చెన్నమనేని రమేష్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చెన్నమనేని రమేష్ బాబు
Chennamaneni Ramesh Babu.jpg
శాసన సభ్యుడుః
Assumed office
2009
నియోజకవర్గంవేములవాడ
వ్యక్తిగత వివరాలు
జననం (1956-02-03) 1956 ఫిబ్రవరి 3 (వయసు 67)
కరీంనగర్, తెలంగాణ, భారతదేశం
పౌరసత్వంభారతదేశం (1993 వరకు; 2008–ప్రస్తుతం)
జర్మనీ (1993–2008)
రాజకీయ పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి (2010–ప్రస్తుతం)
ఇతర రాజకీయ
పదవులు
తెలుగుదేశం పార్టీ (2009–2010)
జీవిత భాగస్వామిమరియా
సంతానంఇద్దరు కుమారులు, ఒక కుమార్తె
తండ్రిచెన్నమనేని రాజేశ్వరరావు
బంధువులుసి.హెచ్.విద్యాసాగర్ రావు (బాబాయి)
చెన్నమనేని హన్మంతరావు (బాబాయి)
నివాసంహైదరాబాదు, తెలంగాణ,
చదువుబిఎస్సీ, ఎంఎస్సీ (అగ్రికల్చర్)
పిహెచ్.డి. (బెర్లిన్ హంబోల్ట్ యూనివర్సిటీ)

చెన్నమనేని రమేష్ బాబు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున వేములవాడ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

చెన్నమనేని రమేష్ 1956, ఫిబ్రవరి 3న ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు, లలిత దేవి దంపతులకు తెలంగాణలోని కరీంనగర్‌లో జన్మించాడు.[2] అతని తండ్రి రాజేశ్వరరావు (1923 - 2016) కమ్యూనిస్ట్ నాయకుడు. అతని బాబాయి సి. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశాడు.[3] ఈయన జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. లీప్‌జిగ్‌లో ఎంఎస్సీ అగ్రికల్చర్,[4] 1987లో బెర్లిన్ హంబోల్ట్ యూనివర్సిటీ నుండి పిహెచ్.డి. పూర్తిచేశాడు.[5]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రమేష్ కు మరియా (జర్మన్ పౌరురాలు)తో వివాహం జరిగింది.[6] వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[7]

రాజకీయ విశేషాలు[మార్చు]

2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు.[8] ఆ తరువాత 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2010లో జరిగిన వేములవాడ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శాసన సభ్యునిగా గెలుపొందాడు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున వేములవాడ శాసనసభకు పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 5,268 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2016-2018 మధ్యకాలంలో తెలంగాణ శాసనసభలోని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. తరువాత 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ తరపున వేములవాడ శాసనసభకు పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[9][10] 2019 నుండి తెలంగాణ శాసనసభలోని సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు.

ఇతర వివరాలు[మార్చు]

రమేష్ ఉద్యోగ నిమిత్తం 1990లలో జర్మనీ దేశానికి వెళ్లాడు. అతనికి 1993లో జర్మన్ పౌరసత్వం రావడంతో అతని భారతీయ పాస్‌పోర్ట్‌ను అప్పగించాడు. తరువాత మళ్ళీ 2008లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంజూరు చేసే భారతీయ పౌరసత్వం కోసం తిరిగి దరఖాస్తు చేసుకున్నాడు.[11] అయితే, నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా రమేష్ పౌరసత్వం పొందారని ఆరోపణలు రావడంతో, కోర్టులో కేసు నడుస్తోంది.

మూలాలు[మార్చు]

 1. "Ramesh Chennamaneni(TRS):Constituency- VEMULAWADA(KARIMNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-25.
 2. "Member's Profile - Telangana Legislature: SRI CHENNAMANENI RAMESH". Telangana Legislature. Archived from the original on 2021-05-07. Retrieved 2021-08-25.
 3. Nichenametla, Prasad (2019-11-22). "Why Chennamaneni Ramesh, a 4-time Telangana MLA, has been stripped of Indian citizenship". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
 4. Rao, Ch Sushil (6 September 2017). "Chennamaneni Ramesh: Ramesh to contest MHA move to cancel dual citizenship". The Times of India. Retrieved 2021-08-25.{{cite web}}: CS1 maint: url-status (link)
 5. Nichenametla, Prasad (2019-11-22). "Why Chennamaneni Ramesh, a 4-time Telangana MLA, has been stripped of Indian citizenship". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
 6. DC Correspondent (15 August 2013). "MLA to appeal against High Court order". Deccan Chronicle. Retrieved 5 May 2021.
 7. "Member's Profile - Telangana Legislature: SRI CHENNAMANENI RAMESH". Telangana Legislature. Archived from the original on 2021-05-07. Retrieved 2021-08-25.
 8. Nichenametla, Prasad (2019-11-22). "Why Chennamaneni Ramesh, a 4-time Telangana MLA, has been stripped of Indian citizenship". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
 9. చెన్నమనేని రమేష్ బాబు. "Vemulawada Election Result 2018 Live Updates: Ramesh Chennamaneni of TRS Wins". న్యూస్18. Retrieved 2021-08-25.
 10. Nichenametla, Prasad (2019-11-22). "Why Chennamaneni Ramesh, a 4-time Telangana MLA, has been stripped of Indian citizenship". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
 11. "TRS MLA Chennamaneni Ramesh is German citizen: Centre again tells court". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-02-04. Retrieved 2021-08-25.