Jump to content

కథలాపూర్‌ మండలం

కథలాపూర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

కథలాపూర్‌
  మండలం  
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, కథలాపూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, కథలాపూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, కథలాపూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°43′11″N 78°40′52″E / 18.719747°N 78.681221°E / 18.719747; 78.681221
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం కత్లాపూర్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 182 km² (70.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 43,986
 - పురుషులు 20,891
 - స్త్రీలు 23,095
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.96%
 - పురుషులు 60.76%
 - స్త్రీలు 32.51%
పిన్‌కోడ్ 505462

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోరుట్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జగిత్యాల డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కోరుట్ల నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం కథలాపూర్.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 43,986 - పురుషులు 20,891- స్త్రీలు 23,095

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 182 చ.కి.మీ. కాగా, జనాభా 43,986. జనాభాలో పురుషులు 20,891 కాగా, స్త్రీల సంఖ్య 23,095. మండలంలో 11,660 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.

[మార్చు]

లోగడ కత్లాపూర్ గ్రామం/ మండలం  కరీంనగర్ జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కత్లాపూర్ మండలాన్ని (1+18) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా, కొత్తగా ఏర్పాటైన మెట్‌పల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సిరికొండ
  2. తక్కళ్ళపల్లి
  3. బొమ్మెన
  4. దూలూర్
  5. కథలాపూర్
  6. పెగ్గెర్ల
  7. ఊటుపల్లి
  8. భూషణ్‌రావుపేట
  9. చింతకుంట
  10. దుంపెట
  11. పోసానిపేట
  12. గంభీర్‌పూర్
  13. తాండ్రియాల్
  14. ఇప్పాపల్లి
  15. పోతారం
  16. కలికోట
  17. అంబారిపేట్
  18. తుర్తి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). the original (PDF) నుండి 2019-04-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2019-01-26.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2022-01-06 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు

[మార్చు]