అమిత్ షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అమిత్ షా
అమిత్ షా

అమిత్ షా


Assembly Member
for సర్‌ఖెజ్
పదవీ కాలం
2002 – 2007

సర్‌ఖెజ్ ప్రతినిధి - శాసనసభ సభ్యులు
పదవీ కాలం
2007 – 2012

Assembly Member
for నరాన్ పుర
పదవీ కాలం
2012 – Incumbent.

వ్యక్తిగత వివరాలు

జననం 1964 (age 56–57)
ముంబాయి, India[1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు అనిల్ చంద్ర షా
జీవిత భాగస్వామి సోనల్
సంతానం జే (కుమారుడు)
వృత్తి రాజకీయవేత్త
కేబినెట్ గుజరాత్ ప్రభుత్వము (2003–2010)
శాఖ రాష్ట్ర హోం మంత్రి
మతం జైనులు[2][3][4]

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు. గుజరాత్ రాష్ట్ర మాజీ గృహ మంత్రి. 2014 సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా తరుపున ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ గా నియమితులై 80 లోక్ సభ నియోజకవర్గాలకు గాను 73 సీట్లను భా.జ.పాకు అందించాడు. నరేంద్ర మోడికి నమ్మిన బంటు. సొహ్రాబుద్దీన్ ఎంకౌంటర్, పలు నేరారోపణలు కలిగిఉన్నాడు. భా.జ.పా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అమిత్ అనిల్ చంద్ర షా 1964 అక్టోబరు 22 న ముంబైలో స్థిరపడిన గుజరాతీ వ్యాపార కుటుంబంలో జన్మించారు. తండ్రి అనిల్ చంద్ర షా బొంబాయి స్టాక్ ఎక్చేంజి బ్రోకరింగ్ మరియు పి.వి.సి పైపుల వ్యాపారంలో ఉండేవారు.

అమిత్ షా అహ్మదాబాద్ లోని సి.యూ.షా సైన్స్ కళాశాలలో బయో కెమిస్ట్రీ లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి వ్యాపార రంగంలోకి ప్రవేశించి స్టాక్ మార్కెట్లు మరియు తమ కుటుంబ పైపులు వ్యాపారంలో విజయవంతంగా రాణించడం జరిగింది.

1987లో సోనాల్ షా తో వివాహం జరిగింది, వీరి కుమారుడు జై షా ప్రస్తుతం బి.సి.సి.ఐ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు.

రాజకీయ నేపధ్యము[మార్చు]

14 ఏళ్ళు వయస్సు లో ఆర్.ఎస్.ఎస్ లో బాల స్వయం సేవక్ గా చేరిన షా , తరువాత కాలంలో సంఘ్ సేవక్ గా కొనసాగుతూ వచ్చారు. విద్యార్థిగా ఉన్నప్పుడు సంఘ్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ లో చేరి గుజరాత్ విద్యార్థి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1987లో బీజేపీ పార్టీలో చేరి పార్టీ యువ విభాగం బిజెవై ఎం లో కీలకమైన నేతగా ఎదుగుతూ గుజరాత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా పనిచేశారు.

షా రాజకీయ జీవితంలో ముఖ్య మలుపు 1991లోక్ సభ ఎన్నికల్లో గాంధీ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కె.అద్వానీ తరుపున ఎన్నికల వ్యవహారాలు చూస్తూ ఆయన గెలుపునకు కృషి చేయడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం దృష్టిలో పడ్డారు. 1990 ల్లో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీని విస్తరణ చేపట్టేందుకు అప్పటి రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోడీ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా పలు యాత్రల పేరుతో పర్యటించి క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి పూనాదులు వేశారు.

1997లో సర్కేజ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీ లో అడ్డుపెట్టారు, కానీ రాజకీయంగా మరో మలుపు వచ్చింది మాత్రం 1999లో దేశంలోనే అతిపెద్ద సహకార బ్యాంకుల్లో ఒకటైన అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడు గా ఎంపికవ్వడంతో , నష్టాల్లో ఉన్న బ్యాంక్ ను అతి కొద్ది కాలంలోనే లాభాల్లో కి తీసుకురావడంలో షా తన సమర్థతను నిరూపించుకున్నారు.

2001లో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అవ్వడంతో గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గంలో చేరి 2012 వరకు రెవెన్యూ, ఆర్థిక , రవాణా, హోమ్ వంటి కీలకమైన మంత్రిత్వశాఖ లు సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. గుజరాత్ రాష్ట్రం యొక్క అభివృద్ధి లో కీలకపాత్ర పోషించడం జరిగింది.

1998,2001, 2007, 2012 లలో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహించడం జరిగింది.

2013లో బీజేపీ జాతీయ కార్యదర్శి గా నియమితులైన తరువాత 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేసి పార్టీని బ్రహ్మాండమైన మెజార్టీతో విజయతీరాలకు చేర్చడం జరిగింది, 2015లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు గా ఎన్నికైన తరువాత పార్టీని తూర్పు, ఈశాన్య , దక్షిణ భారత దేశాల్లో విస్తరణకు విశేషంగా కృషి చేయడం జరిగింది.2017లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవ్వడం జరిగింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో మరో సారి తన శాయశక్తులు వడ్డించి బీజేపీ కి మరో సారి బ్రహ్మాండమైన మెజారిటీతో కూడిన విజయాన్ని కట్టబెట్టడమే కాకుండా తానే స్వయంగా గాంధీ నగర్ లోక్ సభ నుండి పోటీ చేసి మంచి మెజారిటీ తో విజయం సాధించడం జరిగింది. 2019లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ మంత్రి గా భాద్యతలు చేపట్టడం జరిగింది. 2021లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సహకార శాఖ కు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=అమిత్_షా&oldid=3355596" నుండి వెలికితీశారు