సారంగపూర్ మండలం (జగిత్యాల జిల్లా)
సారంగపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]
సారంగాపూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°56′41″N 78°59′37″E / 18.944609°N 78.993645°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జగిత్యాల జిల్లా |
మండల కేంద్రం | సారంగాపూర్ (జగిత్యాల జిల్లా) |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 142 km² (54.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 45,006 |
- పురుషులు | 21,909 |
- స్త్రీలు | 23,097 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 35.73% |
- పురుషులు | 48.72% |
- స్త్రీలు | 23.50% |
పిన్కోడ్ | 505454 |
ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జగిత్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం సారంగాపూర్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 45,006 - పురుషుల సంఖ్య 21,909 - స్త్రీల సంఖ్య 23,097. అక్షరాస్యత మొత్తం 35.73% - పురుషుల అక్షరాస్యత 48.72% - స్త్రీల అక్షరాస్యత 23.50%.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 142 చ.కి.మీ. కాగా, జనాభా 24,093. జనాభాలో పురుషులు 11,781 కాగా, స్త్రీల సంఖ్య 12,312. మండలంలో 6,403 గృహాలున్నాయి.[3]
కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.
[మార్చు]లోగడ సారంగాపూర్ గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సారంగాపూర్ మండలాన్ని (1+11) పన్నెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సారంగపూర్
- బత్తపల్లి
- పోతారం
- అర్పపల్లి
- లక్ష్మిదేవిపల్లి
- పెంబెట్ల
- కోనాపూర్
- లచ్చక్కపేట్
- నగునూర్
- రంగపేట్
- రేచపల్లి
- గణేష్పల్లి
- మోతీనగర్
- కొమాన్పల్లి (సారంగాపూర్)
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-01-27.
- ↑ "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016