సార్వత్రిక సమన్వయ సమయం
Appearance
(UTC నుండి దారిమార్పు చెందింది)
సార్వత్రిక సమన్వయ సమయం, (ఆంగ్లం: Coordinated Universal Time , ఫ్రెంచ్: Temps universel coordonné) లేదా UTC లేదా సా.స.స ప్రపంచమంతా అంగీకరించబడిన విశ్వకాల ప్రామాణికం.[1] యూటీసీ ఒక కాల ప్రామాణికేమే కానీ ఒక సమయ ప్రాంతం కాదు. ఈ సమయం ఖచ్చితత్వం 0o రేఖాంశం వద్ద సౌరమాన సమయానికి 1 సెకండ్ లోపే ఉంటుంది. [2] ఒకప్పుడు ప్రాచుర్యంలో వున్న గ్రెనిచ్ మీన్ టైం (GMT) ప్రామాణికకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది. ప్రపంచంలో వున్న సమయ ప్రాంతాలు ఈ యూటీసీ ఆధారంగా తమ తమ సమయాల్ని గుర్తిస్తారు. ఉదాహరణకి భారత కాలమానాన్ని UTC + 5:30 గా రాయవచ్చు. అనగా భారతదేశం సార్వత్రిక సమన్వయ కాలానికంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుందని అర్థం.
మూలాలు
[మార్చు]- ↑ "COORDINATED UNIVERSAL TIME (UTC)" (PDF). Retrieved April 23, 2017.
- ↑ Guinot, Bernard (August 2011). "Solar time, legal time, time in use". Metrologica. 48 (4): S181–185. Bibcode:2011Metro..48S.181G. doi:10.1088/0026-1394/48/4/S08.