పాల్వాయి రాజ్యలక్ష్మి
పాల్వాయి రాజ్యలక్ష్మి | |||
మాజీ శాసనసభ్యురాలు
| |||
పదవీ కాలం 1999 - 2004 | |||
నియోజకవర్గం | సిర్పూర్ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1968 రెబ్బెన, బెజ్జూర్ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | పాల్వాయి పురుషోత్తమ రావు [1] | ||
సంతానం | పాల్వాయి హరీష్ బాబు [2][3] | ||
నివాసం | కాగజ్నగర్ |
పాల్వాయి రాజ్యలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె సిర్పూర్ నియోజకవర్గం 1999 నుండి 2004 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]రాజ్యలక్ష్మి తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాలో జన్మించింది. ఆమె కాగజ్నగర్ లోని బాల భారతి హైస్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకుంది.
రాజకీయ జీవితం
[మార్చు]పాల్వాయి రాజ్యలక్ష్మి తన భర్త పాల్వాయి పురుషోత్తమ రావు మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు కోనప్ప పై 29967 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యురాలిగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయింది. పాల్వాయి రాజ్యలక్ష్మి తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని విడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ ETV Bharat News (16 September 2019). "మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం రావు విగ్రహావిష్కరణ". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
- ↑ Deccan Chronicle (15 January 2018). "Many young professionals try their luck with politics in Adilabad" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
- ↑ The New Indian Express (20 February 2021). "No respite for grand old party as one more leader set to jump ship to BJP". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.
- ↑ Sakshi (4 April 2014). "రెండో రోజు ఐదు". Archived from the original on 4 December 2021. Retrieved 4 December 2021.