కోనేరు కోనప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోనేరు కోనప్ప
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004-09, 2014-2018, 2018 - ఇప్పటి వరకు
నియోజకవర్గం సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబర్ 07, 1955
ఆదిలాబాద్, తెలంగాణ
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
సంతానం ప్రతిమ, వంశీకృష్ణ
నివాసం సిర్పూర్ కాగజ్ నగర్, తెలంగాణ

కోనేరు కోనప్ప, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కోనేరు కోనప్ప 26 జనవరి 2022న కొమరంభీం జిల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

కోనప్ప 1955, జూలై 10న సూర్యనారాయణ, కృష్ణవేణి దంపతులకు ఆదిలాబాదు జిల్లా, కాగజ్‌నగర్‌లో జన్మించాడు.[3][4] వ్యవసాయ కుటుంబానికి చెందిన కోనప్ప, 1975లో కాగజ్‌నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

కోనప్పకు రమాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (వంశీకృష్ణ), ఒక కుమార్తె (ప్రతిమ) ఉన్నారు.

రాజకీయ విశేషాలు[మార్చు]

పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కోనప్ప, 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ 12వ శాసనసభకు ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్తి పాల్వాయి రాజ్యలక్ష్మిపై గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు (2009)లో, ఆ తరువాత 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కావేటి సమ్మయ్య చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బహుజన సమాజ్ వాది పార్టీ టికెట్ పై పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కావేటి సమ్మయ్యపై 8,837 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుపై 24,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8]

సామాజిక కార్యక్రమాలు[మార్చు]

కోనప్ప ప్రతిరోజూ 1,000 మందికి ఉచిత ఆహారాన్ని అందించడం, పాఠశాలలకు టీవీ సెట్‌లను బహుమతిగా ఇవ్వడం, ఉపాధ్యాయులు, పోలీసు, మిలిటరీ, అటవీ ఉద్యోగాలకు హాజరయ్యే వారికి ఉచిత కోచింగ్ ఇవ్వడం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం, మహిళలకు పౌష్టికాహారం అందించడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.[9]

మూలాలు[మార్చు]

  1. "Koneru Konappa | MLA | Sirpur | Komaram Bheem | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-10. Retrieved 2021-09-25.
  2. Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  3. Andhrajyothi, Politicians Biography. "Koneru Konappa". www.andhrajyothy.com. Archived from the original on 14 December 2019. Retrieved 14 December 2019.
  4. https://www.telanganastateinfo.com/amp/tag/koneru-kannappa-cast/[permanent dead link]
  5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. https://m.gulte.com/news/36735/BSP-Will-Be-A-History-in-Telangana[permanent dead link]
  7. "Sirpur Election Result 2018 Live Updates: Koneru Konappa of TRS Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-09-25.
  8. https://www.news18.com/amp/news/politics/sirpur-election-result-201sirpur-election-result-2018-live-updates-koneru-konappa-of-trs-wins8-live-updates-koneru-konappa-of-trs-wins-1968559.html
  9. Telangana Today, Telangana (30 December 2020). "CM KCR's pat for MLA Koneru Konappa". Archived from the original on 31 December 2020. Retrieved 25 September 2021.