Jump to content

కావేటి సమ్మయ్య

వికీపీడియా నుండి
కావేటి సమ్మయ్య
వ్యక్తిగత వివరాలు
జననం1952
కాగజ్‌నగర్‌, కొమరంభీం జిల్లా, తెలంగాణ
మరణంఏప్రిల్ 9, 2020
కాగజ్‌నగర్‌
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ (2007 వరకు)
2007-2020 తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామిసాయిలీల
సంతానంముగ్గురు కుమారులు
నివాసంకాగజ్‌నగర్‌

కావేటి సమ్మయ్య (1952 - ఏప్రిల్ 9, 2020) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 2009, 2011లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం

[మార్చు]

సమ్మయ్య 1952లో కొమరంభీం జిల్లా, కాగజ్‌నగర్‌లో జన్మించాడు.

రాజకీయరంగం

[మార్చు]

మొదట కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసిన కావేటి సమ్మయ్య, తెలంగాణ ఉద్యమంలో 2007లో కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎస్పీఎం మైదానంలో కెసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2009 టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలుపొంది, ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2010 జూలై 27న జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పాల్వాయి రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నుండి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితోపాటు రికార్డు స్థాయిలో 52 ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీచేయగా కావేటి సమ్మయ్య గెలుపొందాడు. 2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీచేసి, బీఎస్పి అభ్యర్థి కోనేరు కోనప్ప చేతిలో 8,837 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)లో సీటు రాకపోవడంతో టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ టీఆర్‌ఎస్ పార్టీకి వెళ్లాడు.[2] సమ్మయ్య భార్య సాయిలీల కాగజ్‌నగర్‌ పురపారక సంఘం ఛైర్ పర్సన్ గా పనిచేసింది.

మరణం

[మార్చు]

సమ్మయ్య 2020, ఏప్రిల్ 9న అనారోగ్యంతో కాగజ్‌నగర్‌లో మరణించాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, తాజా వార్తలు (9 April 2020). "మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి". www.eenadu.net. Archived from the original on 9 ఏప్రిల్ 2020. Retrieved 9 April 2020.
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (9 April 2020). "మాజీ ఎమ్మెలే కావేటి సమ్మయ్య కన్నుమూత". ntnews. Archived from the original on 9 April 2020. Retrieved 9 April 2020.
  3. ఆంధ్రజ్యోతి, వార్తలు (9 April 2020). "మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి". www.andhrajyothy.com. Archived from the original on 9 April 2020. Retrieved 9 April 2020.
  4. వార్త, తెలంగాణ (9 April 2020). "టిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మృతి". Vaartha. Archived from the original on 9 ఏప్రిల్ 2020. Retrieved 9 April 2020.
  5. TV9 (9 April 2020). "టీఆర్‌ఎస్ పార్టీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి". TV9 Telugu. Archived from the original on 9 ఏప్రిల్ 2020. Retrieved 9 April 2020.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)