిగానూ, 1996లో గుజరాత్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగాను ఎన్నికయ్యాడు. వాజ్‌పేయ్ మంత్రివర్గంలో రైల్వే, ప్లానింగ్, ప్రోగామింగ్ మంత్రిత్వ శాఖల సహాయ మంత్రిగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు.

పదవులు

[మార్చు]
  • 12 ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా
  • 1958లో ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ ఎలక్ర్టిసిటీ బోర్డు, 1962లో ఇండియన్ రైల్వేబోర్డు అధికారి
  • 1969లో ఉద్యోగానికి రాజీనామా.. రాజకీయాల్లోకి ప్రవేశం
  • 1984లో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా
  • 1986-88 వరకూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా
  • 1999లో ఎన్డీయే హయాంలో వాజపేయి మంత్రివర్గంలో ప్రణాళికా వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా
  • 1999-2000లో రైల్వే శాఖ సహాయ మంత్రిగా
  • 2000-2001లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా

బాధ్యతలు నిర్వహించాడు

మరణం

[మార్చు]

తెహల్కా పరిశోధన కారణంగా 2012లో సీబీఐ కోర్టు ఈయనకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మణ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత నెల, ఫిబ్రవరి మూడోతేదీన సికిందరాబాద్ యశోదా ఆసుపత్రిలో చేరాడు. మూత్రపిండాలు, కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో ఈయనను ఐసీయూలో ఉంచే చికిత్స అందించారు. 2014 మార్చి 1న మధ్యాహ్నం 5.15 నిమిషాలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశాడు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]