సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సిర్పూర్
—  శాసనసభ నియోజకవర్గం  —
Sirpur assembly constituency.svg
సిర్పూర్ is located in Telangana
సిర్పూర్
అక్షాంశరేఖాంశాలు: 19°18′N 80°00′E / 19.3°N 80.0°E / 19.3; 80.0
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఆదిలాబాదు
ప్రభుత్వము
 - శాసనసభ సభ్యులు

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. భౌగోళికంగా అదిలాబాదు జిల్లా తూర్పువైపున ప్రాణహిత నది ఒడ్డున ఉన్న ఈ నియోజకవర్గం 1962 నుండి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థికి రెండేసి సార్లు గెలిపించింది. 1962 నుండి 1978 వరకు వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 1983, 1985, 1999 లలో తెలుగుదేశం గెలుపొందింది. 2004 ఎన్నికలలో విజయం కాంగ్రెస్‌కు వరించింది. ఈ నియోజకవర్గం మరో 6 అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రాష్ట్రంలోనే మొదటి నంబరు అసెంబ్లీ నియోజకవర్గం స్థానం ఈ నియోజకవర్గానికి లభించింది. ఇదివరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గం తొలి నంబరు ఉండగా ప్రస్తుతం ఆ స్థానం దీనికి లభించింది.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు[మార్చు]

అదిలాబాదులో తూర్పు వైపున కల ఈ నియోజకవర్గం తూర్పువైపున మరియు ఉత్తరాన మహారాష్ట్ర రాష్ట్రం సరిహద్దుగా ఉంది. దక్షిణాన ఇదే జిల్లాకు చెందిన బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సరిహద్దుగా ఉండగా, పశ్చిమాన ఆసిఫాబాదు నియోజకవర్గం ఉంది.

ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 బి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎం.బాలరామయ్య ఇండిపెండెంట్
1967 బి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ముక్తేశ్వర్ సింగ్ ఇండిపెండెంట్
1972 కె.వి.కేశవులు కాంగ్రెస్ పార్టీ బి.సి.గౌడ్ ఇండిపెండెంట్
1978 కె.వి.కేశవులు కాంగ్రెస్ పార్టీ సి.మాధవరెడ్డి జనతా పార్టీ
1983 కె.వి.నారాయణరావు తెలుగుదేశం పార్టీ కె.వి.కేశవులు కాంగ్రెస్ పార్టీ
1985 కె.వి.నారాయణరావు తెలుగుదేశం పార్టీ బి.జంకల ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ
1989 పాల్వాయి పురుషోత్తం రావు ఇండిపెండెంట్ కె.వి.నారాయణరావు తెలుగుదేశం పార్టీ
1994 పాల్వాయి పురుషోత్తం రావు ఇండిపెండెంట్ కె.వి.నారాయణరావు తెలుగుదేశం పార్టీ
1999 పాల్వాయి రాజ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ
2004 కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ పాల్వాయి రాజ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ
2009 కె.సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీ
2010 (ఉప ఎన్నిక) కావేటి సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి అల్లొల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 కోనేరు కోనప్ప బి.ఎస్.పి కావేటి సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో సిర్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనప్ప సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాల్వాయి రాజ్యలక్ష్మిపై 4319 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కోనప్పకు 55938 ఓట్లు రాగా, రాజ్యలక్ష్మి 51619 ఓట్లు సాధించింది. నియోజకవర్గంలో ఐదుగురు అభ్యర్థులు పోటీచేసిననూ ప్రధాన పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. పోలైన ఓట్లలో ఈ రెండూ అభ్యర్థులు కలిపి 92%కి పైగా ఓట్లు పొందినారు. రంగంలో ఉన్న మిగితా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
116418
కోనప్ప
  
48.5%
పాల్వాయి రాజ్యలక్ష్మి
  
44.3%
ఇతరులు
  
7.2%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు


క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 కోనప్ప కాంగ్రెస్ పార్టీ 55938
2 పాల్వాయి రాజ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ 51619
3 బ్రహ్మయ్య యాదగిరి ఇండిపెండెంట్ 3683
4 రవీందర్ నికోడే ఇండిపెండెంట్ 3403
5 షేక్ ఇబ్రహీం ఇండిపెండెంట్ 1775

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కావేటి సమ్మయ్య, భారతీయ జనతా పార్టీ నుండి ఘనపురం మురళీధర్, కాంగ్రెస్ పార్టీ తరఫున కోనేరు కోనప్ప[1] ప్రజారాజ్యం నుండి లెండుగురే మెంగాజీ పటేల్, బిఎస్పీ తరఫున రవీందర్ నికోడే, లోక్‌సత్తా పార్టీ తరఫున డుబ్బుల జనార్థన్ పోటీచేశారు. తెరాస అభ్యర్థి కావేటి సమ్మయ్య సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పపై ఏడు వేలకుపైగా మెజార్టితో విజయం సాధించాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, బిఎస్పీ అభ్యర్థులు మూడవ, నాలుగవ స్థానంలో నిలిచారు. తెరాస తరఫున విజయం సాధించిన కావేటు సమ్మయ్య తెలంగాణ ఊద్యమంలో భాగంగా ఫిబ్రవరి 2010లో శాసనసభ స్థానానికి రాజీనామా చేశాడు. దీనితో ఏర్పడిన ఖాళీ స్థానానికి జూలై 2010లో ఉప ఎన్నిక నిర్వహించబడుతున్నది.

2010 ఉప ఎన్నికలు[మార్చు]

తెరాస, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఫిబ్రవరి 2010లో రాజీనామా చేయడంతో ఏర్పడిన 12 ఖాళీ స్థానాలలో ఇది ఒకటి. 2010 జూలై 27న ఉప ఎన్నికలు నిర్వహించబడుతున్నవి. ఈ నియఒజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యలక్ష్మి, తెరాస తరఫున రాజీనామా చేసిన శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంద్రకరణ్ రెడ్డితో పాటు రికార్డు స్థాయిలో 52 ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 12-07-2010