పాల్వాయి పురుషోత్తమ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాల్వాయి పురుషోత్తమ రావు

మాజీ శాసనసభ్యుడు

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ

పాల్వాయి పురుషోత్తమ రావు ఆదిలాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. వార్డు మెంబరుగా రాజకీయ జీవనం ఆరంభించి, ఉప సర్పంచిగా డిసిసిబి డైరెక్టరుగా, మండల అధ్యక్షులుగా, శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 1999లో 49 సంవత్సరాల వయస్సులో నక్సలైట్ల దాడిలో మరణించారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

పాల్వాయి పురుషోత్తమ రావు ప్రారంభంలో రెబ్బెన గ్రామ పంచాయతి వార్డు మెంబరుగా ఎన్నికై ఉపసర్పంచిగా పనిచేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టరుగా ఎన్నికయ్యారు. 1987లో మండల అధ్యక్షులైనారు. 1989, 1999లలో శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు నక్సలైట్ల తూటాలకు బలయ్యారు.